ప్రభాస్ లేడీకి 25 కోట్లు.. మహేశ్ లేడీకి 30కోట్లు.. మరి ఎన్టీఆర్ జోడీకి 45 కోట్లు..
సూపర్ స్టార్ మహేశ్ బాబు తో రాజమౌలి తీస్తున్న సినిమా లో ప్రియాంక చోప్రా ఎప్పుడో కన్ఫామ్ అయ్యింది. కాని తన రెమ్యునరేషన్ 30 కోట్లని ఇప్పడే కన్ఫామ్ అవుతోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు తో రాజమౌలి తీస్తున్న సినిమా లో ప్రియాంక చోప్రా ఎప్పుడో కన్ఫామ్ అయ్యింది. కాని తన రెమ్యునరేషన్ 30 కోట్లని ఇప్పడే కన్ఫామ్ అవుతోంది. ఇది కాకుండా ప్రాఫిట్ లో తనకి షేర్ దక్కింది. దీంతో తనే ఇండియ నెంబర్ వన్ హీరోయిన్ అంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ తో కల్కీ మూవీలో జోడీకట్టిన దీపికా పదుకొనేకి 21 కోట్లు దక్కాయి. అలా చూస్తే దీపికా కంటే ప్రియాంకనే రెమ్యునరేషన్ లో టాప్ ప్లేస్ లో ఉన్నట్టు…కాని ఇక్కడే లెక్క మారింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుణ్యమాని, అతిలోక సుందరి ఫేట్ మారిపోయింది. బాలీవుడ్ లో దీపికా, ప్రియాంకని టచ్ కూడా చేయలేని జాన్వీ కపూర్, సడన్ గా ఇప్పుడు వాళ్లనే మించిపోతోంది. దానికి కారనం కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆరే.. ఆల్రెడీ బాలీవుడ్ లో సోసో హీరోయిన్ గా ఉన్న తనకి, దేవరతో పాన్ ఇండియా హిట్ పడేలా చేశాడు. ఇప్పుడు తన ఎకౌంట్ లో ఏకంగా 33 కోట్లు పడటానికి కారణమౌతున్నాడు. అదెలా..? హావేలుక్
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ప్రియాంక జోడీ కడుతున్నందుకు 30 కోట్ల భారీ పారితోషికం దక్కుతుందని తేలింది. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీ బడ్జెట్టే 1000 కోట్లు. అది కూడా కేవలం మేకింగ్ కి మాత్రమే.. హీరో,హీరోయిన్, డైరెక్టర్ కి ప్రాఫిట్స్ లో వాటాలున్నాయి. ఏది ఏమైనా ఇండియాలో ఇంతవరకు ఏ హీరోయిన్ అందుకోని పారితోషికం ప్రియాంక దక్కించుకుంది. హాలీవుడ్ లో కూడా తనకి 25 కోట్లకుమించి రెమ్యునరేషన్ దక్కలేదు.
అలాంటిది తనకి రాజమౌళి మూవీలో కీరోల్ చేస్తున్నందుకు 30 కోట్లు పారితోషికంగా దక్కటం రికార్డే. అందుకే తనని ఇండియా నెంబర్ వన్ హీరోయిన్ అంటున్నారు. తన ఏజ్, ఇమేజ్, ఎక్స్ పీరియన్స్ తో పోలిస్తే, దిపికానే పోల్చేంత సీన్ లేదంటారు. అలాంటి తనతో ఏకంగా యంగ్ లేడీ జాన్వీ కపూర్ పోటీ పడుతోంది. 30 కోట్ల కే ప్రియాంక చోప్రా ఇండియా నెంబర్ వన్ అయితే, 33 కోట్లు తీసుకుంటున్నజాన్వీ కపూర్ ఏమవ్వాలి…
నిజంగా ఇది జరుగుతోంది. తనేం ప్రియాంక చోప్రా లెవల్ హీరోయిన్ కాదు. దీపికా పదుకొనే, ప్రియాంక లా హాలీవుడ్ వరకు వెళ్లి రాలేదు. భారీ హిట్లు పడలేదు. అయినా తనకి 33 కోట్లు ఇస్తోంది దేవర 2 మూవీ టీం. దానికి సాలిడ్ రీజనుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో జాన్వీ జోడీ కట్టి దేవర మూవీ చేస్తే తనకి 8 కోట్లిచ్చారు. కేవలం 16 రోజుల షూటింగ్ కి 8 కోట్లంటే రోజుకి 50 లక్షలు దక్కినట్టే…
కేవలం శ్రీదేవి కూతురవ్వటం, ఎన్టీఆర్ తో జోడీకట్టడం వల్లే తనకలా కలిసొచ్చింది.దేవర పాన్ ఇండియా లెవల్లో హిట్ అవటంతో, తనకి తొలి పాన్ ఇండియా బ్లాక్ బస్టరే కాదు, సౌత్ లో కూడా తనకి మార్కెట్ పెరిగింది. రామ్ చరణ్ తో జోడీకట్టగానే 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న తను, దేవర 2 కి 33 కోట్లు దక్కించుకుందట. ఇది కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆరే కారణం. తన తో జోడీకట్టడం, ఏకంగా 66 రోజుల కాల్ షీట్స్ ఇవ్వాల్సి రావటంతో, రోజుకి 50 లక్షల చొప్పున 33 కోట్లు సమర్పించుకుంటున్నారట.
ఎలాచూసినా ఎన్టీఆర్ తో జోడీకడ్డటం వల్ల ఒకప్పటి శ్రీదేవి, ఎన్టీఆర్ కాంబో హైలెట్ అయినట్టే అవుతుందనే అంచనాలున్నాయి. అలానే దేవర హిట్టైంది. దేవర2 రెండు వేల కోట్ల సినిమా అంటూ అంచనా పెరుగుతోంది. ఇలాంటి టైంలో కథ సిద్ధమవ్వటం, సీన్ లోకి అమితాబ్ రావటంతో సీనే మారిపోయింది. మొత్తానికి ప్రియాంక, దీపికా అంత వయసు, అనుభవం, సక్సెస్ రేటు, మార్కెట్ లేకున్నా, కేవలం ఎన్టీఆర్ తో జోడీకట్టడం వల్ల జాన్వీ కపూర్ ఫేట్ మారిపోతోంది.