సోలోగా 1000 కోట్లు.. ఆ రికార్డుతోనే హిస్టరీ..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ , ఇప్పటి వరకు రెండు పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్నాడు. ఫస్ట్ హిందీ మూవీ వార్ 2 ని పూర్తి చేసి, డ్రాగన్ గా సెట్లో అడుగు పెట్టే పనిలో ఉన్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 20, 2025 | 07:00 PMLast Updated on: Mar 20, 2025 | 7:00 PM

1000 Crores As A Solo Artist History With That Record

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ , ఇప్పటి వరకు రెండు పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్నాడు. ఫస్ట్ హిందీ మూవీ వార్ 2 ని పూర్తి చేసి, డ్రాగన్ గా సెట్లో అడుగు పెట్టే పనిలో ఉన్నాడు. ప్రజెంట్ కాస్త సన్నబడ్డాడు. ఐతే ఇంతవరకు వచ్చిన రెండు పాన్ ఇండియా హిట్లలో సోలోగా తనకి వెయ్యికోట్ల రికార్డు సొంతం కాలేదు. త్రిబుల్ ఆర్ 1350 కోట్లు రాబట్టిన సినిమానే కావొచ్చు.. కాని ఇందులో రాజమౌళికే ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది. రామ్ చరణ్ కూడా కలిసి నటించాడు కాబట్టి, త్రిబుల్ ఆర్ వసూళ్లన్నీ ఎన్టీఆర్ ఎకౌంట్ లోనే వేయలేం. కాని దేవర 2తో మాత్రం ఎవరి సాయం లేకుండా 670 కోట్లు రాబట్ట గలనని ప్రూవ్ చేసుకున్నాడు ఎన్టీఆర్. కాని దేవర 1000 కోట్ల వసూళ్లు రాబట్టలేదు. సో ఏం చేసిన 1000 కోట్లని సోలోగా రాబట్టడమే తన నెక్ట్స్ టార్గెట్. మరి ఆ టార్గెట్ ని రీచ్ అయ్యే సీన్ ఉన్న మూవీ ఏది? వార్ 2 మూవీ రిలీజ్ కి ముందే 1500 కోట్ల బిజినెస్ చేసేలా ఉన్నా, ఎందుకు ఇది ఎన్టీఆర్ కలని నెరవేర్చలేదు..? హావేలుక్

ఎన్టీఆర్ కి వార్ 2 మూవీతో కూడా ఆల్ మోస్ట్ పాన్ ఇండియా హ్యాట్రిక్ కన్ఫామ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ మతిపోగొడుతోంది. ఆడియో రైట్స్ 90 కోట్లకు సేల్ అయితే, ఓటీటీ రైట్స్ ఏకంగా 470 కోట్లు పలికాయి.. ఇక సౌత్ ఇండియా రైట్స్ 200 కోట్లు పలికితే, ఓవర్ సీన్ తాలూకు అన్ని భాషల రైట్స్ 150 కోట్ల ధరపలికిందట.ఇక నార్త్ ఇండియా రైట్స్ 800 కోట్లంటున్నారు. ఇవన్నీ కలిపితే 1700 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్సే మతిపోగొట్టేలా ఉంది. సోఎలా చూసినా వార్ 2 తో ఎన్టీఆర్ కి హ్యాట్రిక్ పాన్ ఇండియా హిట్ పడే ఛాన్స్ఉంది. కాని తారక్ టార్గెట్ అది కాదు. తను నెక్ట్స్ లెవల్ కి వెళ్లాలంటే కావాల్సింది కూడా ఆ సక్సెస్ మాత్రమే చాలదు..

పాన్ ఇండియా లెవల్లో నెక్ట్స్ స్టేజ్ కి వెళ్లాలంటే హీరో ఎవరికైనా హిట్ పడితే చాలదు. కనీసం 1000 కోట్ల రికార్డు సొంతమవ్వాలి. అది కూడా రాజమౌళి లాంటి డైరెక్టర్ వల్ల హిట్ రాకూడదు… బన్నీకి 1800 కోట్ల వసూళ్లు రాబట్టిన పుష్ప2 రికార్డుంది.. యష్ కి కూడా 1300 కోట్లు రాబట్టిన కేజీయఫ్ 2 రికార్డు ఉంది. కాని ఇవి హిట్ మూవీలకు సీక్వెల్స్ కాబట్టి, దీని క్రెడిట్ అంతా హీరో కంటే, దర్శకుడి ఎకౌంట్ లోనే వేస్తారు. కాబట్టి పాన్ ఇండియా లెవల్లో డైరెక్టర్ గొప్పతనం తోపనిలేకుండా ప్రభాస్ కల్కీ తో 1200 కోట్లు రాబట్టినట్టు, షారుఖ్ ఖాన్ పటాన్, జవాన్ తో 1000 కోట్ల వసూళ్లని రెండు సార్లు రాబట్టినట్టు, ఎన్టీఆర్ కూడా సోలో హీరోగా 1000 కోట్లు కొల్లగొట్టాలి.

దేవర తో అలాంటి రికార్డు తనకి సొంతమయ్యేదే కాని, 670 కోట్ల వసూళ్ల తో పాన్ ఇండియా హిట్ మాత్రమే తనకి సొంతమైంది. దేవర 2 వస్తే ఈజీగా 1000 కోట్ల రికార్డు తనకి సొంతమయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే ప్రశాంత్ నీల్ మేకింగ్ లో చేస్తున్న డ్రాగన్ ఏమాత్రం వర్కవుట్ అయినా 1000 కోట్లు అసలు మ్యాటరే కాదు. అదే జరిగితే, ప్రభాస్, షారుఖ్ ఖాన్, తర్వాత ఎన్టీఆరే ఇలా వెయ్యికోట్లని రాబట్టిన హీరో అవుతాడు. సోలో హీరోగా అది కూడా హెవీ మార్కెట్ లేని దర్శకుడి మేకింగ్ లో థౌజెండ్ వాలాని పేల్చిన స్టారవుతాడు… సో ఆ రికార్డే 2026 పొంగల్ కి సాధ్యమయ్యేలా ఉంది.