1850-850=1000 కోట్ల ఫేక్ కలెక్షన్స్ పంచ్.. ఓటీటీలో దేవరతో పోటీనా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ మూవీ దేవర 670 కోట్ల వసూళ్లతో పోలిస్తే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్ప2 వసూళ్లు మూడు రెట్లన్నారు. ఇప్పుడు ఓటీటీలో కూడా దేవర వ్యూస్ ని పుస్పరాజ్ మూడు రెట్లకు మించేలా ఉన్నాడంటున్నారు. కానీ రీసెంట్ ఇన్స్ డెంట్స్ ని ఎందుకు మర్చిపోతున్నారు..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 1, 2025 | 06:45 PMLast Updated on: Feb 01, 2025 | 6:45 PM

1850 8501000 Crore Fake Collections Punch Competition With Devara In Ott

మ్యాన్ ఆఫ్ మాసెస్ మూవీ దేవర 670 కోట్ల వసూళ్లతో పోలిస్తే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్ప2 వసూళ్లు మూడు రెట్లన్నారు. ఇప్పుడు ఓటీటీలో కూడా దేవర వ్యూస్ ని పుస్పరాజ్ మూడు రెట్లకు మించేలా ఉన్నాడంటున్నారు. కానీ రీసెంట్ ఇన్స్ డెంట్స్ ని ఎందుకు మర్చిపోతున్నారు..? సోషల్ మీడియాలో అల్లు ఆర్మీ సడన్ గా, మెగా మూవీస్ మీద నుంచి ఫోకస్ ని దేవర మీదికి షిఫ్ట్ చేసింది. దేవరని మించేందుకు పుష్పరాజ్ వస్తున్నాడంటోంది… కాని ఇదే పుష్ప2 వసూళ్లలో ఫేక్ కలెక్షన్స్ ఉందనే మాట సంగతేంటి? మొన్నటికి మొన్న ఐటీ రైడ్స్ జరిగినప్పుడు, 6 వందల కోట్ల నుంచి 850 కోట్ల వరకు పుష్ప వసూళ్లు ఫేక్ అని తేలిందన్నారు. అంతా బిల్డప్ కోసమే అలా పోస్టర్లు వదిలామన్నారు.. కట్ చేస్తే ఇప్పుడు ఓటీటీ గురించి మాట్లాడుతున్నారు.. అంత ఈజీగా రీసెంట్ ఇన్స్ డెంట్స్ ని ఎలా మరిచిపోతున్నారు? ఇంతకి అల్లు ఆర్మి ఎందుకు దేవర ని కొత్తగా టార్గెట్ చేసింది..? హావేలుక్
దేవర వర్సెస్ పుష్పరాజ్ ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు కొత్తగా చేస్తున్న కామెంట్ల సౌండ్. దేవర వచ్చి నెలలు గడుస్తోంది. పుష్ప2 వచ్చి కూడా రెండు నెళ్లు దాటింది. ఇప్పుడు ఈరెండీంటి మధ్య పోటీ అనటానికి లేదు.కాని పోటీ అనకుండా ఉండలేని పరిస్థితి.. కారనం పుష్ప2 ఓటీటీ స్ట్రీమింగ్… థియేటర్స్ లో దేవరకంటేమూడు రెట్లు వసూళ్లు రాబట్టిన పుష్పరాజ్, ఓటీటీలో అంతకుమించేలా దేవర రికార్డులు బద్దలు కొడతాడంటున్నారు

బేసిగ్గా పుష్ప2 ఓటీటీలో దుమ్ముదులుపుతుందనొచ్చు..లేదంటే రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశించొచ్చు..కాని దేవర రికార్డులు బద్దలుకొడుతుందని ఎన్టీఆర్ మూవీనే టార్గెట్ చేయటం వింతగా ఉంది. మొన్నటికి మొన్న ఐటీ రైడ్స్ జరిగాయి. పుష్ప ప్రొడ్యూసర్స్ మీద భారీ ఎత్తున జరిగిన ఇన్ కమ్ టాక్స్ రైడ్స్ లో, పుష్ప2 వసూళ్లన్ని ఫేక్ అనేలా చాలా మాటల తూటాలు పేలాయి

ఐటీ ఆఫీసర్స్ తో పుష్ప 2 నిర్మాతలు, ఈసినిమా అసలు వసూళ్లు ఒప్పేసుకున్నారన్నారు. 1850 కోట్ల వసూళ్లన్నీ ఉత్తుత్తివే అని తేలింది. ఆల్ మోస్ట్ 600 కోట్ల నుంచి 850 కోట్ల వరకు ఈ సినిమా వసూళ్లలో ఫేట్ అని తేలింది. అంటే 900 కోట్ల నుంచి 1000కోట్ల వరకే పుష్ప2 కి వచ్చినట్టు.. అలాని ఇదేమి ఫ్లాప్ మూవీ కాదు. వెయ్యికోట్లు పెద్దనెంబరే… కాకపోతే తమిళ్, మలయాళంలో ఈ సినిమా డిజాస్టరైతే, కన్నడలో యావరేజ్ గా ఆడింది. తెలుగులో బిలో యావరేజ్ గానే మిగిలిపోయింది.

ఇక ఓవర్ సీస్ లో అయితే రైట్స్ కొన్న బ్యాచ్ కి పెట్టిన పెట్టుబడి రావటమే ఘగనమైంది. ఏదేమైనా నార్త్ ఇండియాలో వసూళ్లే పుష్ప2 ని కాపాడాయి. ఇదంతా తెలిసి కూడా ఇంకా ఇండియా నెంబర్ 2 మూవీ పుష్ప2 అని పోస్టర్ రిలీజ్ చేశారు. దంగలత్ తర్వాత ప్లేస్ లో పుష్ప 2నే ఉందన్నారు. అది సరిపోలేదన్నట్టు ఓటీటీలో దేవర రికార్డులని పుష్ప 2 బ్రేక్ చేస్తుందంటున్నారు. పనికట్టుకుని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ ని కెలికేస్తున్నారు అల్లు ఆర్మీ.

నిజానికి పుష్ప2 మూవీ కి 20 నిమిషాలు యాడ్ చేసి, థియేటర్స్ లో రిలీజ్ చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. ఓటీటీలో రిలీజ్ అంటే కూడా ఎవరు పట్టించుకుంటున్నట్టులేదు. అందుకే దేవరని టార్గెట్ చేస్తే, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ నుంచి కౌంటర్స్ స్టార్ట్ అవుతాయి. అలా అందరి అటెన్షన్ పుష్పరాజ్ మీద పడుతుందనే ఇలా చేస్తున్నారట. థియేటర్స్ లో అన్ని వండర్స్ చేసిన ఈ సినిమాకు ఓటీటీలోరెస్పాన్స్ కరువై, ఆఖరికి ఇలా కాంట్రవర్సీ దారిలో కామెంట్లకు పనిచెప్పాల్సి వస్తోందా? ఇది సోషల్ మీడియా వార్ వెనకున్న మతలబండూ వినిపిస్తున్న టాక్.