1000 కోట్ల యుద్దం… తెలంగాణ యోధుడి కొడుకు….
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హిందీలో చేస్తున్న ఫస్ట్ మూవీ వార్ 2. ఈ నెల మూడో వారంలోగా షూటింగ్ పూర్తి కాబోతోంది. గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ ఇందులో హీరో అయితే, విలన్ గా బాలీవుడ్ మీద దాడి చేయబోతున్నాడు ఎన్టీఆర్.
![1000 కోట్ల యుద్దం… తెలంగాణ యోధుడి కొడుకు…. 1000 Crore War Telangana Warriors Son](https://s3.ap-south-1.amazonaws.com/media.dialtelugu.com/wp-content/uploads/2025/02/UifNcXS1-M8-HD.jpg)
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హిందీలో చేస్తున్న ఫస్ట్ మూవీ వార్ 2. ఈ నెల మూడో వారంలోగా షూటింగ్ పూర్తి కాబోతోంది. గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ ఇందులో హీరో అయితే, విలన్ గా బాలీవుడ్ మీద దాడి చేయబోతున్నాడు ఎన్టీఆర్. అంతవరకు ఓకే కాని, ఇందులో తన లుక్ ఎలా ఉంటుందో రివీల్ కాలేదు. తన పాత్ర పేరేంటో ఎవరికీ తెలియదు. కాని సడన్ గా తన పాత్ర పేరు బయటికి వచ్చేసింది. తెలంగాణ యోధుడి కొడుగ్గా వార్ 2 లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే త్రిబుల్ ఆర్ లో తెలంగాణ యోధుడు కొమరం భీమ పాత్రే వేశాడు ఎన్టీఆర్.. ఇప్పడు సాయుధ తెలంగాణ యోధుడి వారసుడిగా, ఎన్టీఆర్ వార్ 2 మూవీ చేస్తున్నాడట.. ఈ కనెక్షనే షాకింగ్ గా ఉంది. ఓ హిందీ మూవీలో తెలంగాణ యోధుడి వారసుడి పాత్రా..? అంటే వార్ 2 లో ఎన్టీఆర్ విలన్ కాదని తేలినట్టేనా? వార్ 1 లో హ్రితిక్ రోషన్ వేసిన పాజిటివ్ కమ్ నెగెటీవ్ రోలే తారక్ వేస్తున్నాడా? ఈ డౌట్లకు క్లారిటీ ఉగాదికి రాబోతోంది. అరవింధ సమేత వీర రాఘవుడిగా కనిపించిన తారక్, ఇప్పుడు రఘునాథుడిగా మారిపోతున్నాడు… సౌత్ ఇండియాన్ ఏజెంట్ గా బాలీవుడ్ లో వార్ వన్ సైడే అని తేలుస్తున్నాడు..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేస్తున్న మొట్టమొదటి హిందీ మూవీ వార్ 2. ఇందులో తన పాత్ర పేరు రివీల్ అయ్యింది. వీరేంద్ర రఘునాథ్ గా తను కనిపించబోతున్నాడు. దక్షిణాదికి చెందిన ఓ సూపర్ ఫైటర్ కమ్ ఏజెంట్ ఎందుకు, సడన్ గా దేశానికి వ్యతిరేకంగా మారాడో వార్ 2 లో చూపించబోతున్నారట. అచ్చంగా వార్ 1 లో కూడా హ్రితిక్ రోషన్ ఇలాంటి పాత్రలోనే కనిపించాడు.
అంటే వార్ 1 లో టైగర్ హీరో, హ్రితిక్ విలన్… ఇక్కడ వార్ 2 లో హ్రితిక్ హీరో ఎన్టీఆర్ విలన్… సో సేమ్ టెంప్లేట్ తో స్టోరీ అల్లారా.? అన్న డౌట్లొస్తున్నాయి. అదే నిజమైతే ఎన్టీఆర్ ఎందుకు ఒప్పుకుంటాడు. తను చేయక చేయక ఫస్ట్ టైం హిందీ మూవీ చేస్తున్నాడు. అందులోనూ విలనీ రోల్ చేస్తున్నాడంటే, ఎంతటో కంటెంట్ ఉంటే తప్ప ఒప్పుకోడు.
తను కథవిషయంలోనో, క్యారెక్టర్ విషయంలోనో తగ్గే వ్యక్తి అయితే, త్రిబుల్ ఆర్ కి ముందు, త్రిబుల్ ఆర్ తర్వాత రెండుస్లారు త్రివిక్రమ్ కథల్ని రిజెక్ట్ చేసేవాడు కాదు. దేవర కంటేముందు కొరటాల శివ చెప్పిన కథను కూడా తను మార్చమనే వాడు కాదు. సో కథవిషయంలో అంత క్లారిటీతో ఉన్నాడు కాబట్టే, వరుసగా డబుల్ హ్యాట్రిక్ తనకి సాధ్యమైంది.
ఇక వార్ 2 లో ఎన్టీఆర్ పాత్ర, సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే…. ఇందులో తెలంగాణకు చెందిన సాయుధ పోరాట యోదుల కుటుంబంలో పుట్టిన వీరేంద్ర రఘునాథ్ గా తను కనిపిస్తాడట. ఇక ఇందులో హ్రితిక్ పాత్ర అయిన కబీర్, రాలోని చాలా ఏజెంట్స్ మరణానికి కారణమని నమ్మే వ్యక్తిగా తారక్ కనిపిస్తాడట. సో తన కొలిగ్స్ ని కోల్పోడానికి కారణం కబీరే అని పగపట్టి, అటాక్ చేసే ఫార్మర్ ఏజెంట్ గా ఎన్టీఆర్ రోల్ చాలా డైనమిక్ గా ఉంటుందని తెలుస్తోంది
ఈ స్టోరీలైన్ లీకైనా ఫిల్మ్ టీం పెద్దగా కంగారు పడలేదు. కాని ఇందులో 50 కోట్ల ఖర్చుతో డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ తాలూకు సీన్లు కొన్ని సోషల్ మీడియాలో లీకయ్యాయి. వాటన్నీంటిని ఎక్కవ ఎవైలబుల్ గా లేకుండా చేసేందుకు 5 కోట్లు పెట్టి సైబర్ టీంతో క్లియర్ చేశారట. ఏదేమైనా డాన్స్, పెర్ఫామెన్స్ లో వాడుకుంటే, ఆ పాత్రని ఆడుకునే తారక్, నెగెటివ్ రోల్స్ లో పాతుకుపోతాడని జైలవకుశతో తేలింది. ఇప్పుడు తన పాత్ర పేరు, బ్యాగ్రౌండ్ చూస్తే మతిపోయేలా ఉంది. మొత్తంగా ఆగస్ట్ 14 కి వార్ 2 మల్టీ స్టారర్ కాదు, సోలో సినిమా అనేంతగా సీన్ మారేలా ఉంది.