1000 కోట్లలో 70 శాతం అక్కడే… 973 లోకేషన్స్ లో 30%.
సూపర్ స్టార్ మహేశ్ బాబు తో రాజమౌళి తీస్తున్న సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో కొంత పార్ట్ జరిగింది. ఇంకా అక్కడ నాలుగు షెడ్యూల్లు ప్లాన్ చేశాడు రాజమౌలి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు తో రాజమౌళి తీస్తున్న సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో కొంత పార్ట్ జరిగింది. ఇంకా అక్కడ నాలుగు షెడ్యూల్లు ప్లాన్ చేశాడు రాజమౌలి. ఇదేం పెద్ద న్యూస్ కాదు. కాని వెయ్యికోట్ల బడ్జెట్, వెయ్యి లొకేషన్ల మధ్య లింకు ఇది న్యూస్ గా మారేలా ఉంది. 1000 కోట్ల పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాని, ఖచ్చితంగా 1000 లొకేషన్స్ లో తీస్తున్నారు. ఎందుకు అంత ఖచ్చితంగా వెయ్యిలొకేషన్స్ లో తీయాలనుకుంటున్నారు. అదేమైనా సెంటిమెంటా? లేదంటే దాని వెనక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉందా? ఈడౌట్లే షాకిస్తున్నాయి. కొందరైతే ఒక్కో లొకేషన్ కి కోటి చొప్పున 1000 కోట్లు వెయ్యిలొకేషన్స్ కే 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారా అన్న డిస్కర్షన్ పెరిగింది. కాని ఈ వెయ్యినెంబర్ కి, ఆ వెయ్యిలొకేషన్స్ కి సాలిడ్ కనెక్షన్ ఉంది. హాలీవుడ్ మూవీ డావిన్సీ కోడ్ సినిమా వెనకున్న లాజిక్స్ నే ఇందులో రాజమౌళి ఫాలో అవుతున్నాడట. అయినా మూవీలో మ్యాటర్ ఉండాలి కాని, ఇవన్నీ దేనికని ఎవరికైనా అనిపిస్తుంది. కాని కంటెంట్ ని మించేలా ప్రమోషన్ ప్లాన్ చేశాడు కాబట్టే, ఈ లాజిక్ వెనక సెన్సేషనల్ విజన్ ఉందని తెలుస్తోంది.. అదేంటో చూసేయండి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, హాలీవుడ్ లో సెటిలైన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో రాజమౌళి తీసే సినిమాకు, 1000 నెంబర్ కి విచిత్రమైన లింకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 1000 లొకేషన్స్ లో తెరకెక్కబోతోంది. ఆల్రెడీ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒకషెడ్యూల్ షూటింగ్ మొదలైంది. మరో మూడు, నాలుగు షెడ్యూల్స్ కూడా ఇక్కడే ప్లాన్ చేశారు.బాహుబలి1, బాహుబలి 2, త్రిబుల్ ఆర్ ఈ మూడు కూడా ఇలానే అల్యూమినియం ఫ్యాక్టరీలోనే మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్నాయి. సో అదే సెంటమెంట్ తో మహేశ్ బాబు పాన్ వరల్డ్ మూవీ కూడా రాజమౌళి, ఇలా అక్కడే ప్లాన్ చేశాడో లేదో కాని, 1000 లొకేషన్స్, 1000 కోట్ల బడ్జెట్ మాత్రం అందరి అటెన్షన్ లాక్కుంటోంది.
నిజానికి కెన్యాలో ఈ మూవీ షూటింగ్ ని 10శాతం పైనే ప్లాన్ చేశారట. అల్యూమినియం ఫ్యాక్టరీ తర్వాత ఫిల్మ్ టీం వెళ్లేది కెన్యాకే అని తెలుస్తోంది. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో ఈసినిమా 30 శాతం తీస్తారట. కంప్లీట్ సెట్లు, గ్రీన్ మ్యాట్ సీన్లన్నీ రామోజీ ఫిల్మ్ సిటీలోనే ప్లాన్ చేసిన రాజమౌళి, 10శాతం అల్యూమినియం ఫ్యాక్టరీలో, 30శాతం సౌత్ ఆఫ్రికాలో షూటింగ్ ప్లాన్ చేశాడు.అంటే రామోజీ ఫిల్మ్ సిటీ, అల్యూమినియం ఫ్యాక్టరీ, సౌత్ ఆఫ్రికా, కెన్యా ఈ నాలుగు లొకేషన్స్ లోనే 80 శాతం షూటింగ్ జరగబోతోంది. మిగతా 20శాతం షూటింగ్ కోసం ఏకంగా 996 లొకేషన్స్ ని ఎంచుకుంది ఫిల్మ్ టీం. అదే విచిత్రంగా ఉంది. ఒకటి కాదు రెండు కాదు 996 లొకేషన్స్ ని కేవలం 20శాతం సీన్స్ కోసం వాడటం వెనకున్న లాజిక్కే ఎవరికీ అంతుచిక్కట్లేదు. అసలు సింగిల్ అప్ డేట్ కాని, మరే ఇతర విషయాలు కాని బయటికి పొక్కకుండా అగ్రిమెంట్ రాయించుకున్న రాజమౌళి, లొకేషన్స్ తాలూకు ఇన్ ఫర్ మేషన్ ని మాత్రం లైట్ తీసుకుంటున్నాడు.
ఏ అప్ డేట్ ఇవ్వనప్పుడు, కనీసం ఇలాంటిదేదో బయటికొస్తే ఫ్యాన్స్ కి పండగని లైట్ తీసుకున్నాడో…లేదంటే ఈ ఇన్ ఫర్ మేషన్ వల్ల సినిమాకెలాంటి డ్యామేజ్ లేదని అలా లైట్ తీసుకున్నాడో కాని, 1000 లొకేషన్స్ లో సినిమా షూటింగ్ అన్న మ్యాటరే అందరి అటెన్షన్ లాక్కుంటోంది. హాలీవుడ్ మూవీ డావిన్సి కోడ్ లో ఒక్కో కోడ్ ని బ్రేక్ చేస్తుంటే, అక్కడ లొకేషన్లు మారిపోతుంటాయి. అచ్చంగా ఇలానే మహేశ్ మూవీ లో ట్రెజర్ హంట్ లాంటి సీన్లుంటాయా? అందుకోసమే అన్ని లొకేషన్లు అవసరమయ్యాయా..? అన్న డౌట్లొస్తుంటాయి. ఇక ఓ సినిమాలో ఎన్ని ఫైట్లుంటే, ఫైట్ కి కోటి చొప్పున ఇచ్చి తెలుగు సినిమాని కొనుక్కుంటారు హిందీ డిస్ట్రిబ్యూటర్లు…అచ్చంగా ఇలానే చాలా లొకేషన్స్, హెవీ సీక్రసీ ఉన్న సినిమాలు కూడా పాన్ వరల్డ్ ఆడియన్స్ తోపాటు, డిస్ట్రిబ్యూటర్ల అటెన్షన్ లాక్కునే ఛాన్స్ ఉంది. ఇలాంటి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటే అది సినిమా కంటెంట్ ని మించి మార్కెట్ లో ప్రమోషన్ పెంచే ఛాన్స్ ఉంది. అందుకే ఇలా చేస్తున్నారా లేదా అని క్లియర్ కాలేదు. కాని రాజమౌళి ఏం చేసినా, కంటెంట్ లేదంటే మార్కెటింగ్ కి సపోర్ట్ అవ్వాలి కాబట్టి, ఆ అంచనాలే నిజమనే అభిప్రాయం పెరుగుతోంది.