30 కోట్లు… ప్రియాంక చోప్రా అందుకే ఫైనల్ చేసిందా…? రాజమౌళి ప్లాన్ ఏంటి..?

కొంతమంది పాన్ ఇండియా హీరోయిన్లు ఇప్పుడు తమ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని భారీగా డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. అందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ముందుంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 27, 2025 | 11:40 AMLast Updated on: Jan 27, 2025 | 11:40 AM

30 Crores Is That Why Priyanka Chopra Made The Final What Is Rajamoulis Plan

కొంతమంది పాన్ ఇండియా హీరోయిన్లు ఇప్పుడు తమ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని భారీగా డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. అందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ముందుంటుంది. హాలీవుడ్ లో కూడా ఆమెకు క్రేజ్ ఉండటంతో భారీగా డిమాండ్ చేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. బాజీరావు మస్తానీ సినిమా తర్వాత ప్రియాంక చోప్రా రేంజ్ పెరిగిపోయింది. ఆ సినిమా తర్వాత హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన ఆమె.. హాలీవుడ్ స్టార్ ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైపోయింది. అప్పుడప్పుడు ఇండియాలో సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా నటించడంతో ఆమె గురించి సౌత్ మీడియా ఎక్కువగా ఫోకస్ పెట్టింది.

ఇక ప్రియాంక చోప్రా కోసం భారీగానే ఖర్చు పెట్టడానికి రాజమౌళి కూడా రెడీ అయినట్లు టాక్. ఆమె క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఆమెకు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రాజమౌళి రెడీ అయ్యారు. రీసెంట్గా హైదరాబాద్ వచ్చిన ప్రియాంక చోప్రా మహేష్ బాబు సినిమాలో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక టెస్టు లుక్ కూడా ఫైనల్ కావడంతో రాజమౌళి ఆమెను ఒప్పించాడు. ఈ సినిమా కోసం ఏడాదికి పైగా టైం ఇచ్చేసింది ప్రియాంక చోప్రా. ఈ టైంలో మరో సినిమా చేసే ఛాన్స్ ఉన్నా లేకపోయినా సరే వేరే సినిమాల లాస్ ను కూడా కవర్ చేయడానికి ఈ సినిమాను వాడుకోవడానికి ప్రిపేర్ అయింది ప్రియాంక.

రాజమౌళి ఏడాది టైమ్ అడగటంతో 30 కోట్లు డిమాండ్ చేసింది ప్రియాంక చోప్రా. ఇక ఆమెకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకున్న రాజమౌళి.. 30 కోట్లకు ఫైనల్ చేసేసాడు. ఇక నిర్మాత కేఎల్ నారాయణ కూడా అందుకు ఓకే చెప్పడంతో రాజమౌళి బ్యాక్ స్టెప్ వేయలేదు. ప్రియాంకను తీసుకోవడం వెనుక చాలా రీజన్స్ ఉన్నాయి. ఆమెకు హాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉంది. దానికి తోడు ఆమె యాక్టింగ్ పరంగా కూడా దుమ్మురేపుతుంది. సినిమా ప్రమోషన్స్ కు హాలీవుడ్లో హెల్ప్ అవుతుందని ప్రియాంక చోప్రా విషయంలో రాజమౌళి ఇంట్రెస్ట్ చూపించాడు.

దానికి తోడు ప్రియాంకకు నార్త్ ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. ఆమె ప్రమోషన్ ఇండియా వైడ్ గానే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా హెల్ప్ అవుతుందని రాజమౌళి డెసిషన్ తీసుకున్నట్టు టాక్. ఇక ప్రియాంక చోప్రా తో పాటుగా మరో హీరోయిన్ ని కూడా తీసుకోవాలని ప్లాన్ చేశాడు. త్రిబుల్ ఆర్ సినిమా విషయంలో హాలీవుడ్ హీరోయిన్ పెద్దగా హెల్ప్ చేయలేదు. ఇక త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్లో అలియా భట్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ప్రియాంక విషయంలో మాత్రం ఆ మిస్టేక్ జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు రాజమౌళి.