1000 కోట్ల గ్లోబల్ నజరానా.. క్రికెట్, కుస్తీ, కబాడ్డి …
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని సడన్ గా క్రికెటర్ వీరాట్ కొహ్లీ పూనాడా..? లేదంటే రోహిత్ శర్మ ని వెండితెరమీద చూపించేందుకు చరణే రంగంలోకి దిగాడా...?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని సడన్ గా క్రికెటర్ వీరాట్ కొహ్లీ పూనాడా..? లేదంటే రోహిత్ శర్మ ని వెండితెరమీద చూపించేందుకు చరణే రంగంలోకి దిగాడా…? ఈ డౌట్లు రావటానికి 1000 ఫ్లడ్ లైట్లు… 24 మంది క్రికెట్ ప్లేయర్లు, వీళ్లే కారణం… అంతగా సెట్లో సెన్సేషన్ మొదలైంది. 100 ఎకరాల్లో క్రికెట్ వార్ జరిగింది. క్రికెట్ వార్ అంటే అదేదో సినిమావాల్లేడే క్రికెట్ లీగ్ కాదు… ఛారిటీకోసం పోటీ పడే ఆట కూడా కాదు.. పక్కగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ గేమ్… కాని అందులో వీరాట్ కొహ్లీనే మించిపోయేలా ఉన్నాడు రామ్ చరణ్. ఆల్రెడీ పిచ్ మీద బ్యాడ్ తో బంతిని ఓ ఆట ఆడుకున్నాడు. ఎమ్మెస్ థోనితో కలిసి తన బ్యాట్ తో హెలికాప్టర్ షాట్ ఆడేశాడు. అంతా అయిపోయింది. ఇక మిగిలింది మనకు చుక్కలు చూపించటమే… అందుకోసం కబడ్డి కబడ్డి అనుకుంటూ వస్తున్నాడు. తొడ కొడుతూ మీసం మెలేస్తున్నాడు… వెయ్యికోట్ల నజరానా కోసం క్రికేటే కాదు, కబడ్డితో కుస్తీ పట్టేందుకు కూడా సిద్దపడ్డాడు చరణ్… సో వెయ్యికోట్ల ఆటలతో, ఈ కొట్లాటేంటో చూసేయండి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బ్యాట్ పట్టాడు. బంతిని బౌండరీకి పంపించాడు. తనే కాదు తనతోపాటు సీన్ లోకి ఇండియన్ మాజీ క్రికెట్ ప్లేయర్ ఎమ్మెస్ థోనీ రంగంలోకి దిగాడు. ఐతే తను కూడా ఆశ్చర్యపోయేలా విరాట్ కొహ్లీని మించేలా ట్వంటీ ట్వంటీ అంటే ఏంటో చరణ్, సినిమా యాంగిల్ లో చూపించాడు. అంటే బుచ్చి బాబు మేకింగ్ లో తను చేస్తున్న పెద్దిలో చరన్ వేసేది క్రికెటర్ పాత్రా అంటే ఔనని, కాదని రెండూ ఆన్సర్లు వస్తున్నాయి.ఎందుకంటే పెద్ది సినిమా నిజాకి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తోనే తెరకెక్కుతున్నా, ఇది శ్రీకాకులం బాహుబలి కోడి రామమూర్తి బయోపిక్ అని ప్రచారం జరిగింది. కాని రియాలిటీ చూస్తుంటే అది కేవలం ప్రేరణ మాత్రమే అని తేలింది. ఎందుకంటే చరణ్ మూవీలో ట్వంటీ ట్వీంటీ లాంటి క్రికెట్ గేమ్ ఉండటమేంటి..? ఒక వేల ఇది పీరియాడికల్ డ్రామానే అయితే, నైంటీన్ ఫిఫ్టీస్ లో అసలు ట్వంటీ ట్వంటీ క్రికెటే లేదు.
కాని ఈమూవీలో ఏకంగా వెయ్యి ఫ్లడ్ లైట్ల మధ్య భారీ ఎత్తున ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ని షూట్ చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెస్ థోనీ ఇందులో చరణ్ తో కలిసి క్రికెట్ ఆడినట్టు నటించాడనే సెన్సేషనల్ న్యూస్ మెల్లిగా లీకైంది. ఐతే తనది గెస్ట్ రోలా? లేదంటే నిజంగా ఇండియన్ క్రికెట్ టీం తాలూకు ఏదైనా రియల్ ఇన్స్ డెంట్ ని ఇలా తీశారా? అన్నది తేలలేదు.అలాని ఇదేదో హిందీ మూవీ లగాన్ లేదంటే కపిల్ దేవ్ బయోపిక్ 83 లాంటి మూవీనో అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఇందులో కుస్తీ పోటీలున్నాయి… కబడ్డి, కోకో కూడా హీరో ఆడతాడని తెలుస్తోంది. పీరియాడిక్ కిక్ ఇచ్చే ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండబోతోంది…. ఇవన్నీ కావాలనే ఫిల్మ్ టీం ఫీలర్స్ రూపంలో బయటికి లీక్ చేసిందనే డిస్కర్షన్ జరుగుతోంది.
ఏదేమైనా విరాట్ కొహ్లీ ని పోలిన పాత్రలోనే చరణ్ ఈ మూవీలో క్రికెట్ ఆడాడట. ఆ క్రికెట్ ఎపిసోడ్ 35 నిమిషాల పైనే ఉంటుందని తెలుస్తోంది. మరి క్రికెట్, కుస్తీ, కబడ్డి, కోకో ఆటల్ని పెట్టి డైరెక్టర్ బుచ్చిబాబు ఏం తీస్తున్నాడోకాని, ఇదో క్రికెట్ కిచిడీలా తయారయ్యేలా ఉంది. పీరియాడిక్ కిక్ ఇచ్చే ఫ్లాష బ్యాక్ లో కోడిరామమూర్తి నాయుడిగా చరణ్ కనిపిస్తూనే, ఇందులో క్రికెటర్ అవతారం కూడా ఎత్తుతాడనే ప్రచారం జరుగుతోంది. ఏదినిజమో తేలాలంటే ఉగాదికి వచ్చే పోస్టర్ తోనే తేలే ఛాన్స్ ఉంది.