2000 కోట్లు vs 2000 కోట్లు… ఎన్టీఆర్ వర్సెస్ ప్రభాస్
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాని ముందుగా షేక్ చేసిందంటే ఒకరు రెబల్ స్టార్ ప్రభాస్, మరొకరు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. అలాంటీ ఈ ఇద్దరి మద్యే వార్ తప్పట్లేదు. ఆగస్ట్ 14 కి తారక్ తన ఫస్ట్ హిందీ మూవీ వార్ 2తో దండెత్తబోతున్నాడు.

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాని ముందుగా షేక్ చేసిందంటే ఒకరు రెబల్ స్టార్ ప్రభాస్, మరొకరు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. అలాంటీ ఈ ఇద్దరి మద్యే వార్ తప్పట్లేదు. ఆగస్ట్ 14 కి తారక్ తన ఫస్ట్ హిందీ మూవీ వార్ 2తో దండెత్తబోతున్నాడు. కాని అదే ముహుర్తానికి రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ గా రంగంలోకి దిగాల్సి వస్తోంది. రాజా సాబ్ షూటింగ్ డిలే అవటం వల్లే సమ్మర్ నుంచి డైరెక్ట్ గా ఆగస్ట్ కి ఈ సినిమా వాయిదా పడుతోంది. తర్వాత వాయిదాకి ఛాన్స్ ఉందా? అంటే అక్కడ కూడా ఎన్టీఆర్ తో పోటీ తప్పట్లేదు. ఈ ఇద్దరు హీరోలు వెయ్యికోట్ల వసూళ్ల ని చూశారు. ఇప్పడు 2 వేల కోట్ల వసూళ్లు రాబట్టే సీన్ఉన్న సినిమాలతో పోటీ పడబోతున్నారు. ఆగస్ట్ లో ఈ ఇద్దరి మధ్య వార్ మిస్ అయినా జనవరిలో అయినా ఈ వార్ జరిగే ఛాన్స్ఉంది.. ఇంతకి 4 వేల కోట్ల వసూళ్లని ఎందుకు రిస్క్ లోకి పెడుతున్నారు.. ఒకరి కోసం ఒకరు వెనక్కి తగ్గే ఛాన్స్ లేదా? హావేలుక్
రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ ఇద్దరే ముందుగా పాన్ ఇండియాని షేక్ చేసినటాలీవుడ్ స్టార్స్… బాహుబలి తో రెబల్ స్టార్, త్రిబుల్ ఆర్, దేవరతో ఎన్టీఆర్ ఇలా ఇద్దరూ పాన్ ఇండియాని షేక్ చేశారు. పుష్పతో రెండు సార్లు బన్నీకూడా పాన్ఇండియా మార్కెట్ ని కుదిపేసి ఉండొచ్చు. కాని రెండూ కూడా సుకుమార్ వెంచర్లే… తారక్ మాత్రం రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసి దేవరతో ట్రెండ్ సెట్ చేశాడు. అలా చూస్తే పాన్ ఇండియా లెవల్లో దర్శకుల సపోర్ట్ లేకుండా ఓరేంజ్ ఇమేజ్ ని,మార్కెట్ ని సొంతం చేసుకుంది మాత్రం ప్రబాస్, ఎన్టీఆర్.. ఈ ఇద్దరే..
అలాంటి ఈ ఇద్దరి మధ్య పోటీ నిజంగా షాకింగ్ న్యూసే. షూటింగ్ డిలే అవటం వల్ల, రాజాసాబ్ మూవీ సమ్మర్ నుంచి ఆగస్ట్ కి షిఫ్ట్ అవుతోంది. దసరా, దీపావళి, క్రిస్మస్ ఇవే వి రాజా సాబ్ కి సెట్ అయ్యే పరిస్తితి లేదు. లాస్ట్ ఇయర్ దసరాకు, లేదంటే ఈ ఏడాది సంక్రాంతికి, కాదంటే ఏప్రిల్ కి ఇలా ముహుర్తాలు మార్చుకుంటూ వచ్చింది రాజా సాబ్ టీం.కాబట్టి ఇన్ని సార్లు డేట్లు మార్చాక, దసరా , దీపావళి ముహుర్తాలు కావాలంటే, వాటిని ముందే బుక్ చేసుకున్న నిర్మాతలనుంచి వ్యతిరేకత వచ్చేలా ఉంది. అందుకే ఇబ్బంది అయినా ఆగస్ట్ లోనే రాజా సాబ్ ని రంగంలోకి దింపుతున్నారట. వార్ 2 ఎలాగూ హిందీ మూవీనే కాబట్టి, పూర్తిగా ఎన్టీఆర్ తో పోటీ అనలేం..
కాకపోతే రాజా సాబ్ అప్పుడు కూడా రిలీజ్ కాకపోతే, సంక్రాంతి తప్ప మరో ముహుర్తం దక్కే అవకాశం లేదు. అలా చూస్తే ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ తో రాజా సాబ్ పోటీ పడాల్సి వస్తుంది. ఎలా చూసినా ఆగస్ట్ లేదంటే, జనవరిలో ఎన్టీఆర్ సినిమాకు ప్రభాస్ మూవీ పోటీ ఇవ్వక తప్పేలా లేదు. ఈ క్లాష్ ను తప్పించడానికి నిర్మాతలు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నా… డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్స్ చైన్ ఓనర్లు ఇలా ఇంతమందిని సింక్ చేసి ఒప్పటించటం అయ్యే పనిలా లేదని తెలుస్తోంది.