SANKRANTHI 2024: రెండు రోజులు.. 12 సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద సునామీ ఖాయమా..?
సౌత్, నార్త్.. అంతటా జనవరి 12, 13 తేదీల్లో డజన్‌కిపైనే మూవీలు పోటీ పడబోతున్నాయి. విచిత్రంగా తెలుగు,తమిళంలో మాత్రంమే సంక్రాంతి సెంటిమెంట్ కామన్. కాని నార్త్‌లో కూడా ఆ సీజన్ కోసం విజన్ మార్చింది బాలీవుడ్ హీరోల టీం.
SANKRANTHI 2024: జనవరి 12, 13.. ఈ రెండు రోజుల్లో 12 సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద పెద్ద హీరోల అభిమానులకు పూనకాలు.. ఇవన్నీ వచ్చే ఏడాదికి సాధ్యం కానున్నాయి. జనవరి 12కి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ పోటీ పడబోతున్నాడు. జైలర్‌గా ఆరు సెంచరీలు (రూ.600 కోట్లు) కొట్టిన రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్య తీసిన లాల్ సలాంతో పొంగల్ పోరులో దిగుతున్నాడు. ఐతే మట్టి కుస్తీ ఫేం విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన లాల్ సలాంలో రజినీ 20 నిమిషాలే కనిపించే గెస్ట్ రోల్ వేశాడు.
అలా కూడా ఫ్యాన్స్‌కి పూనకాలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి సంక్రాంతికి గుంటూరు కారంతో వైరానికి లాల్ సలాం చెప్పేశాడు రజినీ. బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్‌తో ఆకట్టుకుంటున్న లోబడ్జెట్ మూవీ హనుమాన్ కూడా జనవరి 12నే రాబోతోంది. పాన్ ఇండియా లెవల్లో ఆల్రెడీ హైప్ వచ్చింది కాబట్టే, దసరాకు రావాల్సిన మూవీ సంక్రాంతికి వాయిదా పడింది. ఇక జనవరి 13న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్ రాబోతోంది. పరశురామ్ మేకింగ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తైంది. అలానే మాస్ మహారాజా రవితేజ ఈగిల్‌కి కూడా అప్పుడే ముహుర్తం కుదిరింది. దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న భారతీయుడు-2 రిలీజ్.. వచ్చే ఏడాది ఆగస్ట్, అక్టోబర్ అంటూ ప్రచారం జరిగినా రిపబ్లిక్ డే స్పెషల్‌గా జనవరిలోనే విడుదల చేయాలి అనుకుంటున్నారట.
ట్విస్ట్ ఏంటంటే జనవరి 26న కాకుండా 11 రోజుల ముందే అంటే 15కే ఈ మూవీ వచ్చే ఛాన్స్ ఉందట. ఇలా చూస్తే అక్షయ్ కుమార్ సినిమా నుంచి అజయ్ దేవ్‌గన్ సినిమాల వరకు.. సౌత్, నార్త్.. అంతటా జనవరి 12, 13 తేదీల్లో డజన్‌కిపైనే మూవీలు పోటీ పడబోతున్నాయి. విచిత్రంగా తెలుగు,తమిళంలో మాత్రంమే సంక్రాంతి సెంటిమెంట్ కామన్. కాని నార్త్‌లో కూడా ఆ సీజన్ కోసం విజన్ మార్చింది బాలీవుడ్ హీరోల టీం.