1000 కోట్ల హీరోలు.. 1000 కోట్ల సినిమాలు.. దుబాయ్ శీను..
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇండియాని వదిలేయబోతున్నాడా..? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎడారిలో ఎండిపోవటమే బాగా నచ్చిందా..? ఇటలీలో సమ్మర్ వెకేషన్ కి రిలాక్స్ అవుతున్న ప్రభాస్ కూడా తన ఫ్యూచర్ డెస్టినేషన్ దుబాయే అంటున్నాడా..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇండియాని వదిలేయబోతున్నాడా..? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎడారిలో ఎండిపోవటమే బాగా నచ్చిందా..? ఇటలీలో సమ్మర్ వెకేషన్ కి రిలాక్స్ అవుతున్న ప్రభాస్ కూడా తన ఫ్యూచర్ డెస్టినేషన్ దుబాయే అంటున్నాడా..? నిజంగానే ఇది జరిగేలా ఉంది. ఒకప్పుడు సినిమా వాళ్లంటే హైద్రబాద్ ఫిల్మ్ నగర్ వెలితే చాలు… ఎవరో ఒక హీరో కనిపిస్తాడనే అభిప్రాయం ఉండేది.. కట్ చేస్తే మడికొండ తర్వాత శంశాబాద్ ఔట్ స్కట్స్ కి హీరోలు, వాల్ల ఇంటిని షిఫ్ట్ చేశారు.ఇప్పుడు ఏకంగా దేశాన్నే వదిలేసి దుబాయ్ లో సెటిలయ్యేల ఉన్నారు. అప్పడప్పుడు పోతే పర్లేదు.. కాని స్డూడియోలతో సహా పీక్కోని పోతే ఎలా..? బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఎవరూ అలా చేయట్లేదు.. కాని తెలుగు హీరోలు, దర్శక నిర్మాతలు దుకాణం దుబాయ్ లోతెరుస్తున్నారు… ఇల్లు, స్టూడియో, ప్రొడక్షన్ హౌజ్ అన్నీ అక్కడే… మరి తెలుగు రాష్ట్రాలుండి ఎందుకు..? అంతగా దుబాయ్ లో వీళ్లని ఏం అట్రాక్ట్ చేస్తోంది..? సడన్ గా ఎవరిలో లేని ఈ మార్పు మనవాళ్లలోనే ఎందుకు..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దుబాయ్ లో విల్లా కొనటమే కాదు, అక్కడికే షిఫ్ట్ కాబోతున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేరాఫ్ దుబాయ్.. మొన్నటి వరకు తరచుగా వెళ్లొచ్చాయి. ఇప్పుడు దుబాయ్ లో సెటిలవ్వబోతున్నాడు. ఇండస్ట్రీలో ట్రోలింగ్ వల్ల వార్తల్లో ఉండే మంచు విష్ణు కూడా ఫ్యామిలీతో సహా దుబాయ్ లోసెటిలయ్యాడు.. అప్పడప్పుడు హైద్రబాద్ వచ్చిపోతుంటాడు.
ఎటుచూసిన ఎడారి, మండిపోయే ఎండ, అలాంటి ఏరియాలో ఎందుకు మనవాళ్లంతా సెటిలవ్వాలనుకుంటున్నారు..? రెబల్ స్టార్ ప్రభాస్ జూబ్లీహిల్స్ లోఇల్లున్నా, ఔట్ స్కట్స్ లో 150 కోట్ల ఖర్చుతో ఫామ్ హౌజ్ రెడీ అవుతున్నా… ఎందుకో తను కూడా దుబాయ్ లో ఇల్లు ఆఫీసు పక్క పక్కనే ఉండేలా 40 ఎకరాల్లో పెద్ద ప్రాపర్టీ కొనేశాడు..టాలీవుడ్ టాప్ హీరోలంతా కట్టకట్టుకుని ఎందుకు దుబాయ్ లోదుకాణం తెరుస్తున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్లే దుబాయ్ లో విల్లాలు, ఆఫీస్ లు కొని అక్కడికి మకాం మార్చేందుకు రెడీ అవుతున్నారు. అంతా వెయ్యికోట్ల వసూల్లు చూసిన హీరోలే, వెయ్యికోట్ల మార్కెట్ ఉన్న పాన్ ఇండియా స్టార్లే…
అంటే వెయ్యికోట్ల సినిమాలు, వెయ్యికోట్ల హీరోలు ఇక నుంచి దుబాయ్ లోనే ఉండాలా? సీన్ చూస్తే ఈ డౌట్ రావటానికి సాలిడ్ రీజన్ కనిపిస్తోంది. ఒకప్పుడు సినిమా స్టార్లంటే ఫిల్మ్ నగరే.. కాని ఇప్పుడక్కడ చిన్నా చితకా కటౌట్లు, తప్ప 90శాతం బ్యాచ్ మడికొండకు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు అక్కడ స్థలాలు లేకో, మరి ఏరియా బోర్ కొట్టిందో కాని, శంశాబాద్ ఏరిర్ పోర్ట్ దరిదాపుల్లో ఫామ్ హౌజ్ లు కట్టుకునే స్టేజ్ నుంచి, దుబాయ్ కి షిఫ్ట్ అయ్యే వరకు రేంజ్ మారింది.హిందీ, తమిళ, మలయాళ హీరోలు, దర్శక నిర్మాతలెవరు దుబాయ్ లో సెటిలయ్యే ప్లాన్చేయట్లేదు. అక్కడ వాళ్లకి విల్లాలు, ఫ్లాట్స్ ఉన్నాయి.. కాని అంతా ఇండియాలోనే ఉంటున్నారు. తెలుగు హీరోలే షాపింగ్ కి సినిమా స్టోరీ డిస్కర్షన్ కి, సాంగ్స్ సిట్టింగ్స్ కి దుబాయ్ వెలుతున్నారు. ఒకప్పుడు పూరీ కూడా కథా చర్చలకోసం థాయ్ లాండ్ వెళ్లొచ్చేవాడు.. కాని తాను అక్కడ సెటిల్ అయ్యే పని చేయలేదు
కాని ప్రభాస్, ఎన్టీఆర్ కూడా బన్నీ లానే దుబాయ్ లో సెటిలయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టడం, చరణ్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు తేలటంతో ఏంటి, టాలీవుడ్ దుబాయ్ కిషిఫ్ట్ అవుతోందా అన్న డౌట్లు పెరిగాయి. హైద్రబాద్ నుంచి వైజాగ్ షిఫ్టింగ్ అంటేనే పొలిటికల్ హీట్ కనిపించింది. అలాంటిది ఇక్కడ కాక, అక్కడ కాకుండా, ఎడారి ఎండల్లో తెలుగు జెండా పాతే ప్రయత్నాలు విచిత్రంగా అనిపిస్తున్నాయి.ప్రతీ సారి దుబాయ్ కి వెళ్లి కథా చర్చలు, మ్యూజిక్ సిట్టింగ్స్ ఎందుకని, సుకుమార్ అక్కడే ఇల్లు, ఆఫీస్ కొన్నాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబుకి ఆల్రెడీ అక్కడ లగ్జరీ విల్లా ఉంది. విచిత్రం ఏంటంటే హీరోలు, దర్శక నిర్మాతలు అంతా ఒక ఏరియా అనుకుని అక్కడే ఇల్లు కొనటం చూస్తుంటే, ఇక్కడి ఫిల్మ్ నగర్ కి అక్కడికే తిసుకెళుతున్నట్టు కనిపిస్తోంది. పిల్లల చదువుకోసం అని చరణ్ చెల్లి ఎప్పుడో దుబాయ్ షిఫ్ట్ అయ్యిందంటున్నారు. ఇప్పుడు చరణ్ వంతొచ్చిందా? దుబాయ్ లో ట్యాక్స్ లేకపోవటం, సెక్యూరిటీ కలిసి రావటం, దీనికి తోడు ఫ్యాన్స్ ఇబ్బందులు ఎదురు కావు కాబట్టి, ఫ్రీడం కోసం కూడా అలా అంతా అక్కడికి వెళుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.. కాని ఒక్కో కటౌట్ మెల్లిగా దుబాయ్ కి దుకాణం మార్చటం మాత్రం కనిపిస్తోంది. కన్పామ్ అనుకోవాల్సి వస్తోంది.