30 కోట్ల సూపర్ హీరోయిన్.. 300 కోట్ల డ్రాగన్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీలో లీడింగ్ లేడీ ప్రియాంక చోప్రా.. ఆల్రెడీ మూడు షెడ్యూల్స్ లో నటించి, బ్రేక్ టైంలో యూఎస్ కి రిటర్న్ అయ్యింది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీలో లీడింగ్ లేడీ ప్రియాంక చోప్రా.. ఆల్రెడీ మూడు షెడ్యూల్స్ లో నటించి, బ్రేక్ టైంలో యూఎస్ కి రిటర్న్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ హైద్రాబాద్ లో ల్యాండ్ కాబోతోంది. తను ఇక్కడ అడుగుపెట్టేలోపు ఇండియా నెంబర్ వన్ హీరోయిన్ గా కన్పామ్ అయ్యింది. ఇండియన్ మూవీ చేసిన ఐదేళ్లు గడుస్తోంది… ఎప్పుడో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిలైంది. అలాంటి తను ఈ ఐదేళ్లలో ఒక్క మూవీ చేయకున్నా ఇండియా నెం. 1 హీరోయిన్ అయ్యింది. 30 కోట్ల రెమ్యునరేషన్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కట్ చేస్తే 300 కోట్లతో ఇండియ నెంబర్ వన్ అనిపించుకుంటున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. 550 కోట్లు తీసుకుంటున్న రెబల్ స్టార్ ని 300 కోట్లతో ఎన్టీఆర్ మించటం వెనక భారీ ట్విస్ట్ ఉంది. అదేంటి..? హావేలుక్
సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీలో నెగెటీవ్ రోల్ వేస్తున్న ప్రియాంకకి, 30 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. అచ్చంగా అంతే ఎమౌంట్ తీసుకుని హిందీ మూవీ క్రిష్ 4 లో కూడా నటించబోతోంది ప్రియాంక చోప్రా… కాకపోతే తన పారితోషికానికి పదిరెట్లు, అంటే 300 కోట్ల రెమ్యునరేషన్ తో పరేషన్ చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్.ఈఇద్దరి పారితోషికానికో లింకుంది.. ఆ లింకే ఇండియనెంబర్ వన్ లింక్… ప్రజెంట్ రెమ్యునరేన్ లో ఇండియా నెంబర్ వన్ హీరోయిన్ అంటే ప్రియాంకా చోప్రానే. తను అసలు 5 ఏళ్లుగా ఇండియన్ సినిమాల్లో కనిపించలేదు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లి స్థిరపడింది. అలాంటి తనకి 30 కోట్ల ఇస్తున్నారంటే, హాలీవుడ్, బాలీవుడ్ ఇలా రెండు చోట్లా తనకున్న మార్కెట్టే కారణం.
విచిత్రం ఏంటంటే 25 నుంచి 29 కోట్లు తీసుకుంటున్న దీపికా పదుకొనేనే ఇప్పటి వరకు ఇండియా నెంబర్ వన్ హీరోయిన్. తనకే అత్యధిక పారితోషికం దక్కుతూ వచ్చింది. కట్ చేస్తే సడన్ గా సీన్ లోకి వచ్చిన ప్రియాంక చోప్రా ఎస్ ఎస్ ఎమ్ బీ 29 వ మూవీకి 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. అలానే గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ తీయబోయే క్రిష్ 4 కి కూడా అంతే ఎమౌంట్ డిమాండ్ చేసింది.
మొత్తంగా రెమ్యునరేషన్ లో ప్రియాంక చోప్రా ఇండియనెంబర్ 1 హీరోయిన్ అనిపించుకుంటే, హీరోల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నెంబర్ వన్ అనిపించుకుంటున్నాడు. డ్రాగన్ కి తాను 300 కోట్లు ప్యూర్ రెమ్యునరేషన్ రూపంలో తీసుకుంటున్నాడట. ఇది కాకుండా ఏపీ, తెలంగాణ రైట్స్ లో 70శాతం వాటా తనకే దక్కిందని తెలుస్తోంది. సదరన్ వర్షన్ డ్రాగన్ ఓటీటీ రైట్స్ కూడా తనకే దక్కడంతో… ఈ రెండీటి పుణ్యమాణి తనకు అదనంగా 240 కోట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉంది.కాని రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీకి 350 కోట్లు, స్పిరిట్ కి 500 కోట్లు తీసుకుంటున్నాడు. కాని ఆలెక్కలతో పోలిస్తే ఎన్టీఆర్ కి దక్కేదే ఎక్కువ… సో అలా చూస్తే ఐదు పాన్ ఇండియా హిట్లు న్న రెబల్ స్టార్ కంటే రెండు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కే ఎక్కువ గిట్టుబాటవుతోంది. కాబట్టే రెబల్ స్టార్ ని వెనక్కి నెట్టి రెమ్యునరేషణ్ లో నెంబర్ వన్ అనిపించుకుంటున్నాడు తారక్.