300 కోట్ల సినిమాకు… 1000 కోట్ల గొంతు…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు హిందీ మూవీ ఛావా కోసం రంగంలోకి దిగుతున్నాడు. తన గొంతు అరువిస్తున్నాడు. మొన్నటికి మొన్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీ కింగ్ డమ్ కి వాయిస్ ఓవర్ చెప్పాడు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు హిందీ మూవీ ఛావా కోసం రంగంలోకి దిగుతున్నాడు. తన గొంతు అరువిస్తున్నాడు. మొన్నటికి మొన్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీ కింగ్ డమ్ కి వాయిస్ ఓవర్ చెప్పాడు. కేవలం తను ఆ మూవీ టీజర్ కి వాయిస్ ఓవర్ చెబితేనే, ఈ సినిమా కు ఓవర్ సీస్ రైట్స్ రూపంలో 40 కోట్ల సొంతమయ్యాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా హిందీ మూవీ ఛావాకి, మొత్తంగా తారకే డబ్బింగ్ చెబితే టాలీవుడ్ బాక్సాఫీస్ లో పూనకాలు రావాల్సిందే. అన్నీంటికంటే వింతేంటంటే ఇంతవరకు దేశం లో డబ్బింగ్ చెప్పిన ఎవరికీ ఇవ్వనంత, ఎమౌంట్ తారక్ కి ఇస్తోంది ఛావా టీం. కేవలం ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పినందుకు, ఎన్టీఆర్ కి ఏకంగా 50 కోట్లు సమర్పించుకుంటున్నాడు. అది కూడా థియేటర్స్ కోసం కాదు, ఓటీటీలో రిలీజ్ చేసేందుకే ఈ తతంగా అంతా అని తెలుస్తోంది.. ఇంత క్రేజీ నిర్ణయం వెనక మతిపోగొట్టే ట్విస్ట్ ఉంది… అదేంటో చూసేయండి.
బాలీవుడ్ ని కుదిపేస్తున్న సినిమా ఛావా… విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ కన్నా తో లక్ష్మణ్ ఊటేకర్ తీసిన ఈ సినిమా విడుదలైన రెండు వారాల్లోనే 300 కోట్లు రాబట్టింది. వచ్చే వారం 400 కోట్ల క్లబ్ లో చేరేలా ఉంది. విచిత్రం ఏంటంటే ఇంత సెన్సేషన్ అయిన సినిమాను తెలుగులోరిలీజ్ చేయకపోవటమేంటనే ప్రశ్న ఎదురౌంది. తెలుగు జనాలనుంచి తెలుగు డబ్ వర్షన్ కావాలన్న డిమాండ్ పెరిగింది.
అందుకే సమాధానంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సాయం తీసుకుంటోంది చావ టీం. తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతగా తను చేయబోయే సాయం గాత్రదానం. ఇందులో చావా పాత్ర వేసిన విక్కీ కౌశల్ పాత్రకి తెలుగులో డబ్బింగ్ చెప్పబోతున్నాడు ఎన్టీఆర్. అసలే ఛత్ర పతి శివాజీ కొడుకు శంబాజీ పాత్ర, దానికి టైగర్ లాంటి బేస్ వాయిస్ తోడైతే, తెలుగులో కూడా చావా సునామీ ఖాయం.కాని చావా మూవీ తెలుగులో బాక్సాఫీస్ దాడి చేయట్లేదు. ఆల్రెడీ ఈమూవీ రిలీజై 2 వారలు దాటింది. ఇప్పుడు తెలుగు లో డబ్బింగ్ చెప్పినా ఈలోపే హిందీవర్షన్ చాలా మంది చూసేఛాన్స్ ఉంది. కాబట్టే ఓటీటీవర్షణ్ లో మాత్రం తెలుగు వర్షన్ ప్లాన్ చేస్తున్నారట. ఓటీటీలో 50 రోజుల తర్వాత చావాని స్ట్రీమింగ్ లో పెట్టే ఛాన్స్ఉంది.
కాబట్టి ఈలోగా తెలుగు వర్షన్ ని ఎన్టీఆర్ సాయం తీసుకుని హీరోకి డబ్బింగ్ చెప్పించాలని ఫిక్స్ అయ్యారు. అందుకు ఎన్టీఆర్ కి 50 కోట్లు సమర్పించుకోబోతున్నారు. కేవలం డబ్బింగ్ చెబితేనే అంతా అంటే, మరి అక్కడ కేవలం గొంతు మాత్రమే కాదు, తన మార్కెట్ ని కూడా తారక్ ఇచ్చినట్టే… విజయ్ దేవరకొండ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పాడంటేనే ఆ సినిమా కింగ్ డమ్ సీన్ మారిపోయింది.ఓవర్ సీస్ రైట్స్ 5 మిలియన్లు దాటాయి. రిలీజ్ కిముందే సేల్ అయ్యే ఓవర్ సీస్ రైట్స్ వల్ల కింగ్ డమ్ మూవీకి 40 కోట్లు వచ్చాయంటే, పరోక్షంగా ఎన్టీఆర్ ఖంచు కంటమే కారణం. హిందీ, తమిల్ వర్షన్ కి అంతగా ఓవర్ సీస్ రైట్స్ రాలేదు కాబట్టే దీన్ని కన్ఫామ్ చేసుకున్నారు. సో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెబితేనే ఇంతలా ఓ సినిమా ఫేట్ మారితే, ఇక ఏకంగా ఓ సినిమాలో హీరో పాత్రకి తెలుగు వర్షన్ లో తారక్ డబ్బింగ్ చెబితే, లెక్కే మారిపోతుంది. సో మొత్తానికి ఛావా తెలుగు వర్షన్ లో హీరో పాత్రకి ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పటం కన్ఫామ్ అయ్యింది. ఏప్రిల్ లో ఓటీటీ మీద చావా తెలుగు వర్షన్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ వాయిస్ సెన్సేషన్ క్రియేట్ చేయటం కన్పామ్ అయ్యింది.