10 ప్యాక్స్ తో 10000 కోట్లు.. బాలీవుడ్ కి మొగుళ్లు..?

టాలీవుడ్ లో నెక్ట్స్ ఏ సినిమాలొస్తున్నాయి. తమిళ్,మలయాళంలో ఈ ఏడాది దుమ్ములిపే మూవీలేవంటే, వెంటనే కనీసం అరడజన్ వరకు ఓ లిస్ట్ చెప్పొచ్చు.. కాని బాలీవుడ్ లో ఈ ఏడాదే కాదు, వచ్చే ఏడాది కూడా బాక్సాఫీస్ ని షేక్ చేసే సినిమాలేవంటే,

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 20, 2025 | 07:35 PMLast Updated on: Mar 20, 2025 | 7:35 PM

10000 Crores With 10 Packs Bollywoods Growth

టాలీవుడ్ లో నెక్ట్స్ ఏ సినిమాలొస్తున్నాయి. తమిళ్,మలయాళంలో ఈ ఏడాది దుమ్ములిపే మూవీలేవంటే, వెంటనే కనీసం అరడజన్ వరకు ఓ లిస్ట్ చెప్పొచ్చు.. కాని బాలీవుడ్ లో ఈ ఏడాదే కాదు, వచ్చే ఏడాది కూడా బాక్సాఫీస్ ని షేక్ చేసే సినిమాలేవంటే, ఆన్సర్ మాత్రం తెలుగు సినిమాల పేర్లే వినిపిస్తాయి. ఔను అక్కడ బాలీవుడ్ హీరోల అడ్రస్ మిస్ అవుతోంది. ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, చరణ్ వీళ్ల సినిమాలే హిందీ మార్కెట్ ని శాసిస్తున్నాయి. ఆఖరికి అక్కడ పండగలకి, అకేషన్లకి రాబోయే టాప్ మూవీస్ ఏవని అంచనా వేసినా వీల్ల పేర్లే వినిపిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే ఒకప్పడు తెలుగు హీరోలంటే నార్త్ ఇండియాలో పేర్లు కూడా సరిగా చెప్పలేకపోయే వాళ్ళు.. కాని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాస్త బక్క చిక్కగానే, తన టెన్ ప్యాక్స్ మీద బాలీవుడ్ లో చర్చ మొదలైంది. ఫ్యాన్ తో మహేశ్ బాబు దిగిన ఫోటో మీద ఏకంగా పావుగంట స్పెషల్ న్యూస్ ని అక్కడి మీడియా వార్త రూపంలో వినిపించింది. టెన్ ప్యాక్స్ తో తెలుగు హీరోలు, బాలీవుడ్ ని కబ్జా చేస్తున్నారనే వార్తే ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తోంది. అదేంటో చూసేయండి.

ప్రజెంట్ టాలీవుడ్ హీరోలు, తెలుగుకే పరిమితం కాలేదు. హ్రితిక్ క్రిష్ 4 ఎప్పుడొస్తుందన్న డిస్కర్షన్ కంటే, సన్న బడ్డ ఎన్టీఆర్, టెన్ ప్యాక్స్ తో డ్రాగన్ లో కనిపించబోతున్నాడన్న ప్రచారం నార్త్ ఇండియాలో వినిపిస్తోంది. రీసెంట్ గా ఒరిస్సాలో రాజమౌళి సినిమా చేస్తున్న మహేశ్ ఫ్యాన్స్ తో ఓఫోటో దిగాడు. అందులో తను సన్నగా కనిపించటంతో, ఇందులో కూడా మహేశ్ టెన్ ప్యాక్స్ తో కనిపించబోతున్నాడనే డిస్కర్షన్ జరుగుతోంది..

చరణ్ కూడా స్పోర్ట్స్ కూలీగా పెద్ది మూవీలో టెన్ ప్యాక్స్ తో కనిపిస్తాడా అన్న ఓ ప్రశ్నిక, మరో నెటీజన్ ఈగర్లీ వేయిటింగ్ అని పెట్టాడు. ఇలాంటి మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. కారణం తెలుగు హీరోలు, వాల్ల సినిమా అప్ డేట్ల మీద నార్త్ ఇండియన్స్ ఫోకస్ మరింత పెరగటం. విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, చరణ్, మహేశ్ వీళ్ల సినిమాల అప్ డేట్స్ మీదే ఉత్తారాది జనం అటెన్షణ్ కనిపిస్తోంది. కాని అసలు బాలీవుడ్ స్టార్స్ మీద ద్యాసే మిస్ అవుతోంది.

ఇక బాలీవుడ్ లో 2025 కే కాదు, 2026 లో బాక్సాఫీస్ ని షేక్ చేసే, అంచనాలున్న సినిమాలన్నీ తెలుగు మూవీలే. డ్రాగన్, దేవర్ 2, కల్కీ 2, రాజా సాబ్, స్పిరిట్, అలానే మహేశ్ బాబు సినిమా వీటిమీదే నార్ ఇండియా ఆడియన్స్ సోసల్ మీడియాలో డిస్కర్షన్ పెట్టారు. ఎక్కడా కూడా ఖాన్లు, కపూర్ల మీద చర్చే లేదు.

విచిత్రం ఏంటంటే పదేళ్ల క్రితం తెలుగు హీరోల పేర్లు కూడా నార్త్ ఇండియన్స్ కి తెలిసేవి కాదు. తమిల్, మలయాళం, కన్నడ స్టార్లంటే అసలు వాళ్లకి తెలిసే ఛాన్స్లేదు. ఏదో కమల్ హాసన్, రజినీకాంత్ లాంటి స్టార్లు హిందీలో ఎక్కువ మూవీలు చేసినవాళ్లు కాబట్టి, వాళ్ల గురించి తెలుసు. కాని వాళ్ల మూవీల అప్ డేట్లు కూడా నార్త్ ఇండియన్స్ పెద్దగా పట్టించుకున్న సందర్భం కూడా లేదు.

కాని ఇప్పుడు దసరా, దీపావలి, సమ్మర్, లేదంటే న్యూ ఇయర్ కి వచ్చే సినిమా లేంటనే డిస్కర్షన్ చేస్తున్నా నార్త్ ఇండియన్స్ కి, తెలుగు సినిమానే గతయ్యింది. ప్రభాస్ మూవీ ది రాజా సాబ్ ఏప్రిల్ నుంచి ఆగస్టుకి వాయిదా పడితే ఇక్కడి ఫ్యాన్స్ కంటే అక్కడి ఫ్యాన్సే తెగ బాధపడ్డారు. దేవర 2 ఎప్పుడనే ప్రశ్న ఎన్టీఆర్ ఎప్పుడు ముంబై ఏయిర్ పోర్ట్ లో కనిపించినా ప్రశ్నిస్తున్నారు… చరణ్, బన్నీ ఏం సినిమాలు చేస్తున్నారు… మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా వచ్చే ఏడాది ఎప్పుడొస్తుంది.. ఇవే సోషల్ మీడియాలో నార్త్ ఇండియన్స్ మధ్య జరుగుతున్న డిస్కర్షన్.

షారుఖ్ ఖాన్ ఏం మూవీ చేస్తున్నాడు. రణ్ బీర్ సింగ్ ఫ్యూచరేంటి ఎవరికీ పట్టట్లేదు. సల్మాన్ కొత్త మూవీ సికిందర్ కైతే అదంటూ ఒకటి వస్తోందన్న పట్టింపు కూడా అక్కడి జనాల్లో కనిపించట్లేదు. హ్రితిక్ వార్ 2 తో అయినా అక్కడి ఆడియన్స్ ద్రుష్టిలో ఉన్నాడు. అక్షయ్ కుమార్ ని అయితే ఉత్తరాది జనం ఒకప్పుడు తోపు స్టార్ అన్నారు. కాని ఇప్పుడు తనని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు.