1000 కోట్ల కోరికకు.. 100 కోట్ల ఈగో సమస్య..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 సక్సెస్ తర్వాత ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ తో దేవర లాంటి హిట్ ఇచ్చిన కొరటాల శివ తో కథ చర్చ లు చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 3, 2025 | 08:15 PMLast Updated on: Mar 03, 2025 | 8:15 PM

1000 Crores Of Desire 100 Crores Of Ego Problem

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 సక్సెస్ తర్వాత ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ తో దేవర లాంటి హిట్ ఇచ్చిన కొరటాల శివ తో కథ చర్చ లు చేశాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా తనకి చెప్పిన కథనే బన్నీకి రెఫర్ చేసి సపోర్ట్ చేశాడనంటున్నారు. అంతవరకు బానే ఉంది. ప్రశాంత్ నీల్ తో కూడా బన్నీ సినిమా ఓకే అయ్యేలా ఉంది. కాకపోతే అవి దేవర2, డ్రాగన్ షూటింగ్స్ పూర్తయ్యాకే.. ఆలోగా అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఐకాన్ స్టార్ సినిమా చేయాలి. లేదంటే ఆల్రెడీ ఓసారి డిస్కర్స్ చేసిన డైరెక్టర్ ఆట్లీతో మూవీకి మూవ్ కావాలి. కాని ఒకరేమో 100 కోట్లకు ఒక్క పైసా తగ్గనంటున్నారు. అక్కడ ఐకాన్ స్టార్ సీన్ లో ఉన్నా, తను తగ్గేదే లేదని తేల్చాడు. విచిత్రం ఏంటంటే ఓ సారి ఆట్లీతో సినిమా వద్దని ఊరుకున్న బన్నీ, కాస్త తగ్గి మళ్లీ ఆట్లి దగ్గరకే వెల్లాడు. కాని ఆట్లీ మాత్రం అస్సలు తగ్గేదిలేదనేశాడు. సరే ఈలోపు త్రివిక్రమ్ అయినా ప్రాజెక్టు పనులు చేస్తున్నాడా, అంటే అంతా పవన్ మయమే అనేస్తున్నారు. ఇక్కడేమో కథ రెడీ కావట్లేదు, అక్కడేమో కథ రెడీగా ఉన్నా బన్నీ తగ్గమనే కొద్ది డైరెక్టర్ ఆట్లీ ఎక్కి తొక్కుతున్నాడనంటున్నారు. ఏది నిజం? ఎందుకలా? హావేలుక్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ముందు నుయ్యి వెనక గొయ్యిలా పరిస్థితులు పగపట్టాయి. ఒకవైపు ఆట్లీతో ఎంత తగ్గి సినమా చేద్దామనుకున్నా ఆ డైరెక్టర్ తగ్గట్లేదు. సరే ముందే కమిటైన పాపానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ చేద్దామంటే, తను మైథాలజీ స్టోరీ లైన్, కథ బానే చెప్పినా ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేయలేదు. టైం తీసుకుని చేస్తాడనుకుంటే, మధ్యలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసమే తను ఎక్కువ కష్టపడుతున్నాడట.మాటి మాటికి జనసేన ఆఫీస్ లోనే తను దర్శనమివ్వటం, పవన్ పొలిటికల్ జర్నీకి పూర్తిగా సహకరించే పనిలో బిజీ అవటంతో ఇక్కడ బన్నీకి సీన్ రివర్స్ అవుతోంది. నిజానికి కొరటాల శివ తో మూవీకోసమే బన్నీ చాలా ప్రయత్నించాడు. ఎన్టీఆర్ తో దేవర తీసి హిట్ ఇచ్చిన కొరటాల శివ, దేవర 2 ప్లానింగ్ లో ఉన్నాడు. అది కాకుండా ఎన్టీఆర్ కి తను చెప్పిన మరో కథని, బన్నీకె రెఫర్ చేశాడు తారక్..

ఇలా ఎన్టీఆర్ కూడా చరణ్ దగ్గరికి బుచ్చిబాబుని పంపించినట్టే, బన్నీ దగ్గరికి కొరటాల కొత్త కథని పంపించాడు. కాని అది దేవర 2 పూర్తయ్యాకే పట్టాలెక్కే చాన్స్ఉంది. సో లోపు ఆట్లీతో సినిమా చేద్దామని అనుకుంటే తను చుక్కలు చూపిస్తున్నాడు. జవాన్ తో 1000 కోట్ల వసూళ్ళు రాబట్టాడని, తనతో సినిమా చేయబోతే, తను ఏకంగా వందకోట్ల రెమ్యునరేషన్ అడిగాడని గతంలో గీతా ఆర్ట్స్ ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టింది.ఇదే కాదు ఆట్లీ రెమ్యునరేషన్ 100 కోట్లకి తోడు తన టీమ్ కోసం మరో 50 కోట్లు సమర్పించాలి. మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్, ఎడిటర్, హీరోయిన్ విషయంలో తనదే ఫైనల్ డిసీజన్.. ఇవన్నీ కండీషన్స్ కి గతంలో ఒప్పుకోలేక గీతా ఆర్ట్స్ ఆట్లీని లైట్ తీసుకుంది. ఇప్పుడు సన్ పిక్చర్స్ డీల్ సెట్ చేయబోతే, బన్నీ రంగంలోకి దిగాడు. కాకపోతే తన పారితోషికం 250 కోట్లు, డైరెక్టర్ ఆట్లీ పారితోషికం 100 కోట్లు ప్లస్ తన టీం రెమ్యునరేషన్ కలిపితే 150 కోట్లు..మొత్తంగా ఈ పారితోషకాలే 400 కోట్లు దాటుతున్నాయి. ఇక మేకింగ్ కి మరో 400 కోట్లేసుకున్నా, ఈ మూవీ హిట్టైనా 1000 కోట్లు రాబట్టినా వచ్చేది 200 కోట్ల లాభమే.. అవి కూడా పూర్తిగా రావు అంతా షేర్ తీసుకున్నాక నిర్మాతకి వచ్చేదెంత…?

అందుకే ఇనిషీయేటివ్ తీసుకున్న సన్ పిక్చర్స్ కూడా ఆట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్ మీద అంత పెట్టడానికి ధైర్యం చేయట్లేదు. అసలే పుష్ప2 హిట్టైనా సంధ్యా థియేటర్ ఇష్యూతో ఆ ఆనందం కూడా బన్నీకి దక్కలేదు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ మూవీలు తీసే దర్శకులెవరూ అందుబాటులో లేరు. ఉన్న వాళ్లతో తీద్దామంటే వంద అడ్డంకులు… మొత్తంగా బన్నీకి పాన్ ఇండియా లెవల్లో తనని తాను మూడో సారి ప్రూవ్ చేసుకునేలోపే, అసలు ప్రాజెక్ట్ పట్టాలెక్కడమే పెద్ద విషయం అవుతోంది.