ఎన్టీఆర్ కోసం 1000 మంది పోలీసులు…? డ్రాగన్ ఎంట్రీ…?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ సెట్లో అడుగు పెడుతున్నాడు. మొన్నటి వరకు జపాన్ లో దేవర ప్రచారంతో బిజీ అయ్యాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ లో డ్రాగన్ గా నిప్పులు కక్కేందుకు రెడీ అవుతున్న తను, వచ్చే నెల ఫస్ట్ రెండు వారాల్లో వార్ 2

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ సెట్లో అడుగు పెడుతున్నాడు. మొన్నటి వరకు జపాన్ లో దేవర ప్రచారంతో బిజీ అయ్యాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ లో డ్రాగన్ గా నిప్పులు కక్కేందుకు రెడీ అవుతున్న తను, వచ్చే నెల ఫస్ట్ రెండు వారాల్లో వార్ 2 పెండింగ్ సాంగ్ షూటింగ్ ని, ప్యాచ్ వర్క్ ని పూర్తి చేస్తాడని తెలుస్తోంది. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ భారీ ఈవెంట్ లో సందడి చేయటం ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. అసలు దేవర ప్రిరిలీజ్ ఈవెంట్ నే అప్పట్లో జనాల తొక్కిసలాటకి భయపడి సగంలోనే క్యాన్సిల్ చేశాడు. అలాంటిది దేవర హిట్టైన ఇంతకాలానికి, ఓ ఈవెంట్లో ఎన్టీఆర్ అంటే మళ్లీ ఫ్యాన్స్ వరదలా వచ్చే ఛాన్స్ ఉంది. అసలే పుష్ప 2 సంథ్యా థియేటర్ సంఘటన తర్వాత ఏ హీరో కూడా ఓపెన్ ఈవెంట్స్ కి సిద్ధపడట్లేదు. అలాంటిది ఏకంగా రెండు ఎన్టీఆర్ ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఇది ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అంశమే అయినా, ఇందులో కొంత కంగారు పడాల్సిన మ్యాటర్ కూడా ఉంది…అదేంటో చూసేయండి…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన బావమరిదికోసం భారీ ఈవెంట్ కి అటెండ్ కాబోతున్నాడు. తర్వాత న అన్నకోసం కూడా మరో ఈవెంట్ కి రెడీ అయ్యాడు. విచిత్రం ఏంటంటే తన సొంత మూవీ దేవర ప్రీరిలీజ్ టైంలో, ఈవెంట్ నే క్యాన్సిల్ చేసుకున్నాడు తారక్. 5 వేల మందిని ఎక్స్ పెక్ట్ చేస్తే 30 వేల వరకు ఫ్యాన్స్ రావటం వల్లే, తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని అలా అప్పడు దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ మధ్యలోనే క్యాన్సిల్ అయ్యింది. కట్ చేస్తే దేవర వచ్చి హిట్టైంది. జపాన్ లోకూడాదూసుకుపోతోంది.
ఇప్పుడు ఈవెంట్ కి రెడీ అయ్యాడు. అదికూడా బావమరిది రీసెంట్ మూవీ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్ సంబంధించింది. మ్యాడ్ సక్సెస్ తర్వాత మ్యాడ్ స్క్వేర్ తో తన బావమరిది మరో హిట్ ని సొంతం చేసుకున్నాడు. అలానే ఈ సినిమా నిర్మాత ఎన్టీఆర్ తో సితార బ్యానర్ లో 50వ ప్రెస్టీజియస్ మూవీ నిర్మించబోతున్నాడు.సో అలా అటు నిర్మాత కోసం, ఇటు బావ మరిది కోసం శిల్పకళా వేదిక లో ఈవెంట్ కి అటెండ్ కాబోతున్నాడు. ఏకంగా వెయ్యిమంది పోలీసుల ఈ ఈవెంట్ ని హ్యాండిల్ చేయబోతున్నారు. అసలే పుష్ప2 టైంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట తర్వాత, ఏ హీరో కూడ బయట ఈవెంట్లకు వెళ్ళట్లేదు. ప్రభుత్వం కూడా పర్మీషన్ ఇవ్వట్లేదు.
అలాంటిది మ్యాడ్ స్క్ర్వేర్ సక్సెస్ మీట్ కి పర్మీషన్ ఇవ్వటమే కాదు, 200 మంది వరకు పోలీసులని ఇస్తోందట. ఇదే కాదు ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వెళ్లబోతున్నాడు. ఇంకా వెన్యూ డిసైడ్ కాలేదు కాని, ఆ ఈవెంట్ ని క్లోజ్ డ్ ఆడిటోరియంలో నిర్వహిస్తే పర్మీషన్ రావొచ్చు. లేదంటే ఏపీలో నే ఈవెంట్ ప్లాన్ చేయాల్సి వస్తుంది. అదే జరిగితే, దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ కి 5 వేలు అనుకుంటే 30 వేల మంధి ప్యాన్స్ వచ్చినట్టు జనాలు వచ్చే చాన్స్ఉంది. అదే జరిగితే తొక్కిసలాట జరుగే అవకాశముందనే కంగారు కూడా కనిపిస్తోంది.
ఇవే ఇలా ఉంటే, ఇక డ్రాగన్ పూర్తయ్యాక ప్రీరిలీజ్ ఈవెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. అలాని దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేసినట్టు, చేస్తామంటే, ఈసారి ఫ్యాన్స్ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టే ఇప్పుడు ఎన్టీఆర్ అటెండ్ అయ్యే రెండు ఈవెంట్లని బట్టే డ్రాగన్ ఈవెంట్ ని ప్లాన్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.