3 రోజుల్లో 1000 కోట్ల విధ్వంసం.. రెడ్ అలర్ట్.. బాక్సాఫీస్ ఎరుపెక్కుతుంది..!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2025 | 12:11 PMLast Updated on: Mar 25, 2025 | 12:12 PM

1000 Crores Destroyed In 3 Days Red Alert Box Office Will Turn Red

సంక్రాంతి తర్వాత టాలీవుడ్‌లో మళ్లీ ఆ రేంజ్‌లో సినిమా కళ కనిపించలేదు. మధ్యలో అప్పుడప్పుడూ తండేల్ లాంటి సినిమాలు వచ్చాయి కానీ పూర్తి స్థాయిలో బాక్సాఫీస్‌ను కలెక్షన్లతో ముంచెత్తిన సినిమాలైతే రాలేదు. కోర్ట్ ఈ మధ్య వచ్చి కాసిన్ని డబ్బులు మిగిల్చింది బయ్యర్లకు. ఇక చాలా రోజుల తర్వాత ఈ వీకెండ్ వరస సినిమాలు వస్తున్నాయి. 2 రోజుల గ్యాప్‌లోనే ఏకంగా 5 సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో 2 డబ్బింగ్ సినిమాలే. అయినా కూడా వాటిపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. వరస రోజుల్లో ఉగాది, రంజాన్ పండగలు ఉండటంతో.. రెండు పండగలను క్యాష్ చేసుకునేలా వరస సినిమాలు విడుదల చేస్తున్నారు మేకర్స్. మార్చి 27 నుంచి సినీ పండగ మొదలు కానుంది.

బాక్సాఫీస్ దగ్గర పేలనున్న పాంచ్ పటాకాలో ముందుగా వస్తున్న సినిమా మోహన్ లాల్ ‘ఎల్2 ఎంపురాన్’. ఈ సినిమా మార్చి 27 దిగుతోంది. ఈ సినిమాకు నడుస్తున్న అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే మతులుపోతున్నాయి. గంటలకు లక్ష వరకు టికెట్స్ బుక్ అవుతున్నాయి. మలయాళం వెర్షన్ మాత్రమే కాదు.. తెలుగులోనూ దీనికి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. బిజినెస్ కూడా దాదాపు 400 కోట్ల వరకు జరుగుతుంది. దిల్ రాజు ఈ సినిమాను ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఏపీ, తెలంగాణలో భారీగానే విడుదల చేస్తున్నాడు. అదే రోజు విక్రమ్ ‘వీర ధీర శూర పార్ట్ 2’ వస్తుంది. మిగిలిన అన్ని సినిమాలతో పోలిస్తే దీనిపై అంచనాలు తక్కువగానే ఉన్నాయి. విక్రమ్ సినిమా ఒకటి విడుదలవుతుందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. కాకాపోతే ట్రైలర్ అయితే అదిరిపోయింది. కచ్చితంగా రేపు టాక్ బాగుంటే కలెక్షన్ల వేటలో విక్రమ్ పుంజుకునే అవకాశం లేకపోలేదు. తమిళంతో పాటు వరల్డ్ వైడ్‌గా 100 కోట్ల బిజినెస్ చేస్తుంది వీర ధీర శూరన్.

మార్చి 28న తెలుగు సినిమాలు సందడి చేయబోతున్నాయి. నితిన్ ‘రాబిన్ హుడ్’తో పాటు మ్యాడ్ స్క్వేర్ అదే రోజు విడుదల కానున్నాయి. అందులో నితిన్ సినిమా బడ్జెట్ కాస్త ఎక్కువగానే ఉంది. పైగా ప్రమోషనల్ కంటెంట్ అదిరిపోతుంది. ముఖ్యంగా నితిన్ కామెడీ టైమింగ్‌తో పాటు కేతిక శర్మ ఐటెం సాంగ్, శ్రీలీల గ్లామర్, డేవిడ్ వార్నర్ క్యామియో, వెంకీ కుడుముల ట్రాక్ రికార్డ్ అన్నీ కలిపి రాబిన్ హుడ్‌పై అంచనాలు అయితే బాగానే పెంచేస్తున్నాయి. ఈ సినిమా బిజినెస్ దాదాపు 50 కోట్ల వరకు జరుగుతుంది. మరోవైపు ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాను అస్సలు తక్కుంచనా వేయడానికే లేదు. లూసీఫర్ 2, వీర ధీర శూరన్, రాబిన్ హుడ్ కంటే మెట్రో సిటీస్‌లో మ్యాడ్ స్క్వేర్ కోసమే యూత్ ఎక్కువగా వేచి చూస్తున్నారు బుకింగ్స్ కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్.. సల్మాన్ ఖాన్ ‘సికందర్’ మార్చి 30న వస్తుంది. ట్రైలర్, టీజర్ పెద్దగా ఆకట్టుకోకపోయినా.. రంజాన్, సల్మాన్ ఖాన్ డెడ్లీ కాంబినేషన్. కాబట్టి తక్కువ అంచనా వేయలేం. పైగా మురుగదాస్ దర్శకుడు. ఈ సినిమా బిజినెస్ అయితే 400 కోట్ల వరకు జరుగుతుంది. హిట్టైతే 500 కోట్ల నుంచి 750 కోట్ల మధ్యలో సల్మాన్ వసూలు చేస్తాడు. మొత్తానికి ఈ 3 రోజుల విధ్వంసంలో 1000 కోట్లు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. మరి వీళ్లలో గెలుపెవరిదో చూడాలి.