ఇండియాలో బన్నీ ఒక్కడే, బన్నీ రెమ్యునరేషన్ తో 150 సినిమాలు చేయొచ్చు

ఇండియన్ సినిమాలో పుష్ప 2 దెబ్బకు మీడియా ఫోకస్ మొత్తం టాలీవుడ్ పై పడింది. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ ను పీక్స్ లో చేస్తోంది పుష్ప టీం. బాహుబలి 2 కోసం రెండేళ్ళు పడితే పుష్ప 2 కోసం మూడేళ్ళకు పైగా పట్టింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 10, 2024 | 12:47 PMLast Updated on: Nov 10, 2024 | 12:47 PM

150 Films Can Be Made With Bunny Remuneration

ఇండియన్ సినిమాలో పుష్ప 2 దెబ్బకు మీడియా ఫోకస్ మొత్తం టాలీవుడ్ పై పడింది. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ ను పీక్స్ లో చేస్తోంది పుష్ప టీం. బాహుబలి 2 కోసం రెండేళ్ళు పడితే పుష్ప 2 కోసం మూడేళ్ళకు పైగా పట్టింది. సినిమా రిలీజ్ విషయంలో ముందు నుంచి ఉన్న డౌట్స్ పై క్లారిటీ ఇచ్చేసారు మేకర్స్. ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 5 నే సినిమా రిలీజ్ అవుతోంది. ఓవర్సీస్ లో సినిమా ఒక రోజు ముందుగానే విడుదల కానుంది. సినిమా విషయంలో ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

విడుదల కావడానికి ఇంకా నెల రోజులు కూడా లేదు. ఇక ఓవర్సీస్ లో ఇప్పటికే ప్రీ బుకింగ్ మార్కెట్ స్టార్ట్ అయింది. అక్కడ ఇప్పటికే 25 వేల టికెట్ లు బుక్ చేసారు. ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో నార్త్ ఇండియాను పుష్ప టీం టార్గెట్ చేసింది. అన్ని నార్త్ రాష్ట్రాల్లో ఈవెంట్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. బీహార్ లోని పాట్నా, మధ్యప్రదేశ్ ఇండోర్, గుజరాత్… గాంధీ నగర్, పంజాబ్ లో మొహాలి లేదంటే అమృత్ సర్… ఇలా ప్లాన్ చేస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాక్ చేసారు. త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విషయంలో బన్నీ చాలా కష్టపడ్డాడు. ఈ నేపధ్యంలో అసలు బన్నీ రెమ్యునరేషన్ ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్. అయిదేళ్ళ నుంచి పుష్ప కోసమే బన్నీ కష్టపడుతున్నాడు. కాబట్టి మైత్రీ మూవీ మేకర్స్ భారీగానే పే చేస్తున్నారు. నిజానికి అల్లు అర్జున్ ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఒకడిగా ఉన్నాడు. కాని పుష్ప కోసం ఇప్పుడు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న నెంబర్ 1 హీరోగా నిలుస్తున్నాడు బన్నీ.

నిజానికి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ముందు వరసలో ఉన్నాడు. తన చివరి చిత్రానికి 275 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నాడట. ఇక పుష్ప కోసం అల్లు అర్జున్ అంతకు మించి తీసుకుంటున్నాడు. పుష్ప సినిమాకుగాను బన్నీ రూ . 325 కోట్ల వరకు తీసుకుంటున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. హీరోయిన్ గా చేస్తున్న రష్మిక మందన్న సినిమా కోసం 10 కోట్లు తీసుకుంటుంది. అలాగే సినిమాకి విలన్ గా చేస్తున్న మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కేవలం 8 కోట్లు మాత్రమే తీసుకున్నాడట. సుకుమార్ కు దాదాపు 120 కోట్లు ఇచ్చారని టాక్. ఇదే నిజమైతే ఇండియాలో బన్నీ నెంబర్ 1 హీరో రెమ్యునరేషన్ లో.