1000 కోట్ల పుష్పరాజ్ కి ప్రివ్యూతోనే షాక్.. రివర్స్ రివ్యూలే…

పుష్ప సీక్వెల్ ప్రివ్యూ సందడి మొదలైంది. కట్ చేస్తే ట్విట్టర్ లో, ఇన్ స్టా లో పుష్ప2 మీద కామెంట్ల దాడి రివ్యూలరూపంలో పేలుతోంది. షాక్ ఇస్తోంది. మొన్నటి వరకు నిర్మాతలకే ఈ సినిమా మీద నమ్మకం తగ్గి, విడుదలైన వన్ వీక్ లోనే సాధ్యమైనంత ఎక్కువ వసూళ్లు రాబట్టాలని చూస్తున్నట్టు ప్రచారం జరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 5, 2024 | 03:03 PMLast Updated on: Dec 05, 2024 | 3:03 PM

1000 Crore Pushparaj Gets A Shock With Just The Preview Reverse Reviews

పుష్ప సీక్వెల్ ప్రివ్యూ సందడి మొదలైంది. కట్ చేస్తే ట్విట్టర్ లో, ఇన్ స్టా లో పుష్ప2 మీద కామెంట్ల దాడి రివ్యూలరూపంలో పేలుతోంది. షాక్ ఇస్తోంది. మొన్నటి వరకు నిర్మాతలకే ఈ సినిమా మీద నమ్మకం తగ్గి, విడుదలైన వన్ వీక్ లోనే సాధ్యమైనంత ఎక్కువ వసూళ్లు రాబట్టాలని చూస్తున్నట్టు ప్రచారం జరిగింది. కట్ చేస్తే అవి యాంటి ఫ్యాన్స్ మాటలే అనుకున్నారు. కాని ఎక్కడో తేడా కొడుతున్నట్టు మరో వర్షన్ సెన్సేషన్ అవుతోంది. వరల్డ్ వైడ్ గా పుష్ప2 డిసెంబర్ 5నే రిలీజ్.. నిజానికి 6 నే రిలీజ్ అవ్వాలి. కాని రిలీజ్ డేట్ ని ఒకరోజు ముందుకి మార్చారు. విచిత్రం ఏంటంటే బుధవారం బెన్ ఫిట్ షో అదే ప్రివ్యూతో లెక్కలు మారాయి. ఆల్రెడీ ట్విట్టర్ లో రివ్యూల గోల పెరిగింది… ఇంతకి పుష్ప2 కి కూడా ముందు నెగెటీవ్ రివ్యూలు తర్వాతే పాజిటివ్ రివ్యూలా? లేదంటే మొదట్నుంచి జరుగుతున్న ప్రచారం ప్రకారం, తగ్గనన్న పుష్పరాజ్ మొదటి ఆటతోనే బక్కెట్ తన్నేశాడా?

పుష్ప 2 ప్రివ్యూ బుధవారం రాత్రి నుంచే అన్నారు. అంతే వెంటనే పుష్ప 2 తాలూకు గుడ్, బ్యాడ్, అగ్లీ ఇలా అన్నీ హాట్ టాపిక్ అయ్యాయి. ఈ మూవీ మీద కామెంట్లు, వివాదాలు, టిక్కెట్ రేట్ల వల్ల కోర్టు కేసులు, మెగా ఫ్యాన్స్ నుంచి వ్యతిరేక పవనాలు.. ఇలా ఎన్ని ఉన్నా, ప్రివ్యూకి రివ్యూల గోల పెరిగింది. విడుదలకుముందే 1000 కోట్ల బిజినెస్ చేసిన మూవంటూ దర్శక నిర్మాతలు ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేలా 12000 థియేటర్స్ ని బుక్ చేశారు

విడుదలకు ముందే 100 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ బుక్కింగ్స్ షాక్ ఇచ్చాయి. ఇది గుడ్ న్యూసే. కాని ట్వీట్లు నెటీజన్స్ అసహనం మాత్రం షాక్ ఇస్తోంది. ఇక పుష్ప 2 తాలూకు బ్యాడ్, అగ్లీ సైడ్ చూశాకే గుడ్ గురించి చర్చించుకుంటే బెటర్

బ్యాడ్ ఏంటంటే మెగా ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత, జనసేన, టీడీపీ పార్టీ ఫాలోవర్స్ అంతా పుష్ప2 కి దూరంగా ఉండటమే కాదు, వ్యతిరేకిస్తున్నారు. ఇక భారీగా పెరిగిన టిక్కెట్ రేట్లను చూసి ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉంటున్నారు. కేవలం ఫ్యాన్స్ లేదంటే యంగ్ స్టర్స్ మాత్రమే ఈ సినిమామ వైపు ఆసక్తి చూపించారు. చూపిస్తున్నారు

ఇక దేవ శ్రీ కాకుండ తమన్ అండ్ కో తో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొట్టించటం, తర్వాత తీసేయటం ఇదో హెడ్డేక్ అయితే, ఫీలింగ్స్ తో పాటు ఐటమ్ సాంగ్ కిస్సక్ కూడా పేలకపోవటం పుష్పీ2కి మైనెస్ అయితే, ఈ సినిమా వన్ మెన్ ఆర్మీ కాదు, సీన్లో స్ట్రాంగ్ విలన్ ఫాహద్ ఫాజిల్ ఉన్నాడు

విచిత్రం ఏంటంటే పుష్ప2 కథ అంతా ఊహించిందే ఉందంటున్నారు. కాకపోతే పుష్ప లో పుష్పరాజ్ పాత్ర వల్ల వార్ వన్ సైడ్ అయ్యింది. సీక్వెల్ లో మాత్రం ఫాహద్ ఫాజిల్ నటనముందు పుష్పరాజ్ యాటిట్యూడ్ తేలిపోయిందంటున్నారు. నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనగానే, చైనా మొఖాలు, జపన్, కొరియా మార్కెట్లను తెరుస్తాయనుకున్నారు. కాని ఆ ఎపిసోడ్స్ ఆర్టిఫిషియల్ గా ఉన్నాయనే కామెంట్లే పెరిగాయి

పుష్ప వచ్చినప్పుడు ఇలానే సినిమాబాలేదు ఫ్లాప్ అన్నారు. తర్వాత పుష్ప మూవీ భారీ హిట్టైంది. ఇలానే పుష్ప2 కూడా ముందు నెగెటివ్ రివ్యూలని, తర్వాత పాజిటివ్ రివ్యూలను అందుకుంటుందా అంటే, ఈ సారి అలంటి సూచనలు కనిపించట్లేదు. ప్రివ్యూకి వచ్చిన రివ్యూలు ట్వీట్ల రూపంలో పుష్ప2 ఫ్యూచర్కి తూట్లు పొడుస్తున్నాయి. మొత్తానికి బెనిఫిట్ షో వల్ల భారీగా అయితే టిక్కెట్ ప్రైజ్ రూంపలో నిర్మాతల జేబులు నిండొచ్చు కాని, టాక్ వీక్ అవటంతో, ఫస్ట్ డే ఓపెనింగ్స్ తగ్గే ఛాన్స్ఉంది. రెండో రోజుకే తగ్గనన్న పుష్ఫ రాజ్ తగ్గే పరిస్థితి వచ్చేలా ఉంది.