ఓటీటీలో 20.ని యాడ్, పుష్ప ఒటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప ది రూల్ సినిమా విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప ది రూల్ సినిమా విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఈ 50 రోజుల్లో 1230 కోట్లు నెట్ వసూళ్లు ఇండియాలో సాధించింది పుష్పా ది రూల్. ఉత్తరాదిలో ఈ సినిమా డామినేషన్ బాలీవుడ్ సినిమాలను మించి ఉంది. బాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానీ రికార్డులను పుష్ప నార్త్ ఇండియా లో బ్రేక్ చేసింది. అలాగే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 సినిమా రికార్డులను కూడా పుష్ప బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు పుష్ప సినిమా 1800 కోట్ల మార్కు దాటింది. ఈ సినిమా 32 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 1830 కోట్ల వసూళ్లను రాబట్టిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. నార్త్ ఇండియాలో ఈ సినిమా దుమ్మురేపి ఏకంగా 900 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. ఇక 409వ రోజు కూడా ఉత్తరాదిలో పుష్ప సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. 8.5% ఆక్యుపెన్సీ రేటుతో పుష్ప సినిమాకు టికెట్లు అమ్ముడయ్యాయి. పుష్ప టూ కంటే ముందు అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన దంగల్ సినిమా మాత్రమే 2000 కోట్లతో ఇండియాలో టాప్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులు సృష్టించింది.
పుష్ప మొదటి రోజు 294 కోట్ల రూపాయల వసూళ్లను సాధించినట్లు మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. అయితే ఐటీ దాడులకు భయపడిన మైత్రి మూవీ మేకర్ ఈ సినిమా సాధించిన రికార్డులపై ఇంకా క్లారిటీ ఇవ్వటం లేదు. దాదాపు 2000 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది అనే ఒపీనియన్స్ వినపడుతున్నాయి. 32 రోజుల తర్వాత ఇప్పటివరకు అనౌన్స్మెంట్ లేకపోవడంతో అసలు ఏం జరుగుతుందో ఫ్యాన్స్ కు కూడా అర్థం కాని పరిస్థితి. 49వ రోజు హిందీలో కోటి పది లక్షల రూపాయలు వసూలు చేసింది ఈ సినిమా. ఇక ఇండియా వైడ్ గా మొత్తం వెయ్యి థియేటర్లలో ఏ సినిమా రన్ అవుతుంది.
ఇక త్వరలోనే ఓటీటీలో కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయిపోయారు. విడుదలైన 56 రోజులు కంటే ముందు ఏ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమ్ అయ్యే చాన్స్ లేదని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక జనవరి 31న ఈ సినిమాను ఓటీటీ రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మూడు గంటల 20 నిమిషాలు రన్ టైం కాగా ఆ తర్వాత మరో 20 నిమిషాల్లో కలిపారు. ఇక ఒటీటీ వెర్షన్ లో మరికొన్ని సీన్స్ ను యాడ్ చేసే ఛాన్స్ ఉంది. ఈనెల 17 నుంచి రీలోడేడ్ వెర్షన్ థియేటర్లలో అందుబాటులో ఉంది. ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన గేమ్ చేంజర్, బేబీ జాన్ సినిమాలు పెద్దగా పుష్పాను ఇబ్బంది పెట్టలేకపోయాయి.