1000 కోట్ల బొమ్మకి 100 కోట్ల రిపేరు.. ఎన్టీఆర్ వల్లే కొంపకొల్లేరు..!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హిందీలో చేస్తున్నమూవీ వార్ 2. ఈ సినిమా ఎప్పుడో డిసెంబర్ లో షూటింగ్ పూర్తవ్వాలి.. కాని రీషూట్లు, రిపేర్ల వల్లే డిలే అవుతోంది. అంతటికీ కారణం ఎన్టీఆరే అని తెలుస్తోంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హిందీలో చేస్తున్నమూవీ వార్ 2. ఈ సినిమా ఎప్పుడో డిసెంబర్ లో షూటింగ్ పూర్తవ్వాలి.. కాని రీషూట్లు, రిపేర్ల వల్లే డిలే అవుతోంది. అంతటికీ కారణం ఎన్టీఆరే అని తెలుస్తోంది. అసలే ఇద్దరు భారీ స్టార్లు కలిసి చేస్తున్నమూవీ, ఈజీగా 1000 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉన్న ప్రాజెక్ట్… అలాంటి మూవీకి ఇన్ని రీషూట్లు… ఇన్ని రిపేలర్లా..? విచిత్రంగా వీటన్నీంటికి కారణం ఎన్టీఆరా..? ఈ డౌటే అందరికీ షాక్ ఇస్తోంది. మరి సినిమా నిర్మాత ఆదిత్య చోప్రా ఈమూవీ రషెస్ చూసి, ఎన్టీఆర్ కి ఫిదా అయ్యాడన్నారు… మరో హిందీ ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేశాడన్నారు.. అదే నిజమైతే, వార్ 2 మూవీ రిపేర్లు, రీషూట్లకి ఎన్టీఆర్ ఎలా కారణమయ్యాడు..? అక్కడే ట్విస్ట్ ఉంది. ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ కి హ్రితిక్ రోషన్ ఎమోషన్స్ కి మ్యాచ్ కాని సీన్లే ఎక్కువున్నాయట. సో ముందు తారక్ ని తక్కువ అంచనా వేశారో, లేదంటే మరో కారణమింకేమైనా ఉందో కాని, వార్ 2 మొదటి 10 షెడ్యూల్స్ ఔట్ పుట్ ఏం బాలేదట. ఎన్టీఆర్ కి హ్రితిక్ ఏమాత్రం మ్యాచ్ కావట్లేదనే నిర్మాత కామెంట్ తోనే రీషూట్లు, రిపేర్లు పెరిగాయా? అందుకే ఎప్పుడో పూర్తవ్వాల్సిన సినిమా మళ్లీ మళ్లీ రిపేర్లకే గురౌతోందా? చూసేయండి.
వార్ 2 మూవీ ఎప్పుడో నవంబర్ లేదంటే డిసెంబర్ లోనే షూటింగ్ ని పూర్తి చేసుకోవాలి. కాని డైలీ సీరియల్ లా ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగటానికి కారణం ఎన్టీఆర్ అంటే ఎవరైనా నమ్ముతారా…? నిజమే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వల్లే వార్2 మూవీ కి రిపేర్లు, రీషూట్టు అవుతున్నాయి. అదే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గర్వపడేలా చేస్తోంది. అయినా తన వల్ల రీషూట్లు, రిపేర్లు అవుతున్నాయంటే తన ఫ్యాన్స్ కంగారు పడాలి.. కాని సంతోషపడటమేంటనే డౌట్ ఎవరికైనా వస్తుంది.ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వార్ 2 మూవీ షూటింగ్ మొదటి పది షెడ్యూల్స్ చాలా వేగ్ గా తీశారట. కారణం ఎన్టీఆర్ ని తక్కువ అంచనా వేయటమనే కామెంట్లు వస్తున్నాయి. సినిమా రిలీజ్ కాకముందే కామెంట్లలో ఇలాంటి క్లారిటీ రావటానికి రీజన్, సెట్లో లీకులే..
అసలు సంగతేంటంటే, వార్ 2 లో ఎన్టీఆర్ విలన్ గా నటించటమే కాదు, పాత్ర లో జీవించేశాడని తెలుస్తోంది. నిర్మాతకు కూడా తన పెర్పామెన్స్ నచ్చి, తన పాత్రలో ఇండివిడ్యువల్ గా మరో ప్రాజెక్ట్ ప్లాన్ చేద్దామన్నాడట. ఐతే, ఈ సినిమా రషెస్ చూస్తుంటే, విలన్ గా తారక్ పెర్ఫామెన్స్ ముందు హ్రితిక్ పెర్ఫామెన్స్ తేలిపోయిందని, ఎక్కడ ఇద్దరి విడి విడి పెర్ఫామెన్స్ కి మ్యాచ్ అవ్వట్లేదనేది నిర్మాత కామెంట్.యష్ చోప్రా బ్యానర్ అంటేనే బాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌజ్ మాత్రమే కాదు, పర్ఫెక్షన్ కి కేరాఫ్ అడ్రస్… ఎన్టీఆర్ సీన్స్ లో ఇంటెన్సిటీ ఉంటే, హ్రితిక్ తో తీసిన సీన్స్ లో ఆ ఇంటెన్సిటీ మిస్ అయ్యిందట. అందుకే తన సీన్లు రీషూట్లు చేయటం వల్లే ఇంత డిలే అవుతోందట. అదే కాదు ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ కాంబినేషన్ సీన్స్ లో దాదాపు 60 శాతం రీషూట్లు, రిపేర్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.
హ్రితిక్ హీరోగా, తారక్ విలన్ గా నటిస్తున్నప్పుడు, విలన్ రోల్ బాగుండి, హీరో పాత్ర తేలిపోతే, సినిమా బొక్కబోర్లా పడుతుంద. అందుకే హీరో పాత్రని రీ వ్రైట్ చేయటమే కాదు, రీషూట్లు, రిపేర్లు చేస్తున్నారు. ఈ న్యూస్ తోనే ఎన్టీఆర్ ఇందులో విలన్ గా బాలీవుడ్ బాక్స్ బద్దలు చేస్తాడా అన్న, అంచనాలు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా వార్2 లో విలన్ పాత్రలో అడుగుపెట్టి నిజంగా ఎన్టీఆర్ సాలిడ్ డిసీజన్ తీసుకున్నాడనే మాటలు ఇప్పుడు పెరిగాయి.