U.Sలో రోజుకి 16 కోట్లు.. ఇండియాలో 90 కోట్లు…ఆట అదుర్స్…
పాన్ ఇండియా మూవీ ఏదైనా వస్తోందంటే, అంతా ముందుగా చూసేది ప్రివ్యూకి ఎంత కలెక్ట్ చేసింది. మొదటి రోజు ఎంతగా ఓపెనింగ్స్ వసూళ్ల వచ్చాయి. ఈరెండు లెక్కలని బట్టే అదెంద గ్రాండ్ హిట్టో తేల్చేస్తారు. విచిత్రం ఏంటంటే ఈ రెండు లెక్కలు తేలకముందే, విచిత్రమైన రికార్డులు దేవరకి వచ్చాయి.
పాన్ ఇండియా మూవీ ఏదైనా వస్తోందంటే, అంతా ముందుగా చూసేది ప్రివ్యూకి ఎంత కలెక్ట్ చేసింది. మొదటి రోజు ఎంతగా ఓపెనింగ్స్ వసూళ్ల వచ్చాయి. ఈరెండు లెక్కలని బట్టే అదెంద గ్రాండ్ హిట్టో తేల్చేస్తారు. విచిత్రం ఏంటంటే ఈ రెండు లెక్కలు తేలకముందే, విచిత్రమైన రికార్డులు దేవరకి వచ్చాయి. ఏ సినిమాకు దక్కని రికార్డులు ఈ మూవీఎకౌంట్లోనే పడ్డాయి. అడ్వాన్స్ బుక్కింగ్స్ రూపంలో ఆల్రెడీ యూఎస్ లో 3 మిలియన్ డాలర్లు, ఆస్ట్రేలియాలో 2 మిలియన్ డాలర్లు రాబట్టిన దేవర, ప్రివ్యూ కి మాత్రం 2.8 మిలియన్ డాలర్లు అంటే 22 కోట్లు యూఎస్ లో రాబట్టింది. మరి ఇండియాలో ఓపెనింగ్స్ ఎంతొచ్చాయి? 100 నుంచి 200 కోట్ల ఓపెనింగ్స్ తాలూకు అంచనాలలో దేవర మొదటి రోజు కలెక్షన్స్ తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాడు?
దేవర రిలీజ్ కిముందు ఉన్న పూనకాలే, విడుదలయ్యాక కూడా కంటిన్యూ అవుతున్నాయి. అడ్వాన్స్ బుక్కింగ్స్ రూపంలో వచ్చిన 5 మిలియన్ డాలర్లు లెక్కేస్తే, 40 కోట్లని తేలింది. కాకపోతే అందరికీ అడ్వాన్స్ బుక్కింగ్స్ రూపంలో టిక్కెట్లు మొదటి రోజుకే దొరకవు.. అందుకే ఈ నలబై కోట్లయూఎస్ వసూళ్లు ఒకరోజువే అని చెప్పలేం
కాని ప్రివ్యూకి వచ్చిన యూఎస్ వసూళ్లు చూస్తే మతిపోతోంది. కేవలం 26న వేసిన ప్రివ్యూకి 2.8 మిలియన్ డాలర్లు అంటే 22 కోట్లొచ్చాయి. మొదటి రోజు యూఎస్ వసూల్ల చూస్తే 18 కోట్లని తేలింది. అంటే యావరేజ్ గా రోజుకి యూఎస్ లో 16 కోట్ల వసూళ్లు వచ్చినట్టే. ఇక ఇండియాలో ఏంటి పరిస్థితి అంటే, ఏపీ, తెలంగాణలో 45 కోట్ల వరకు షేర్ వసూళ్లు, 60 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్షన్ వచ్చినట్టు తెలుస్తోంది. నార్త్ ఇండియాలో మాత్రం మొదటి రోజు 30 కోట్ల వసూళ్లు రావటం చూస్తుంటూ, త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ గ్రాఫ్ నార్త్ ఇండియాలో పెరిగిందని తేలింది.
ఓవరాల్ గా మొదటి రోజు ఇండియా మొత్తం 90 నుంచి 120 కోట్ల వరకు గ్రాస్ కలెక్సన్స్ వచ్చాయని, షేర్ కలెక్షన్స్ చూస్తే, 90 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. కొరటాల శివ పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టిన దర్శకుడు కాదు. ప్రొడక్షన్ హౌజ్ కి కూడా అలాంటి చరిత్ర లేదు. కేవలం అంటే కేవలం ఎన్టీఆర్ క్రేజ్ మీదే ఈ ఓపెనింగ్స్ ని రాబట్టింది దేవర మూవీ.
ప్రివ్యూకి 2.8 మిలియన్లు వస్తే, రోజుకి వన్ మిలియన్ వచ్చినా చాలు,యూఎస్ లో 10 రోజులలో వసూళ్ల వరద 100 కోట్లు దాటుతుంది. ఇక ఇండియాలో మరీ ముఖ్యంగా, ఏపీ తెలంగాణలో రోజుకి 55 నుంచి 60 కోట్లు వచ్చినా, నార్త్ ఇండియాలో 20 నుంచి 25 కోట్లు వచ్చినా, ఈజీగా ఇరవై రోజుల్లో ఈ సినిమా వెయ్యికోట్ల క్లబ్ లో చేరుతుంది
సలార్ మూవీ వచ్చినప్పుడు కూడా కథలో ఎమోషన్ తగ్గిందన్నారు. అనవసరంగా చాలా ఎక్కువగా పాత్రలు పెట్టారన్నారు. కన్ ఫ్యూజన్ పెరిగటమే కాదు, హీరోని సైడ్ ట్రాక్ చేశారన్నారు. కాని ఏమైంది 750 కోట్ల వసూళ్ల వరదొచ్చింది. దేవర కూడా అంతే అంటున్నారు. యాంటీ ఫ్యాన్స్ హంగామా తో పాటు కొందరు కోడిగుడ్డు మీద ఈకలు పీకే రేంజ్ లోరివ్యూలు రాయటం వల్ల కూడా ఈ సినిమా మీద మిక్స్ డ్ టాక్ కొంత కనిపిస్తోంది. నిజంగా చూస్తే ఇది మొత్తం ఒకే కథ కాదే.. రెండు భాగాలుగా రాసిన కథ.. సో రెండో పార్ట్ రాకముందే ఓ కన్ క్లూజన్ కి రావటం పర్ఫెక్ట్ జడ్జిమెంట్ కాదు…
బాహుబలి ది బిగినింగ్ వచ్చినప్పుడు కూడా ఇలానే మొదటి రోజు క్లైమాక్స్ అదిరింది. కాని దేవర పాత్ర ఎందుకు అంతమైందనే ప్రశ్నలు, తను కనిపించకుండాపోవటంతో సెకండ్ హాఫ్ వీకైందనే కామెంట్లు వచ్చాయి… కాని పాన్ ఇండియా సినిమాల మ్యాజిక్కే వేరు. రెండు బాగాలుగా తెరకెక్కే మూవీలంటే, మొదటి భాగంలోని కొన్ని మిగిలిపోయిన ప్రశ్నలకు, సమాధానం రెండో బాగంలో ఉంటుందనే అనుకోవాలి. అన్నీ ముందే చెబితే ఇక రెండో భాగంలో చెప్పటానికి కథేముంటుంది.. అందుకే దేవర సెకండ్ హాప్ ని ఇలా డిజైన్ చేశారు. అందుకే మొదటి ఆట నుంచి అర్ధరాత్రి అటవారకు టాక్ మారిపోయింది. వెయ్యికోట్ల సినిమాగా మారేలా ఉంది.