1000 కోట్ల వార్ 2 … ఆ రూమర్స్ నమ్మోద్దూ…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ తో బ్రహ్మస్త్ర ఫేం అయాన్ ముఖర్జీ తీస్తున్న మూవీ వార్ 2. ఇదే ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ సినిమా. ఆల్రెడీ 95 శాతం షూటింగ్ పూర్తైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2025 | 08:10 PMLast Updated on: Feb 21, 2025 | 8:10 PM

1000 Crore War 2 Dont Believe Those Rumours

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ తో బ్రహ్మస్త్ర ఫేం అయాన్ ముఖర్జీ తీస్తున్న మూవీ వార్ 2. ఇదే ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ సినిమా. ఆల్రెడీ 95 శాతం షూటింగ్ పూర్తైంది. క్లైమాక్స్ తో పాటు, సాంగ్ షూటింగ్ చేస్తే ఇక షూటింగ్ కి గుమ్మడికాయకొట్టడమే అన్నారు. ఈ మాట డిసెంబర్ నుంచి వినిపిస్తోంది. కానివార్ 2 షూటింగ్ డైలీ సీరియల్ లా సాగుతోందనే కామెంట్ వస్తూనే ఉంది. ఇలాంటి టైంలో ఆగస్ట్ 14 కి వార్ 2 మూవీ రిలీజ్ అవటం గగనమంటూ ప్రచారం పెరిగింది. దసరాకి రిలీజ్ వాయిదా అంటూ గుసగులుపెరిగాయి. కాని ఇది యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ అంటూ కౌంటర్స్ స్టార్ట్ అయ్యాయి. కారణం వార్ 2 మూవీ రైటర్ రంగంలోకి దిగటమే.. తనే సీన్ లోకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో వార్ 2 మూవీ ఆగస్ట్ 14 కి వస్తుందన్నాడు..ఇంతకి ఇది వాయిదా పడిందని ప్రచారం చేయటం వెనకున్న రీజనేంటి? వార్ 2 వెయ్యికోట్ల స్టామినాకి నిజంగా కన్నమేసే ప్రయత్నమా? టేకేలుక్

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. క్లైమాక్స్ ప్యాచ్ వర్క్ తోపాటు కాంబినేషన్ సాంగ్ షూటింగ్ మాత్రమే పెండింగ్. వచ్చే వారం ఆ కాంబినేషన్ సాంగ్ ని కూడా షూట్ చేసి పూర్తి చేయబోతున్నారు. కాకపోతే డిసెంబర్ నుంచి ఇదే మాట చెబుతున్నారే తప్ప, వార్ 2 షూటింగ్ మాత్రం అయిపోవట్లేదు. అందుకే ఇది ఆగస్ట్ 14 కి రిలీజ్ అవటం కష్టమే అని కామెంట్లు పెరిగాయి. నిజానికి అంతా అన్నట్టే వార్2 షూటింగ్ వారం కాదు, నెల కాదు, ఆల్ మోస్ట్ రెండు నెలలుగా అనుకున్నట్టు షూటింగ్ జరగట్లేదు. అసలు డిసెంబర్ లోనే భారీ ఎత్తున షూటింగ్ ప్లాన్ చేస్తే కేవలం 3 యాక్షన్ సీక్వెన్స్ లే తెరకెక్కించారు. జనవరిలో షూటింగ్ పూర్తవుతుందన్నారు కాని, కాలేదు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా షూటింగ్ ఫినిష్ అన్నారు. కాని అలా జరగలేదు… ఫిబ్రవరి థర్డ్ వీక్ కల్లా, షూటింగ్ కి గుమ్మడి కాయ కొడతారన్నారు.

అది కూడా జరగలేదు.. అందుకే ఆగస్ట్ 14 కి ఈ సినిమా రావటం ఆల్ మోస్ట్ ఇంపాజిబుల్ అని కామెంట్లు పెరిగాయి. మామూలుగా ఎన్టీఆర్ సినిమా కు నెగెటీవ్ కామెంట్లు, యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ చాలా కామన్. కాకపోతే తన సినిమా రిలీజ్ కి ముందు ఇలా జరగటం కామన్. కాని రిలీజ్ కి 5 నెల్ల ముందునుంచే ఇలా వార్ 2 మూవీ మీద వ్యతిరేక ప్రచారం షాకింగ్ గానే ఉంది.ఇలా అనటానికి సాలిడ్ రీజన్ వార్ 2 మూవీ రైటర్ అబ్బాయ్ టైర్ వాలా… తనే వార్ 2 మూవీ కి డైలాగ్ రైటర్. తనే రీసెంట్ ఇంటర్వూలో వార్ 2 షూటింగ్ పూర్తి కావొచ్చిందన్నాడు. క్లైమాక్స్ ప్యాచ్ వర్క్ కేవలం 5 రోజుల్లో పూర్తి చేస్తారని తేల్చాడు. 80పర్సెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్రెడీ ప్యార్ లల్ గా పూర్తయ్యిందట. ఇక ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కే సాంగ్, రిహార్సిల్స్ పూర్తయ్యాయని, వచ్చే వారం పాట సాంగ్ షూటింగ్ పూర్తవుతుందని కూడా తేల్చాడు

ఆగస్ట్ 14న పక్కగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని కూడా తేల్చాడు రైటర్ అబ్బాస్ టైర్ వాలా.. సో రిలీజ్ వాయిదా పడదని దర్శకుడు, నిర్మాత, ఆఖరికి రైటర్ కూడా చెప్పాక, నెగెటివ్ ప్రచారం ఆగట్లేదంటే, ఖచ్చితంగా ఇది యాంటీ ఫ్యాన్స్ పనే… ఎక్కువగా ఈ వార్తలు యూఎస్ నుంచే వస్తున్నాయట. అంటే అక్కడి సోషల్ మీడియా ఎకౌంట్స్ నుంచే ఎక్కువగా ఈ ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ రెచ్చిపోతోందనే టాక్ భారీగా పెరిగింది.