1000 కోట్ల బడ్జెట్… 2 వేల కోట్ల బిజినెస్… 5 వేల కోట్ల ప్రాఫిట్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, చరిత్ర స్రుష్టించబోతున్నాడా? రాజమౌళిసినిమా చేస్తేహిట్ వస్తుంది.. మార్కెట్ పెరుగుతుంది. అంతవరకు ఓకే కాని, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫేట్ పదేళ్ల క్రితం మారినప్పుడు, ఓ పాన్ ఇండియా కింగ్ ఇండియాకి పరిచయమయ్యాడు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, చరిత్ర స్రుష్టించబోతున్నాడా? రాజమౌళిసినిమా చేస్తేహిట్ వస్తుంది.. మార్కెట్ పెరుగుతుంది. అంతవరకు ఓకే కాని, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫేట్ పదేళ్ల క్రితం మారినప్పుడు, ఓ పాన్ ఇండియా కింగ్ ఇండియాకి పరిచయమయ్యాడు. తనే రెబల్ స్టార్ ప్రభాస్… ఇప్పుడు వరల్డ్ మార్కెట్ కి పాన్ వరల్డ్ కింగ్ ని పరిచయం చేయబోతున్నారా? రాజమౌలి ఎంత గొప్ప దర్శకుడైనా, హాలీవుడ్, కొరియా, ఇలా చాలా ఫిల్మ్ ఇండస్ట్రీలు వందేళ్ల క్రితమే, మరో వందేళ్లు గుర్తుండే సినిమాలు తీశారు.. అలాంటి వరల్డ్ మార్కెట్ గేట్లు బద్దలు కొట్టాలంటే ఆల్ మోస్ట్ అసాధ్యం.. కాని అదే సాధ్యమయ్యేలా ఉంది. రాజమౌళి ప్లానింగ్ ఎలా ఉందో చూస్తే ఆ విషయం అర్ధమౌతుంది.. మామూలుగా కాదు, సైలెంట్ గా సునామీనే తెచ్చేలా ప్లాన్ చేశాడు… అదెలానో లెక్కలతో సహా చూసేయండి…
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీసే సినిమా బడ్జెట్ కనీసం 1000 కోట్లన్నాడు దర్శక నిర్మాత తమ్మారెడ్డిభరద్వాజ…అంతేకాదు రిలీజ్ కి ముందే రెండు వేల కోట్ల బిజినెస్ కూడా చేసి, విడుదలయ్యాక కనీసం 3, 4 వేల కోట్ల వసూళ్లు రాబడుతుందని జోస్యం చెప్పాడు. ఆల్రెడీ తన మాటలు సోష్ మీడియాలో వైరలయ్యాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ లో పూనకాలు తెచ్చాయి.
తమ్మారెడ్డి భరద్వాజ మాటలెలా ఉన్నా… నిజంగానే పాన్ వరల్డ్ గేట్లు బద్దలు కొట్టబోయేదే మహేశ్ బాబు మూవీ… అందుకు సాలిడ్ లాజిక్స్ సపోర్ట్ చేస్తున్నాయి. ఎగ్జాక్ట్ గా తొమ్మిదిన్నరేళ్లు… అంటే సుమారు పదేళ్ల క్రితం బాహుబలి వచ్చే ముందు వరకు తెలుగు సినిమా మార్కెట్ 100 కోట్లు…కాని బాహుబలి వచ్చి బాలీవుడ్ గేట్లు బద్దలు కొట్టి, సౌత్ నార్త్ తేడా లేకుండా చేసింది.. 500 కోట్లు రాబట్టింది
బాహుబలి 2 వచ్చి 1850 కోట్ల వసూళ్లతో తెలుగు సినిమా స్టామినాని 100 నుంచి 2 వేల కోట్లకుపెంచింది. సో అలా జరగటం వల్లే సౌత్, నార్త్ మధ్య గోడలు కూల్చి పాన్ ఇండియా కింగ్ అయ్యాడు రెబల్ స్టార్ ప్రభాస్. అచ్చంగా అలాంటి సిచ్చువేషనే ఇప్పుడు రాబోతోంది
ప్రపంచ మార్కెట్ లో ఇండియన్ సినిమా అంటే పాటలు, రొమాన్స్ అనే అభిప్రాయం ఉన్న జనాలకు, అసలు సినిమాను పరిచయం చేయబోతున్నాడు రాజమౌలి. అదే జరిగితే పదేళ్ల క్రితం, సౌత్, నార్త్ మార్కెట్ మధ్య అడ్డుగోడల్ని కూల్చినట్టే, వరల్డ్ మార్కెట్ కి ఇండియన్ సినిమాకు అడ్డు పడే అభిప్రాయాలను కూల్చబోతున్నాడు రాజమౌైలి. అదే జరిగితే, వరల్డ్ మార్కెట్ గేట్లు బద్దలు కొట్టిన హీరోగా మహేశ్ బాబు హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది..
సూపర్ స్టార్ మహేశ్ తో రాజమౌళి తీయబోయే సినిమా పాన్ వరల్డ్ గేట్లు తెరవాలంటే కనీసం 5 వేల కోట్ల వసూళ్లు రాబట్టాలి.. అదే జరిగితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే , వరల్డ్ మార్కెట్ కి దారి తెరిచిన వ్యక్తులుగా మహేశ్ బాబు, రాజమౌళి పేరు రీసౌండ్ చేసే ఛాన్స్ఉంది… ప్లానింగ్ కూడా వరల్డ్ వైడ్ ఆర్టిస్ట్ లతో సైలెంట్ గా చేసేస్తున్నాడు రాజమౌలి.