రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ రిలీజ్ కి ముందే 1500 కోట్లు రాబట్టేలా ఉంది. ఆ ప్రాజెక్టుతోపాటు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాను కూడా స్పీడప్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఆల్రెడీ పుష్ప2 తో 1800 కోట్లు రాబట్టిన ఈ సంస్థ, ఇప్పుడు 3 వేల కోట్లను ముందే బుక్ చేసుకుంది. ఇటు ఎన్టీఆర్ కి, అటు రెబల్ స్టార్ కి కెరీర్ మొత్తంగా ఊహించనంత ఎమౌంట్ ని కన్ఫామ చేసింది. రెండు సినిమాలు రెండు పండగలు, రెండు సార్లు 1500 కోట్ల వసూల్లు... వీటికి తోడు 600 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టబోతున్న ప్రభాస్.. తన దారిలోనే 450 కోట్లు వెనకేసుకోబోతున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్... ఇవన్నీ జరగబోతున్నాయి. మొన్నే బన్నీకి 370 కోట్లు సమర్పించుకున్న మైత్రీ మూవీ మేకర్స్, ఇప్పుడు ఎన్టీఆర్, ప్రభాస్ కి మొత్తంగా 1000 కోట్ల నజరాన ప్రకటించేసిందట.. ఇంతకి ఏం జరుగుతోంది. ది రాజాసాబ్ మైత్రీ మూవీ మేకర్స్ తాలూకు మూవీ కాదు. అది మినహాయిస్తే ఇప్పుడప్పట్లో ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు లేవు... అయినా ఈ వెయ్యికోట్ల సెన్సేషనేంటి? రెబల్ స్టార్ ప్రభాస్ కి 600 కోట్ల రెమ్యునరేషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి 450కోట్ల రెమ్యునరేషన్.. ఈ రెండు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయ్యే అంశాలు.. ఇప్పటికే ప్రభాస్ పారితోషికం 550 కోట్లు దాటిందన్నారు. ఎన్టీఆర్ కి డ్రాగన్ పుణ్యమాని 350 కోట్లు దక్కాయంటున్నారు. కట్చేస్తే ఇద్దరీకి 50 నుంచి 100 కోట్ల వరకు అదనంగా దక్కుతోంది. అది కూడా మూడువేల కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ వల్లే అని తెలుస్తోంది అసలు విషయానికొస్తే, ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ కొత్త షెడ్యూల్ 16 నుంచి మొదలు కాబోతోంది. ఈ సినిమాకే 350 కోట్లు పారితోషికంగా పొందనున్న తారక్ ఎకౌంట్ లోకి మరో 100 కోట్లు చేరేలా ఉన్నాయి. ఫైనల్ గా 450 కోట్ల రెమ్యునరేషన్ తో తన మార్కెట్ ఎక్కడికో వెళ్లి పోయేలా ఉంది దీనంతటికి కారణం రిలీజ్ కిముందే డ్రాగన్ మూవీ 1500 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తుండటం. ఆల్రెడీ హను రాఘవపూడీ మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న ఫౌజీ మూవీ 1500 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తోందని తేలింది. ది రాజా సాబ్ కూడా విడుదలకు ముందే 1500 కోట్ల బిజినెస్ పూర్తి చేసేలా ఉంది... ఐతే మొన్నటి వరకు పుష్ప 2 కోసం 3 ఏళ్లు కష్టపడ్డందుకు బన్నీకి నిర్మాతలు 370 కోట్ల వరకు సమర్పించారు. సరే 3 ఏళ్లు ఒకే మూవీ చేశాడు కాబట్టి అంత సమర్పించుకున్నారనుకోవచ్చు. కాని ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ వల్ల, మ్యాన్ ఆఫ్ మాసెస్ కి 450 కోట్లు దక్కబోతున్నాయి. ఆల్రెడీ పారితోషికం 350 కోట్ల డీల్ ఎప్పుడో సెట్ అయ్యింది. నార్త్ ఇండియా లో మరాఠీ థియేట్రికల్ రైట్స్ లో వాటాగా మరో వందకోట్లు తనకి దక్కేలా ఉన్నాయి కనీసం 3 షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తి కాకుండానే డ్రాగన్ మూవీకి ఓటీటీ రైట్స్, థియేట్రికల్ రైట్స్ అంటూ ఇప్పటినుంచే డీల్ సెట్ చేస్తున్నారు. ఆల్ మోస్ట్ చర్చలన్నీ కొలిక్కి వచ్చాయి. ప్రభాస్ తో హను రాఘవపూడీ తీస్తున్న ఫౌజీకి కూడా ఇంచుమించు ఇదే రేంజ్ లో ప్రీరిలీజ్ బిజినెస్ జరుగుతోంది. సో ఇంకా పది శాతం కూడా షూటింగ్ కాని, డ్రాగన్, ఫౌజీ మూవీలు నిర్మాతలకు 3 వేల కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ రూపంలో దక్కతున్నాయి. అందుకే ప్రభాస్ కి ఏకంగా 600 కోట్లు, ఎన్టీఆర్ కి 450 కోట్లు సమర్పించుకుంటున్నారట. ఇప్పటికే 300 కోట్ల నుంచి 500 కోట్ల పారితోషికంతో హాలీవుడ్ స్టార్స్ తో పోటీ పడుతున్న తారక్, వాళ్లనే మించిపోయేలా ఉన్నాడు. ఎన్టీఆర్ కూడా ప్రభాస్ ని రీచ్ అయ్యేలా భారీ పారితోషికంతో పోటీ పడుతున్నాడు. ఏదేమైనా 2025 డిసెంబర్ లో ప్రభాస్ ఫౌజీ మూవీ, 2026 సంక్రాంతికి ఎన్టీఆర్ డ్రాగన్ సినమా రిలీజ్ ప్లాన్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్... అంతా అనుకున్నట్టు జరిగి ఈ రెండూ హిట్ అయితే 1500 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ ని మించే వసూళ్లే వచ్చే ఛాన్స్ ఉంది. అలా అయితే 3 వేల కోట్ల బిజినెస్ కాస్త 4 వేల కోట్ల కలెక్షన్స్ గా మారొచ్చు. ఏది జరిగినా జరక్క పోయినా, ఈపాటికే వందలకోట్ల పారితోషికంతో కొండెక్కి కూర్చున్నారు ప్రభాస్, ఎన్టీఆర్. [embed]https://www.youtube.com/watch?v=Psw1ExXxSeE[/embed]