1000 కోట్లు + 1000 కోట్లు… రెబల్ స్టార్ వన్ ప్లస్ వన్ ఆఫర్…!
రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ది రాజా సాబ్ ఏప్రిల్ నుంచి దసరాకు మారిందటున్నారు. అంతవరకు ఓకే కాని, 2026 దసరాకు ది రాజా సాబ్ సందడనివినిపించటమే కాస్త విచిత్రంగా ఉంది. అంటే ది రాజా సాబ్ ఈ దసరా కాకుండా, వచ్చే దసరాకు ఈసినిమా రాబోతోందా?

రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ది రాజా సాబ్ ఏప్రిల్ నుంచి దసరాకు మారిందటున్నారు. అంతవరకు ఓకే కాని, 2026 దసరాకు ది రాజా సాబ్ సందడనివినిపించటమే కాస్త విచిత్రంగా ఉంది. అంటే ది రాజా సాబ్ ఈ దసరా కాకుండా, వచ్చే దసరాకు ఈసినిమా రాబోతోందా? ఆన్సర్ మాత్రం కానే కాదు. ఈ దసరాకు ది రాజా సాబ్ రావటం ఆల్ మోస్ట్ ఫైనల్ అయ్యింది. ఇక వచ్చే దసరాకు కూడా ది రాజా సాబే రంగంలోకి దిగబోతున్నాడు. అంటే ఈ ఏడాది దసరాకు వచ్చే ఈసినిమా, వచ్చే ఏడాది దసరాకు రీరిలీజ్ చేస్తారనే డౌట్ రావొచ్చు. కాని అది కూడా నిజం కాదు. ది రాజా సాబ్ ఒకటి కాదు రెండు భాగాలుగా రావటం వల్లే ఇది సాధ్యం కాబోతోంది. అంటే రెబల్ స్టార్ ఇక సింగిల్ సినిమా చేసే ఛాన్సే లేదా…? తను సింగల్ కావొచ్చు కాని ఎప్పటికీ తన సినిమా మాత్రం సింగిల్ కాదు…రెండు భాగాలతో బాక్సాఫీస్ ఊగిపోవాల్సిందే…
రెబల్ స్టార్ ప్రభాస్ తో మారుతి తీస్తున్నమూవీ ది రాజా సాబ్. సినిమా అనే కంటే దీన్ని వెబ్ సీరీస్ అంటే బెటర్.. ఎందుకంటే కల్కీ, సలార్ కంటే ముందు సెట్స్ పైకెళ్లినా, ఇంకా పూర్తి కాలేదు. హను రాఘవపూడీ తీస్తున్న ఫౌజీకే ప్రభాస్ హై ప్రయారిటీ ఇవ్వటం వల్ల, ది రాజా సాబ్ పెండిగ్ షూటింగ్ పూర్తి కావట్లేదు. కేవలం రెండు సీన్ల ప్యాచ్ వర్క్, అలానే 4 సాంగ్స్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్..
గట్టిగా 25 రోజులు ప్లాన్ చేస్తే యూరప్ లో షూటింగ్ కి గుమ్మడికాయకొట్టొచ్చు..కాని అలా చేయట్లేదు. అంటే ది రాజా సాబ్ కి ప్రభాస్ తక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడా ..? ఈ డౌట్ కి మైండ్ బ్లాంక్ అయ్యే ఆన్సర్ దొరికింది. ది రాజా సాబ్ సింగిల్ మూవీ కాదని తెలుస్తోంది. ఇది రెండు భాగాలుగా తెరకెక్కుతున్నట్టు వార్త వచ్చేసింది.ఇదేదో గాసిప్పో, గాల్లో వినిపిస్తున్న మాటో కాదు.
అలాగని సినిమా లెంథీగా వచ్చింది కాబట్టి, సినిమాను రెండు భాగాలుగా తెగ్గొట్టట్లేదు.. పక్కగా రెండో భాగం కథ సగం పూర్తయ్యాకే దిరాజా సాబ్ సెట్స్ పైకెళ్లింది. సీక్వెల్ తాలూకు 50శాతం సినిమా షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ తాలూకు ప్యాచ్ వర్క్, 4 సాంగ్స్ పూర్తి చేసి, దీన్నీ దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అంతే కాదు మరీ ఎక్కువ గ్యాప్ లేకుండా సంక్రాంతికి ది రాజా సాబ్ రెండో పార్ట్ ని కూడా రిలీజ్ చేయాలనేదే ప్రస్థుత ప్లాన్. అందుకే ఈ సినిమా రెండు భాగాల పనులు జరగటం వల్లే, ఇంతగా సాగతీత నడుస్తోందని తెలుస్తోంది.ప్రభాస్ పాన్ ఇండియా కింగ్ గా మారాక తన సినిమా ఏది కూడా సింగిల్ గా వచ్చేలా లేదు. బాహుబలి ది బిగినింగ్, ది కన్ క్లూజన్ లానే, సలార్ సీజన్ ఫైర్, సలార్ శౌర్యాంగ పర్వం, కల్కీ 1, కల్కీ 2 ఇలా ఏది చూసినా రెండు భాగాలుండాల్సిందే… మరి ఫౌజీ కూడా రెండు భాగాలుంటుందో లేదో కాని, ది రాజా సాబ్ మాత్రం రెండు భాగాల కథగా కన్ఫామ్ అయ్యింది.
ఇక ఫౌజీ ప్రజెంట్ 30 రోజుల షెడ్యూల్ పూర్తి కాగానే 45 రోజులు పూర్తిగా ది రాజా సాబ్ కే కేటాయించాడట ప్రభాస్. ఆ షెడ్యూల్ లోనే ది రాజా సాబ్ ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తవటమే కాదు, రెండో భాగానికి సంబందించి 80 శాతం వరకు షూటింగ్ పూర్తవుతుందట. ఆల్రెడీ సలార్ 2, కల్కీ 2 తాలూకు సినిమాల షూటింగ్స్ ని ఇలానే మొదటి భాగం తీస్తున్నప్పుడే కొంత పార్ట్ పూర్తిచేశారు. ది రాజాసాబ్ సీక్వెల్ కి ఇదే ఐడియా అప్లై చేస్తున్నారు.