30 రోజులు.. నలుగురు హీరోలు.. 500 కోట్లు.. ఏం చేస్తారో ఏమో..!

దొంగ దొంగ అని నన్ను ఒక్కడినే చూపిస్తావే నీ వెనకాల ఉన్నోడు ఎవరు..! అంటూ విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందం ఒక డైలాగ్ చెప్తాడు గుర్తుంది కదా. ఇప్పుడు సమ్మర్ సీజన్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 18, 2025 | 03:11 PMLast Updated on: Mar 18, 2025 | 3:11 PM

30 Days Four Heroes 500 Crores What Will They Do

దొంగ దొంగ అని నన్ను ఒక్కడినే చూపిస్తావే నీ వెనకాల ఉన్నోడు ఎవరు..! అంటూ విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందం ఒక డైలాగ్ చెప్తాడు గుర్తుంది కదా. ఇప్పుడు సమ్మర్ సీజన్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మామూలుగా మనకు సమ్మర్ సీజన్ అంటే మార్చి నుంచి మొదలవుతుంది జూన్ వరకు కంటిన్యూ అవుతుంది. ఈ మొత్తం సమ్మర్లో చాలా సినిమాలు విడుదలవుతాయి. అందుకే సంక్రాంతి తర్వాత సమ్మర్ మీద అన్ని ఆశలు పెట్టుకుంటారు మన నిర్మాతలు. కానీ ఈసారి మాత్రం అలా జరగడం లేదు. మొత్తం సమ్మర్ భారం తీసుకొచ్చి ఒక్క నెల మీద వేశారు నిర్మాతలు. అందుకే ఇందాక చెప్పిన డైలాగ్ మరోసారి గుర్తు చేసుకుందాం.. సమ్మర్ సమ్మర్ అంటూ మొత్తం నా ఒక్కడి మీద భారం వేస్తావే.. నా ముందు గనుక ఉన్న నెలలు సమ్మర్ కాదా అని.. మే నెల అంటుంది. ఆ ఒక్క నెలలోనే 4 పాన్ ఇండియన్ సినిమాలు విడుదలవుతున్నాయి.

సాధారణంగా సమ్మర్ అంటే మార్చి నుంచి సినిమాలు విడుదల కావడం మొదలుపెడతాయి.. కాకపోతే అప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి ఏప్రిల్ నుంచి ఇంకా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి మే నెలలోనే ఎక్కువగా పెద్ద సినిమాలన్నీ వస్తున్నాయి. మార్చి 27న లూసిఫర్ 2.. మార్చి 28న మాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ విడుదల కానున్నాయి. వీటి తర్వాత ఏప్రిల్ 10న సిద్దు జొన్నలగడ్డ జాక్.. 18న అనుష్క ఘాటి.. 25న మంచు విష్ణు కన్నప్ప సినిమాలో రానున్నాయి. వీటన్నిటి బిజినెస్ మహా అయితే 100 కోట్లకు మించదు. కానీ మే ఒకటిన నాని హిట్ 3 విడుదల కానుంది. ఈ ఒక్క సినిమా బిజినెస్ దాదాపు 120 కోట్లకు పైగా జరుగుతుంది. శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న హిట్ 3 మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అదే రోజు సూర్య నటిస్తున్న రెట్రో కూడా విడుదల కానుంది. కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న ఈ సినిమా బిజినెస్ తాగకు 100 కోట్లకు పైగా జరుగుతుంది. ఇక మే 9న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదల కానుంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పవన్ కళ్యాణ్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వచ్చే కలెక్షన్స్ ఎక్కడ ఆగుతాయో ఎవరు అంచనా కూడా వేయలేరు. ఇక మే 30న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా విడుదల కానుంది. దీని బడ్జెట్ 120 కోట్లు. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బిజినెస్ కూడా దాదాపు 100 కోట్లకు పైగానే జరుగుతుంది. కేవలం మే 1 నుంచి 30 తారీకు మధ్యలో నాలుగు సినిమాలకు కలిపి 500 కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఈ సమ్మర్ జాతకం మొత్తం మే నెల మీద ఆధారపడి ఉంది. ఈ సినిమాలు హిట్టయితే ఈ సమ్మర్ సీజన్ కూడా హిట్ అయినట్టే.. అవి తేడా కొడితే సమ్మర్ అంతా పోయినట్టే. మరి ఆ 30 రోజుల జాతకం ఎలా ఉండబోతుందో చూడాలి. జూన్ లో కూడా కమల్ హాసన్ థగ్ లైఫ్, కుబేర లాంటి సినిమాలు వస్తున్నాయి. వీటి బిజినెస్ రేంజ్ తక్కువగానే ఉంది. చిరంజీవి విశ్వంభర ఆగస్టులో విడుదలయ్యేలా కనిపిస్తోంది. అప్పటి వరకు తెలుగులో మళ్లీ పెద్ద సినిమాలు లేనట్టే. ఎలా చూసుకున్నా మే లో వచ్చే సినిమాలే సమ్మర్ ఫ్యూచర్ డిసైడ్ చేయనున్నాయి.