2000 కోట్ల స్కెచ్… ఒక్కొక్కరి మీద 200 కోట్ల భారం…

దేవర వెయ్యికోట్ల కటౌైట్ అని రిలీజైన రోజే 172 కోట్ల ఓపెనింగ్స్ తో తేలిపోయింది. ఇక మిగిలంది దేవర 2.... ఈ సీక్వెల్ భారాన్ని పదిమందిమోయబోతున్నారట. దేవర పార్ట్ 1 భారమంతా ఎన్టీఆరే ఒంటరిగా మోశాడు. వెయ్యికోట్ల సినిమాగా తన క్రేజ్, మార్కెట్ లోమైలేజ్ తోముందుకు తీసుకెళుతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 9, 2024 | 12:55 PMLast Updated on: Oct 09, 2024 | 12:55 PM

2000 Crore Sketch 200 Crore Burden On Each One

దేవర వెయ్యికోట్ల కటౌైట్ అని రిలీజైన రోజే 172 కోట్ల ఓపెనింగ్స్ తో తేలిపోయింది. ఇక మిగిలంది దేవర 2…. ఈ సీక్వెల్ భారాన్ని పదిమందిమోయబోతున్నారట. దేవర పార్ట్ 1 భారమంతా ఎన్టీఆరే ఒంటరిగా మోశాడు. వెయ్యికోట్ల సినిమాగా తన క్రేజ్, మార్కెట్ లోమైలేజ్ తోముందుకు తీసుకెళుతున్నాడు. ఇప్పుడు దేవర 2 విషయానికొస్తే, ఈసారి తనతో పాటు మరో 8 మంది మీద 1600 కోట్ల భారం పడబోతోందట. మొత్తం 10 పాత్రలు, ఒక్కో పాత్ర మీద కనీసం 200 కోట్ల భారం.. అంటే దేవర 2 తో రెండు వేల కోట్ల వసూళ్ల మీద కన్నేసినట్టు తెలుస్తోంది. దేవర పార్ట్ 2 తాలూకు కొరటాల శివ ఇస్తున్న స్టేట్ మెంట్లు, బయట పెరిగిన లీకులతో అది మరో బాహుబలి2 అయ్యేలా ఉంది. బాహుబలికి జరిగిందే, దేవర 1 కిజరిగింది కాబట్టి, దేవర 2 మరో బాహుబలి 2 అనుకోవాల్సి వస్తోంది. అదెందుకో చూసేయండి..

దేవర పార్ట్ 1 హిట్టైంది. కాకపోతే ఇందులో ఉంది కేవలం 10శాతమే, అసలు కథంతా దేవర పార్ట్ 2 లోనే ఉందన్నాడు కొరటాల శివ. ఇక అందులో వర పాత్ర భయానకంగా ఉండటమే కాదు, జాన్వీ వేసిన తంగం పాత్ర అసలైన లోతు పార్ట్ 2 తో చూస్తారనేశాడు కొరటాల. అందులో 100 శాతానికి పైనే హై ఇంటెన్సిటీ రోల్స్, హై ఇంటెన్సిటీ ఎమోషన్సే కాదు, ట్విస్టులు కూడా ఊహించలేరనేశాడు.

బేసిగ్గా ఓ మూవీ విడుదల కాబోతోందంటే, హైప్ పెంచేందుకు ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇస్తారు. కాని దేవర విడుదలై వసూళ్ల సునామీ క్రియేట్ చేశాక, ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడంటే, ఖచ్చితంగా తను నమ్మిందే బయటికి చెబుతున్నాడని అర్ధమౌతోంది

అంతేకాదు దేవర పార్ట్ 1 లో అసలు దేవర పాత్ర రివీల్ కాలేదు. తంగం కేవలం నాలుగైదు సీన్లు, ఒక పాటకే పరిమితమైంది. విలన్ గా భైర పాత్ర లోతు కూడా కొంతే చూపించారు. నిజం చెప్పాలంటే దేవర పాత్ర కూడా పూర్తిగా రివీల్ కాలేదు. కేవలం దేవరలోని పాత్రల పరిచయం, ఎర్రసముద్రం, దాని కథ చరెప్పారంతే…

అసలు కథ మొదలే కాలేదు. కాబట్టే అసలు కథ పూనకాలు తెప్పిస్తుందనే కాన్ఫిడెన్స్ తో చెబుతున్నాడు డైరెక్టర్ కొరటాల. ఐతే దేవర పార్ట్ 2 లో పది సాలిడ్ రోల్స్ ఉంటాయనే లీకులు షాకులిస్తున్నాయి. అందులో ఐదు పాత్రలు ఆల్రెడీ తెలిసినవే…

దేవర, వర, తంగం, భైరీ, అలానే శ్రీకాంత్ పాత్ర… ఇవి కాకుండా మరో ఐదు భయంకరమైన పాత్రలు దేవర పార్ట్ 2 లో ఉండబోతున్నాయట. బడ్డెట్ 500 కోట్లు, టార్గెట్ 2 వేల కోట్లు… అంటే ప్రతీ పాత్ర మీద 200 కోట్ల భారం పడబోతోంది. ఒక్కో కటౌట్ వల్ల దేవర పార్ట్ 2 కి కనీసం 200 కోట్లు, అలా లెక్కేస్తే దేవర, వర పాత్రలతో ఎన్టీఆర్ 400 కోట్ల వసూల్లు రాబట్టే ప్రయత్న చేస్తే చాలని మామూలు లెక్కలేయొచ్చు..

కాని దేవరని హిట్ మెట్టెక్కించటమే కాదు, వారం వారం వందకోట్లు యాడ్ చేస్తూ 700 కోట్ల వసూల్లను కూడా దాటేలా చేసింది ఒక్క ఎన్టీఆరే.. సో పార్ట్ 2 లో భారీ కథ, భయంకరమైన పాత్రలు, ట్విస్ట్ లు ఉంటే, మొదటి పార్ట్ వెయ్యికోట్లు, రెండో పార్ట్ 2 వేల కోట్లు రాబట్టడం పెద్ద విషయమే కాదు. బాహుబలి వచ్చినప్పుడు 580 కోట్లొచ్చాయి. అదే బాహుబలి 2 లో మరిన్ని ట్విస్టులు, మరిన్ని పాత్రలతో వసూళ్లు మూడు రెట్లు అంటే 1850 కోట్లు దాటాయి. ఆలెక్కన 1000 కోట్ల దేవర, 2000 కోట్ల క్లబ్ లో సీక్వెల్ తో దూసుకెళ్లే ఛాన్స్ వందకు రెండు వందల శాతం ఉంది…