ఒక్కరు కాదు ముగ్గురు… ఒకే ఫ్రేములో ముగ్గురు మొనగాళ్లు…

ఎన్టీఆర్ ఒక్కడి ప్రెజెన్స్ ఉంటేనే తన సినిమా థియేటర్స్ లో సునామీ క్రియేట్ చేస్తుంది. అలాంటిది తను డ్యూయెల్ రోల్ వేస్తే బాక్సాఫీస్ బద్దలైపోవాల్సిందే...అదే అదుర్స్ నుంచి దేవర వరకు జరిగింది. ఇప్పుడు జైలవకుశ టైం వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 29, 2024 | 01:15 PMLast Updated on: Oct 29, 2024 | 1:15 PM

3 Star Heros In 1 Frame

ఎన్టీఆర్ ఒక్కడి ప్రెజెన్స్ ఉంటేనే తన సినిమా థియేటర్స్ లో సునామీ క్రియేట్ చేస్తుంది. అలాంటిది తను డ్యూయెల్ రోల్ వేస్తే బాక్సాఫీస్ బద్దలైపోవాల్సిందే…అదే అదుర్స్ నుంచి దేవర వరకు జరిగింది. ఇప్పుడు జైలవకుశ టైం వచ్చింది. ఆ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాలేదు. ఇప్పుడు మాత్రం అలాంటి మూవీని ఆపే పరిస్థితి లేదు. నిజంగా ఇది 2026 లో జరగబోతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన ఫ్యాన్స్ కి వన్ ప్లస్ 2 ఆఫర్ ఇస్తున్నాడు. దీ రాజా సాబ్ లో రెబల్ స్టార్ ఒక్కడు కాదు ముగ్గురని తేలింది. మెగాస్టార్ చిరంజీవి ముగ్గురుమోనగాళ్లు మూవీలో మూడు పాత్రలేశాడు. లోకనాయకుడు కమల్ హాసన్ మైఖేల్ మదన కామరాజులో నాలుగు పాత్రలేశాడు. దశావతారాలు కూడా చూపించాడు.. కాని వీళ్లెవరు చేయని పని రెబల్ స్టార్ చేస్తున్నాడు. నిజానికి తెలుగులో చిరు, తర్వాత మూడు పాత్రలు వేసిన హీరో ఎన్టీఆరే.. కాని ఈ ఇద్దరు కూడా చేయని రిస్క్ రెబల్ స్టార్ చేశాడు. చేస్తున్నాడు. ఏడో వింతని చూడమంటున్నాడు..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరూ ఇప్పుడు ఒకే దారిలో నడుస్తున్నారు. ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు మొనగాళ్లను చూడమంటున్నారు. అలాంటి ఎనిమిదో వింతను చూపించేందుకు సిద్ధమయ్యారు. ఒక్క సినిమా మూడు కథలు.. మూడు పాత్రలతో పెద్ద సాహసమే చేస్తున్నారు. ఒకే స్క్రీన్ మీద ముగ్గురు ఎన్టీఆర్ లు, ముగ్గరు ప్రభాస్ లు కనిపిస్తే అది పాన్ ఇండియా లెవల్లో ఎనిమిదో వింతే.. కాని అదే జరిగేలా ఉంది.

రెబల్ స్టార్ ప్రభాస్ తో మారుతి తీసిన, ఇంకా తీస్తున్న ది రాజా సాబ్ లో హీరోది ఒక పాత్ర తో సరిపెట్టలేదని తేలిపోయింది. ఇందులోముగ్గురు ప్రభాస్ లు కనిపించబోతున్నారు. అన్నదమ్ములు అసలే కాదు. అలాని తండ్రి కొడుకులు మాత్రమే కాదు.. తాత, తండ్రి, కొడుకు ఈ ముగ్గురి హర్రర్ స్టోరీనే ది రాజా సాబ్ కథని తెలుస్తోంది

ది రాజా సాబ్ లో తాత కోరిక తీర్చే మనవడిగా రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ ఉంటుందట. ఇందులో ప్రభాస్ 30ఏళ్ల యువకుడిగా, 55 ఏళ్ల తండ్రిగా, 75 ఏళ్ల తాతగా ఇలా మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఆల్రెడీ మోషన్ పోస్టర్ తో తాత పాత్రని రివీల్ చేసింది ఫిల్మ్ టీం. ది రాజా సాబ్ ఇందులో తాత పాత్రే అని తెలుస్తోంది. తాత ఆత్మ పాత్రలో కనిపిస్తే, తండ్రి, కొడుకుల పాత్రలు నార్మల్ గా ఉంటాయట. ఇక సంజయ్ దత్ ది కూడా తాత పాత్రే అయితే, తను అమ్మమ్మ హస్బెండ్ గా కామెడీ రోల్ వేశాడని తెలుస్తోంది.

ప్రబాస్ ఫస్ట్ టైం హర్రర్ కామెడీ చేయటమే కాదు, ఫస్ట్ టైం మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు. బాహుబలిలో కూడా తను మూడు పాత్రలేశాడు.కాకపోతే తాత పాత్ర గోడమీద ఫోటోకి పరిమితమైతే, తండ్రి వెన్నుపోటుటి గురైన అమరేంద్ర బాహుబలిగా, శివుడి పాత్ర మహేంద్ర బాహుబలిగాచూపించారు. అన్నీ ఒక్కో టైంలైన్ లో వచ్చి పోతాయి కాని, ఒకే సారి ముగ్గురి పాత్రలు వెండితెరమీద కనిపించవు. కాని ఇప్పుడదే జరగబోతోంది. ఫ్యాన్స్ లో పూనకాలకు ఏప్రిల్ 10 ముహుర్తం కుదిరింది.

ఇక దేవరలో కూడా ఎన్టీఆర్ వేసింది దేవర, వర పాత్రలే అని తెలుసు కాని, మూడో పాత్ర ని కూడా పార్ట్ 2 లో చూపించబోతున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరూ సోలోగా వస్తేనే వెయ్యికోట్ల వసూళ్లొస్తున్నాయి. అలాంటిది ఇక మూడు పాత్రలేస్తే, వెయ్యికోట్ల లెక్కలు కేవలం వందకోట్లతో సమానంగా మారే ఛాన్స్ ఉంది.