Kalki : ఒక్కో ఏరియాకు 100 కోట్లు…
పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ (Star Prabhas) నటిస్తున్న కల్కి 2898 ఏడి (Kalki 2898 AD) మూవీ పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. వైజయంతీ మూవీస్ బ్యానర్ (Vyjayanthi Movies Banner) పై సి అశ్వినిదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

100 crores for Pan India Kalki movie shooting
పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ (Star Prabhas) నటిస్తున్న కల్కి 2898 ఏడి (Kalki 2898 AD) మూవీ పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. వైజయంతీ మూవీస్ బ్యానర్ (Vyjayanthi Movies Banner) పై సి అశ్వినిదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దిశా పటాని, కమల్ హాసన్ కీలక పాత్రలు చేస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది
ఇదిలా ఉంటే.. కల్కి సినిమాకు రికార్డ్ రేంజ్ బిజినెస్ జరుగుతున్నట్టుగా ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నాన్ థియేట్రికల్ బిజినెస్ కోసం భారీ డీల్ జరిగిందని వార్తలు వచ్చాయి.అలాగే థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతున్నట్టుగా చెబుతున్నారు. ఒక్కో ఏరియాకు వంద కోట్లకు తక్కువ డిమాండ్ చేయడం లేదట మేకర్స్. గతంలో ఓవర్సీస్ రైట్స్ కోసం వంద కోట్లు కోట్ చేస్తున్నారని టాక్ వచ్చింది. అలాగే.. ఒక్క నైజాంలోనే 100 కోట్లకి పైగా ఆఫర్ వచ్చిందని అన్నారు.
ఇక ఇప్పుడు ఏపీలో కూడా భారీగా కోట్ చేస్తున్నట్టుగా సమాచారం. లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం.. ఏపీ మొత్తంగా 100 కోట్లకి పైగా డిమాండ్ చేస్తున్నారట మేకర్స్. ఇదే నిజమైతే.. కేవలం ఏపీ, తెలంగాణలోనే కల్కికి ఏకంగా 200 కోట్లకి పైగా బిజినెస్ జరిగినట్టే. ఇక మొత్తంగా కలుపుకుంటే.. కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసేలా ఉందంటున్నారు. మరి.. ఫైనల్‌గా కల్కికి ఏ రేంజ్ బిజినెస్ జరుగుతుందో చూడాలి.