1000 మందితో 1000 కోట్లు… 3000 మందితో 3000 కోట్లా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వెయ్యి మందితో ఫైట్ చేస్తే వెయ్యికోట్లొచ్చాయి... 600 మందితో ఫైట్ చేస్తే 670 కోట్లొచ్చాయి... అందుకే ఈసారి ఏకంగా 3000 కోట్ల కు గురి పెట్టాడా? అందుకోసమే 3 వేల మందిని ప్రశాంత్ నీల్ రంగంలోకి దింపాడా..........?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2025 | 07:45 PMLast Updated on: Feb 22, 2025 | 7:45 PM

1000 Crores With 1000 People 3000 Crores With 3000 People

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వెయ్యి మందితో ఫైట్ చేస్తే వెయ్యికోట్లొచ్చాయి… 600 మందితో ఫైట్ చేస్తే 670 కోట్లొచ్చాయి… అందుకే ఈసారి ఏకంగా 3000 కోట్ల కు గురి పెట్టాడా? అందుకోసమే 3 వేల మందిని ప్రశాంత్ నీల్ రంగంలోకి దింపాడా……….? ఔను రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్ కోసం వెయ్యికాదు, రెండు వేల మంది కాదు… ఏకంగా 3 వేల మంది దేనికైనా రెడీ అంటున్నారు. అయితే అందులో1000 మంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ ఉన్నారట.. 2000 మంది మాత్రం సినిమాకోసమే రిస్క్ చేసేందుకు సిద్ధపడ్డారట… ఇంతకి ఒక్కో మనిషికి ఒక్కో కోటి చొప్పున 3 వేల మందిని 3 వేల కోట్లతో పోల్చటం వెనకున్న రీజనేంటి? 3 వేల కోట్ల కోసం ఎన్ని వందలకోట్లు ఖర్చు పెడుతున్నారు..? ఎన్టీఆర్ లేకుండానే వేల మందితో ప్రశాంత్ నీల్ ఏం చేస్తున్నట్టుు..? టేకేలుక్
3 వేల మంది తోసుకొస్తుంటే, వందమంది పోలీసులు వాల్లని ఆపితే ఎలా ఉంటుంది. ఓ చిన్న పాటి సునామీని జనం రూపంలో చూపిస్తే ఇంకెలా ఉంటుంది. అదే రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఏకంగా 3 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో దర్నా సీన్ ని భారీ ఎత్తున తీస్తున్నాడు ప్రశాంత్ నీల్. అది కూడా ఎన్టీఆర్ లేకుండానే…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రజెంట్ వార్ 2 సాంగ్ షూట్ తో బిజీ అయ్యాడు. అది ఈ మంత్ ఎండ్ కల్లా పూర్తవుతుంది. మార్చ్ ఫస్ట్ వీక్ ఎండ్ నుంచి తను కూడా డ్రాగన్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. త్రిబుల్ ఆర్ లో 1000 మంది ఫైటర్స్ తో రాజమౌలి చరణ్ మీద భారీ ఫైట్ సీన్ తీస్తే 1350 కోట్ల వసూళ్లొచ్చాయి. ఇక 1500 మందితో కొరటాల శివ కూడా దేవర లో భారీ ఫైట్ సీన్ తీశాడు. అందుకు ఫలితంగా 670 కోట్ల వసూళ్లు రాబట్టింది దేవర మూవీ. సో ఎంత మంది జనంతో ఎంత భారీ ఫైట్ డిజైన్ చేస్తే, అంత ఎత్తున వసూల్లొస్తాయనే నమ్మకం పెరిగిందో, లేదంటే ఇదో ట్రెండ్ అయ్యిందో కాని, భారీ ఫైట్ సీన్ అంటే, వెయ్యికి మించి ఫైటర్లు, లేదంటే జూనియర్ ఆర్టిస్టులు సీన్ లో కనిపించాల్సిందే.

జవాన్ లో 1500 మంది డాన్సర్లను పెట్టి సాంగ్ తీస్తే ఆ సినిమా 1300 కోట్లు రాబట్టింది. రాఖీభాయ్ కేజీయఫ్ 2 కోసం 1000 మంది మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తే, 1350 కోట్ల వసూల్ల వరదొచ్చింది. సో ఇక్కడ పాన్ ఇండియా లెవల్లో వసూల్ల వర్షం కురవాలంటే, సెట్లో వేల మందితో ఫైట్ సీన్ లేదంటే మాస్ సీన్ అదరాలి… అదే ఇక్కడ ఎన్టీఆర్ లేకుండా తీస్తున్నారు..పోలీసులకి వ్యతిరేఖంగా దర్నా చేసే యువకుల సీన్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో తీస్తున్నాడు ప్రశాంత్ నీల్… అందులో ఏకంగా1000 మంది ఎన్టీఆర్ రియల్ ఫ్యాన్స్ ఉంటే, 2000 మంది జూనియర్ ఆర్టిస్టులుండటం ఇక్కడ స్పెషల్ న్యూస్. ఇక హీరోలేకుండానే 3 వేల మందిని సెట్లోకి దింపిన ప్రశాంత్ నీల్, ఇక వచ్చనెల హీరో సెట్స్ కి వస్తే ఇంకెన్ని వేల మందితో భారీ ఫైట్ సీన్ ప్లాన్ చేస్తాడో అన్న డిస్కర్షన్ మొదలైంది.