1000 కోట్ల కొట్లాట.. ముగ్గురే ఇండస్ట్రీ మొనగాళ్లు…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తో 1300 కోట్లు, దేవరతో 670 కోట్లు రాబడితే... రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ తో 800 కోట్లు కొల్లగొట్టాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2025 | 06:24 PMLast Updated on: Feb 13, 2025 | 6:24 PM

1000 Crores Brawl Three Are Industry Leaders

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తో 1300 కోట్లు, దేవరతో 670 కోట్లు రాబడితే… రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ తో 800 కోట్లు కొల్లగొట్టాడు. కల్కీతో 1200 కోట్ల పండగ తెచ్చాడు. బన్ని పుష్ప1 తో 450 కోట్లు, పుష్ప2 తో 1890 కోట్లు కొల్లగొట్టాడు. ఇవన్ని చూసే బాలీవుడ్ హీరోల్లో వణుకు స్పష్టంగా కనిపించింది. ఖాన్లు, కపూర్లు, ఇలాంటి బడా బడా స్టార్లే భయపడే పరిస్థితొచ్చింది. కాని ఆ మార్కెట్ నే నిలబెట్టుకోవటం మనోళ్లకి కష్టమౌతోందా…? పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసే స్టామినా, తిప్పి తిప్పి కొడితే ముగ్గురి దగ్గరే ఉందా..? చరణ్ అండ్ కో ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. విజయ్ దేవరకొండ గట్టెక్కడమే కష్టమౌతోంది.. రాజమౌళి మూవీ వస్తే తప్ప సూపర్ స్టార్ సందడి కనిపించదు.. సో ఏం చేసినా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, లేదంటే రెబల్ స్టారే చేయాలా.. ? ఈ ఇద్దరి దారి బానే ఉన్నా అల్లు అర్జున్ కి అనుమానాలు పెరిగాయా..? మొత్తంగా చూస్తే మెల్లిగా పాన్ ఇండియా స్టామినా ఉన్న స్టార్స్ సంఖ్య తగ్గిపోతోందా..? ఇలా అనిపించటానికి రీజనేంటి? హావేలుక్

పాన్ ఇండియా మార్కెట్ అంటేనే టాలీవుడ్ స్టార్ హీరోలది అనేంతగా మనోళ్లు, బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్లు కొడుతున్నారు. ప్రభాస్ ఏకంగా ఐదు పాన్ ఇండియా హిట్లతో ఐదు భాషల్లో 5 వేల కోట్ల వరకు వసూళ్ళు రాబట్టాడు. ఎన్టీఆర్ రెండు పాన్ ఇండియా హిట్స్ తో 2 వేల కోట్ల వరకు వసూళ్లు వెనకేశాడు. అల్లు అర్జున్ ఫుష్ఫ రెండు భాగాలతో 2200 కోట్ల వరకు రాబట్టాడు… ఈ ముగ్గురు పాన్ ఇండియా లెవల్లో వసూళ్ల వరదలు తెచ్చారు.కాని ఇంకెవిరికీ ఈ స్టామినా లేదా..? ఎందుకంటే తండేల్ మూవీ హిందీలో వారం రోజులుగా రాబట్టింది 12 లక్షలే… తమిల నాడులో అయితే కేవలం పదిలక్షలే… కేవలం తెలుగు మార్కెట్ లోనే వన్ వీక్ లో 70 కోట్ల వసూళ్లు దాటాయి. నాని సరిపోదా శనివారం అయితే పాన్ ఇండియా హిట్టే కాని, హిందీలో 50 లక్షలు, తమిళ్ లో 3 కోట్లు, మలయాళం లో కేవలం 6 లక్షలే రాబట్టింది..

సో ఇలాంటి హిట్లు తెలుగు హిట్లే అవుతాయి కాని, పాన్ ఇండియా హిట్లనలేం… ఐదు భాషల్లో సినిమాలను రిలీజ్ చేస్తే సరిపోదు.. అందులో ఒకటే భాషలో మూవీ హిట్ అయితే అది పాన్ ఇండియా హిట్ అయిపోదు… అలా జరగాలంటే, హిందీ మార్కెట్ తో పాటు తమిళ, కన్నడ, మళయాల మార్కెట్ లో కూడా హీరోలకు క్రేజుండాలి. మార్కెట్ లోమైలేజ్ ఉండాలి…ఫన్ ఎగ్జాంపుల్… పుష్ప 2, కల్కీ , దేవర హిందీ బెల్ట్ లో 70 కోట్ల పైనే ఓపెనింగ్స్ రాబట్టాయి. తమిల్, మార్కెట్ లోనే కాస్త ఇబ్బంది పడ్డాయి. ఇక గేమ్ ఛేంఝర్ హిందీ మార్కెట్ లో 50 కోట్లు రాబడితే, మిగతా భాషల్లో డిజాస్టర్ గా మారింది. ఓరకంగా చూస్తే సాహో మూవీ సౌత్ లో సోసోగా ఆడినా, హిందీలో హిట్ అవటంతో 350 కోట్ల పెట్టుబడికి 550 కోట్ల రాబడి వచ్చింది. రాధేశ్యామ్, ఆదిపురుష్ ప్లాపైనా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ పుణ్యమాని ఒకటి 300 కోట్లు, మరొకటి 650 కోట్లు రాబట్టింది.

ఇది పాన్ ఇండియా క్రేజ్ , పాన్ ఇండియా మార్కెట్ అంటే… సో హిట్ మూవీలు సునామీ క్రియేట్ చేస్తే, యావరేజ్ సినిమాలకు కూడా మార్కెట్ ని షేక్ చేయాలి. అలాంటి పాన్ ఇండియా స్టామినా, క్రేజ్ ఇండియాలో ఇప్పుడు ముగ్గురంటే ముగ్గురికే ఉందని తేలింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెండు పాన్ ఇండియా హిట్లతో దూసుకెళుతుంటే, ప్రభాస్ ఐదు పాన్ ఇండియా హిట్లతో పాతుకుపోయాడు. బన్నీ రీసెంట్ హిట్ తో పాన్ ఇండియా లెవల్లో తనకున్న క్రేజ్ ఎంతో తేల్చాడు… కాకపోతే పుష్ప కాకుండా మరో మూవీతో తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేజీయఫ్ ఫేం యష్ కి కూడా ముందుంది పాన్ ఇండియా అగ్ని పరీక్ష.. ఈవిషయంలో చరణ్ రెండు సార్లు ఫ్లాప్ ఫేస్ చేశాడు. పాన్ ఇండియా స్టామినా విషయంలో వెనకబడిపోయాడు.