2000 కోట్ల సినిమాలు… విడుదలకు ముందే 1000 కోట్లు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ సైలెంట్ గా బాంబు పేల్చేలా ఉంది. ఎట్ దీ సేమ్ టైం సందీప్ రెడ్డి వంగ తో రెబల్ స్టార్ ప్రభాస్ చేయబోతున్న సినిమా కూడా సినీ సునామీని ముందే కన్ఫామ్ చేస్తోంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ సైలెంట్ గా బాంబు పేల్చేలా ఉంది. ఎట్ దీ సేమ్ టైం సందీప్ రెడ్డి వంగ తో రెబల్ స్టార్ ప్రభాస్ చేయబోతున్న సినిమా కూడా సినీ సునామీని ముందే కన్ఫామ్ చేస్తోంది. ఈ రెండు సినిమాలకు కామన్ కంపేరీజన్ ఉంది. అదే రిలీజ్ కి ముందే కాదు, అసలు షూటింగ్ కి ముందే ఈ రెండు ప్రాజెక్టులు 2 వేల కోట్లని కన్ఫామ్ చేస్తున్నాయి. అసలు బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఎక్కడ ఏ సినిమా చూసినా రిలీజ్ అయ్యాక వెయ్యికోట్లు రాబట్టడమే వాళ్ల వల్ల కావట్లేదు. కాని అదేంటో కాని తెలుగు పాన్ ఇండియా మూవీలు రిలీజ్ అయ్యాకే కాదు, విడుదలకి ముందు, కుదిరితే షూటింగ్ కి ముందే వెయ్యికోట్లు వెనకేసుకుంటున్నాయి. స్పిరిట్, డ్రాగన్ రెండూ కూడా రెండు వేల కోట్ల వసూళ్లు రాబట్టే స్టామినా ఉన్న ప్రాజెక్టులే.. అందుకే ముందుగా వెయ్యికోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరుగుతోందా? అంత కాన్ఫిడెన్స్ కి మార్కెట్ కి కారణమేంటి? చూసేయండి.
ఒక సినిమా రిలీజ్ కి ముందే హిట్ అనటం కామన్. వెయ్యికోట్లు రాబడుతుందని అంచనా వేయటం కామనే… కాని డ్రాగన్, స్పిరిట్ మూవీలు రిలీజ్ కి ముందే కాదు, అసలు షూటింగ్ కి ముందే 2 వేల కోట్ల ప్రాజెక్టులుగా ఫోకస్ అవుతున్నాయి. ఇవి వెయ్యికోట్లు రాబట్టడం అనేది అసలు అంచనానే కాదు. 2 వేల కోట్లు కూడా పెద్ద ఎమౌంటే కాదు.. ఇది మార్కెట్ లో డ్రాగన్, స్పిరిట్ మూవీల మీద వినిపిస్తున్న మాటలు.దానికి తగ్గట్టే ఈ రెండు సినిమాలు, రిలీజ్ కి ముందు కాదు, అసలు షూటింగ్ కి ముందే వెయ్యికోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ చేసేలా ఉన్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ విషయానికొస్తే, ఆల్రెడీ త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ గా గుర్తింపు, దేవరతో మరో పాన్ ఇండియా హిట్ వచ్చాయి. జపాన్ లో దేవర వసూళ్ల వరదలు కనిపిస్తున్నాయి.
అలాంటి హీరోతో ప్రశాంత్ నీల్ సినిమా అంటే వెయ్యికోట్ల వసూళ్ల అంచనాలు అసలు అంచనాలే కావు. ఎందుకంటే కేజీయఫ్ తో 450 కోట్లు, కేజీయఫ్ 2 తో 1300 కోట్లు, సలార్ తో 800 కోట్లు రాబట్టిన ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ మూవీ అంటే పాన్ ఇండియా షేక్ అవ్వాల్సిందే. కాబట్టి ఇక్కడ పాన్ ఇండియా హిట్ మ్యాటర్ కాదు, వెయ్యికోట్ల వసూళ్లు అసలు పెద్ద టార్గెట్ కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ ఇంకా సెట్లో అడుగు పెట్టకముందే, ఓటీటీ డీల్ 350 కోట్లని, ఆడియో రైట్స్ 90 కోట్లంటున్నారు. ఓవర్ సీస్ రైట్స్, నార్త్ ఇండియా రైట్స్ లెక్కేస్తే 500 కోట్లు దాటుతున్నాయి. ఇక్కడే దాదాపు 1000 కోట్ల లెక్కలు కనిపిస్తున్నాయి.
ఇక ఏమాత్రం ఈమూవీ హిట్ అయినా, 2 వేల కోట్ల దంగల్ రికార్డు తేలిగ్గా బ్రేక్ అవుతుంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి తీయబోతున్న స్పిరిట్ అయితే 2 వేల కోట్లని రెండు నెలల్లో మించేస్తునే అంచానాలున్నాయి. అసలే సందీప్ రెడ్డి వంగకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ తోమొత్తం దేశాన్నే ఊపేశాడు.
అలాంటి డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ అంటే సెన్సేషనే.. ఆల్రెడీ 5 పాన్ ఇండియా హిట్లతో 5 వేల కోట్లు రాబట్టి పాన్ ఇండియా కింగ్ అనిపించుకున్నాడు ప్రభాస్. అలాంటి తనతో స్పిరిట్ ప్లాన్ చేస్తేనే ప్రీరిలీజ్ బిజినెస్ మొదలైందంటే ఆ క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. జూన్ లో షూటింగ్ అనుకున్న ఈమూవీకి ఓటీటీ డీల్ ఏకంగా 450 కోట్లుతో జరిగేలా ఉంది. ఓవర్ సీస్ రైట్స్ 220 కోట్లంటున్నారు. నార్త్ ఇండియా రైట్స్ 900 కోట్ల ని టాక్ వస్తోంది. అంటే సందీప్ రెడ్డి వంగ హిట్ మూవీ యానిమల్ మొత్తం వసూళ్లే అంతా ఎమౌంట్, నార్త్ ఇండియా రైట్స్ రూపంలో స్పిరిట్ కి దక్కేలా ఉంది. సో రిలీజ్ కి ముందే 1200 కోట్ల పైనే ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తోంది కాబట్టే, ఇది ఏమాత్రం వర్కవుట్ అయినా 2000 కోట్లు లెక్కలోకే వచ్చే ఛాన్స్ లేదు.