1000 కోట్ల మీటింగ్… ఇక మీదట ఏది రహస్యం కాదు…!
వెయ్యికోట్ల మీటింగ్ కి రంగం సిధ్దం.... నిజంగా 1000కోట్ల బడ్జెట్ తో రాజమౌళి ఏం తీస్తున్నాడో..? ఏం తీయబోతున్నాడో? ఇంతవరకు ఎవరికీ ఏం తెలిసింది లేదు. అంతా అంచనాలు,ఊహాగానాలు, లేదంటే సెట్ నుంచి వచ్చిన గుసగుసలే..

వెయ్యికోట్ల మీటింగ్ కి రంగం సిధ్దం…. నిజంగా 1000కోట్ల బడ్జెట్ తో రాజమౌళి ఏం తీస్తున్నాడో..? ఏం తీయబోతున్నాడో? ఇంతవరకు ఎవరికీ ఏం తెలిసింది లేదు. అంతా అంచనాలు,ఊహాగానాలు, లేదంటే సెట్ నుంచి వచ్చిన గుసగుసలే.. కాని ఇప్పుడు అలా బ్లైండ్ గా ఊహించుకోవాల్సిన పనిలేదు. పక్కగా ఈ సినిమా గురించి అఫీషియల్ ఇన్ ఫర్ మేషన్ రాబోతోంది. అది కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌలినే ఇవ్వబోతున్నారు. మొన్నటి వరకు సినిమా సెట్స్ పైకెళ్లింది కూడా ఎవరికీ తెలియనీయలేదు. సింగిల్ అప్ డేట్ లేకుండానే రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు. కాని ఏమనిపించిందో ఏమో కాని, సడన్ గా ప్రెస్ మీట్ కి రాజమౌళి సిద్ధపడ్డాడు. ఈ ప్రెస్ మీట్ లో మొత్తం 12 మంది ఉంటారని మాత్రం తెలుస్తోంది. కథ బేసిక్ లైన్ , జోనర్ , టోటల్ ఆర్టిస్ట్ ల వివరాలు, రిలీజ్ డేట్ అంచనాలు కూడా ఎనౌన్స్ చేయబోతున్నాడు. అంతకంటే ముందు టైటిల్ కూడా ప్రెస్ మీట్ పెట్టే లాంచ్ చేస్తాడట. అది కూడా వచ్చే నెలలోనే… ఎందుకు ఈ సడన్ నిర్ణయం? ఇంతకి ప్రెస్ మీట్ లో కనిపించబోయే 12 మంది ఎవరు? టేకేలుక్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, హాలీవుడ్ లో సెటిలైన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో రాజమౌళి తీస్తున్న సినిమా ప్రెస్ మీట్ కి రంగం సిద్దమైంది. అసలు ఈ సినిమాలాంచ్ అయినప్పుడు ప్రెస్ మీట్ జరగలేదు. కనీసం మీడియాను పిలవకపోవటం అటుంచి, వాళ్లకో మాట చెప్పింది లేదు. కాని ఇప్పుడు ఉన్నట్టుండి ఉగాదికి వన్ వీక్ ముందు భారీ ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇంటర్నేషనల్ మీడియా మొత్తంగా సిద్దమైందో లేదంటే, ఇంకెంతకాలం ఇలా సాగతీయటం అనుకున్నాడోకాని రాజమౌళి, మనసు విప్పబోతున్నాడు. నోరిప్పేందుకు ఉగాది ముందే ముహుర్తం చూసుకున్నాడు. మోస్ట్ లీ మార్చ్ 25న మహేశ్ బాబు మూవీ ప్రెస్ మీట్ ఉంటుందని తెలుస్తోంది. ప్రజెంట్ ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.
ఇది అయిపోయాక, ఏప్రిల్ ఫస్ట్ వీక్ కెన్యా వెళ్లేందుకు ఫిల్మ్ టీం సిద్దపడుతోంది. మూడో షెడ్యూల్ అక్కడే ప్లాన్ చేశారు. కాకపోతే కెన్యాకి వెళ్లే ముందే ఈసినిమా ప్రెస్ మీట్ పెట్టాలని రాజమౌళి నిర్ణయించుకున్నాడు. దీనికి మూడు కారణాలున్నాయి. ఒకటి సినిమా వర్కింగ్ టైటిల్ ని ఈ ప్రెస్ మీట్ లోనే ఎనౌన్స్ చేస్తారట. దీనికి సీఎన్ ఎన్, బీబీసీ, ఇలా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 120 ఛానల్స్ వస్తున్నాయని తెలుస్తోంది.అన్నీ పీఆర్ పనులు పూర్తయ్యాయి కాబట్టే, మార్చ్ 25 కి భారీ ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడట రాజమౌళి. ఇక ఈ ప్రెస్ మీట్ లో స్టోరీ పాయింట్, ఏఏ నవలలు ప్రేరణగా తీసుకున్న సంగతితో పాటు, వర్కింగ్ టైటిల్ తాలూకు పోస్టర్ రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ ప్రెస్ మీట్ లో ఏకంగా 12 మంది అటెండ్ కాబోతున్నారట. అందులో దర్శకుడు రాజమౌళి, హీరో మహేశ్ బాబు, హీరోయిన్ ప్రియాంక చోప్రా, నిర్మాత కేఎల్ నారాయణ ఉండబోతున్నారు. అయితే ఆ మిగతా 8 మందే ఎవరా అన్న క్యూరియాసిటీ మీడియాలోపెరిగింది.
అయితే ఇందులో ఇండోనేషియా నటి చెల్సియా నటించటం ఆల్ మోస్ట్ కన్పామ్ అవటం వల్ల తనతోపాటు, హాలీవుడ్ నటులు ఇద్దరు వస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక కీరవాణి కూడా ఈ ప్రెస్ మీట్ కి వస్తున్నాడట. సో అలా చూసినా ఇంకా 5 గురు ఎవరనేది తేలలేదు. ఐతే నెట్ ఫ్లిక్స్ అధినేత కూడా ఈ ప్రెస్ మీట్ లో పాలుపంచుకోబోతున్నాడు. కారణం డిజిటల్ పార్టనర్ అవటమే… ఆల్రెడీ త్రిబుల్ ఆర్ టైంలో కూడానెట్ ఫ్లిక్స్ సంస్త వల్లే ఆస్కార్ రేసులో త్రిబుల్ ఆర్ కి ప్లస్ అయ్యిందంటారు. అంతగా వాళ్ల పీఆర్ అక్కడ హెల్ప్ చేసిందట.. అందుకే ఆ జర్నీ అలా కంటిన్యూ అవుతోంది.ఇక మిగతా నలుగురు పేర్లు మాత్రం మతిపోగొట్టేలా ఉన్నాయి. అందులో ఒకరు అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరున్, మరొకరు జురాసిక్ పార్క్ క్రియెటర్ స్టీవెన్ స్పిల్ బర్గ్… ఈ ఇద్దరి తోపాటు కరణ్ జోహార్ తో పాటు సౌత్ ఆఫ్రికన్ నటుడు ఎవరో వస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే కేవలం ప్రెస్ మీట్ తోనే ఈ సినిమాను గ్లోబల్ గా సెన్సేషన్ చేసినట్టౌతుంది.