1000 కోట్ల వణుకు.. ఆమెని భయపెట్టి అదేం పని…?
1000 కోట్ల బడ్జెట్ తో ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమా రాలేదు. హాలీవుడ్ లో కూడా 500 కోట్ల నుంచి 2 వేల కోట్ల వరకు బడ్జెట్ సినిమాలు తీస్తారు.
1000 కోట్ల బడ్జెట్ తో ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమా రాలేదు. హాలీవుడ్ లో కూడా 500 కోట్ల నుంచి 2 వేల కోట్ల వరకు బడ్జెట్ సినిమాలు తీస్తారు. అవన్నీ హెవీ బడ్జెట్ మూవీల కేటగిరీలోకి వస్తాయి… అలాంటి లిస్ట్ లో చేరేలా రాజమౌళి, తన కొత్త సినిమాను నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ అనేలా తీస్తున్నాడు. అంతవరకు బానే ఉంది కాని, వెయ్యికోట్ల పేరు చెప్పి హాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రాను రాజమౌళి భయపెడుతున్నాడా..? ఈ డౌట్ రీజనుంది. సూపర్ స్టార్ మహేశ్ లాంటి హీరోతో జోడీ అంటే ప్రియాంక లెవల్ కి తగ్గట్టే ఆఫర్ దక్కినట్టు… అలానే రాజమౌలి లాంటి ట్రెండ్ సెట్టర్ తో సినిమా అంటే కూడా కలిసొచ్చే అంశమే.. కాని ప్రియాంక చోప్రా ఈ సినిమాకు సైన్ చేసినట్టే చేసి, వణికిపోతోంది. పూర్తిగా దేవుని మీదే భారం వేసి ఆలోచనలో పడింది. ఆమె అంతగా కంగారుపడటానికి కారణం, రాజమౌళి పెట్టిన భయాలు.. అవేంటి? టేకేలుక్
రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్ లో లాంచైన పాన్ వరల్డ్ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా సైన్ చేసింది. మొన్నామధ్య హైద్రబాద్ లోల్యాండ్ అయిన తను, రాజమౌళితో రెండు రోజులు రెండు సార్లు డిస్కర్స్ చేసి, తన డేట్లు కూడా ఇచ్చేసిందట. ఆ ప్రాసెస్ లోనే లైఫ్ లో ఫస్ట్ టైం భారీ రిస్క్ చేస్తున్న తను, చిలుకూరు బాలాజీ బ్లెస్సింగ్స్ తీసుకుందట. దీంతోనే అంతగా ప్రియాంక ఎందుకు కంగారుపడుతుందన్న డిస్కర్షన్ మొదలైంది.
బాలీవుడ్ ని ఏలాక, ఆఇండస్ట్రీని వదిలేప్పుడు ప్రియాంక చోప్రా భయపడలేదు. హాలీవుడ్ వెల్లాక తన కలర్ మీద కామెంట్స్ వచ్చినా కంగారు పడలేదు. తనకంటే చిన్నవాడైన పాప్ సింగర్ నిక్ జోన్స్ ని పెళ్లాడితే, చాలా ట్రోలింగ్స్ జరిగాయి. అయినా లెక్కఛేయలేదు ప్రియాంక. క్వాంటికో నుంచి సిటాడెల్ లాంటి వెబ్ సీరీస్ లతో అక్కడ దూసుకెళ్లింది. తనని తాను ప్రూవ్ చేసుకుని, హాలీవుడ్ లో కూడా టాప్ హీరోయిన్స్ లిస్ట్ లోచేరింది
కట్ చేస్తే ఇంత పేరు, అంత క్రేజు, మరింత మార్కెట్ ఉన్న తను, రాజమౌళి సినిమా చేసేందుకు గజగజా వణికే పరిస్థితేంటి? అంత భయపడుతూ ఎందుకు మహేశ్ బాబు సినిమాను సైన్ చేయాలి…? ఇవి ఇండస్ట్రీలో చాలా మందికి ఉన్న డౌట్లు. ముందు పాజిటివ్ అంశాలవిషయానికొస్తే, ప్రియాంక చోప్రా ఎన్ని హాలీవుడ్ సినిమాలు చేసినా రాని పేరు, రాజమౌళి మూవీలోమెరిస్తే వచ్చే ఛాన్స్ ఉంది..
అందులోనూ రాజమౌలి ఫస్ట్ పాన్ వరల్డ్ సినిమా అవటం, ఇందులో నెట్ ఫ్లిక్స్ తోపాటు హాలీవుడ్ సంస్థ డ్రీమ్ వర్క్స్ కూడా జాయిన్ అవటం… ఈరెండు కారనాలతో ఏ హీరోయిన్ అయినా కళ్లుమూసుకుని ఈ సినిమాకు సైన్ చేయొచ్చు.. కాని అక్కడ సీన్ లో రాజమౌళి ఉన్నాడు. తనే ప్రాబ్లమ్ …ఎందుకంటే తనతో సినిమా అంటే రెండుమూడు ఏళ్ళు మరే మూవీ చేయకుండా, తన సినిమాకు కట్టు బానిసైపోవాలి.
కాని అది హీరోలకే వర్తిస్తుంది… బాహుబలి టైంలో అనుష్కా, తమన్నా, త్రిబుల్ ఆర్ లో ఆలియా అండ్ కో ఎవ్వరూ ఇబ్బంది పడలేదు. వాళ్లు హ్యాపీగా వేరేసినిమాలు చేస్తూ రాజమౌలి మూవీలో మెరిశారు. అలాంటప్పుడు ప్రియాంక చోప్రాకొచ్చిన ఇబ్బంది ఏంటనే ప్రశ్నలు వస్తాయి. కాని ఇక్కడ మహేశ్ మూవీలో ప్రియాంక పాత్రది కూడా ప్యారలల్ రోల్ అని తెలుస్తోంది. అందుకే 390 రోజుల కాల్ షీట్స్ ని ఇవ్వాలని రాజమౌలి అడగటంతో ప్రియాంక ఆలోచనల్లో పడిందట. 390 రోజుల కాల్ షీట్స్ అంటే ఏడాది మీద రెండు నెలలు పూర్తిగా ఈమూవీకే కేటాయించాలి. అక్కడే తను డైలామాలో పడింది. ఐనా మంచి అవకాశం అని సైన్ చేసింది.. ఫైనల్ గా ఇప్పుడు టెన్షన్ పడుతోంది. దాని ఎఫెక్టే చిలుకూరి బాలాజీ టెంపుల్ చుట్టు చక్కర్లు, దైర్యం కోసం దైవ దర్శనాలనేస్తున్నారు.