3000 కోట్ల బంపర్ ఆఫర్… రెబల్ స్టార్ రేంజే వేరహే…

కల్కీతో వెయ్యికోట్ల వసూళ్లని రెండో సారి రీచ్ అయ్యాడు రెబల్ స్టార్ ప్రబాస్. అంటే బాహుబలి 2 తో 1850 కోట్ల వసూళ్లు రాబట్టిన రెబల్ స్టార్, మళ్లీ వెయ్యికోట్ల క్లబ్ లో అడుగుపెట్టడానికి, మధ్యలో కనీసం 4 పాన్ ఇండియా మూవీలు చేయాల్సొచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 24, 2024 | 11:54 AMLast Updated on: Oct 24, 2024 | 11:54 AM

3000 Crore Bumper Offer Rebel Star Range

కల్కీతో వెయ్యికోట్ల వసూళ్లని రెండో సారి రీచ్ అయ్యాడు రెబల్ స్టార్ ప్రబాస్. అంటే బాహుబలి 2 తో 1850 కోట్ల వసూళ్లు రాబట్టిన రెబల్ స్టార్, మళ్లీ వెయ్యికోట్ల క్లబ్ లో అడుగుపెట్టడానికి, మధ్యలో కనీసం 4 పాన్ ఇండియా మూవీలు చేయాల్సొచ్చింది. అందులో రెండు బ్లాక్ బస్టర్లు, మిగతా రెండు మాత్రం చేదు గ్నాపకాల్నే మిగిల్చాయి… ప్రభాస్ ఇమేజ్ తో రాధేశ్యామ్, ఆదిపురుష్ నిర్మాతలు గట్టెక్కారు కాని, లేదంటే మరో హీరోతో ఇలాంటి మూవీ తీసుంటే, రోడ్డునపడే పరిస్తితి…దర్శకులు ప్రభాస్ ని నమ్మించి మిస్ గైడ్ చేశారు కాని, లేదంటే ఆ ఎఫర్ట్స్ కంటెంట్ ఉన్న కథమీద పెడితే, ప్రభాస్ ఎకౌంట్ లో ఐదు కాదు, ఎనిమిది పాన్ ఇండియా హిట్స్ ఉండేవి…. ఏదేమైనా పాన్ ఇండియాకి కింగ్ అంటే ఒక్కడే దటీస్ రెబల్ స్టార్. బాలీవుడ్ కింగ్ లు, బాద్ షాలు సైడ్ అయిపోయేలా ఏకంగా పాన్ ఇండియా కింగ్ గా మారిన రెబల్ స్టార్ హ్యాట్రిక్ మీద ఫోకస్ చేశాడు. మొదటి వెయ్యికోట్ల మూవీకి, రెండో వెయ్యికోట్ల సినిమాకు మధ్యలో 4 సినిమాలు చేసిన ప్రభాస్, మూడో వెయ్యికోట్ల మూవీకి మాత్రం గ్యాప్ తీసుకోవట్లేదు. అలానే నాలుగో వెయ్యికోట్ట సినిమాతో హ్యాట్రిక్ మీద గురి పెట్టకుండా ఉండట్లేదు… ది రాజా సాబ్ ప్రీరిలీజ్ బిజినెస్సే కాదు, ఫౌజీ, స్పిరిట్ లు కూడా ఫ్యాన్స్ ని మించేలా డిస్ట్రిబ్యూటర్లకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఇంతకి ఇండస్ట్రీలోపల ఏం జరుగుతోంది? 3 వేల కోట్ల కాన్ఫిడెన్స్ ఇప్పుడే ఎందుకు కుదురుతోంది? టేకేలుక్

రెబల్ స్టార్ ప్రభాస్ ఒకటి కాదు రెండు కాదు 3 వేల కోట్ల దాడికి రెడీ అయ్యాడు. పాన్ ఇండియా హిట్లు ఎలా కొట్టాలా అని తోటి హీరోలు తెగ కష్టపడుతుంటే, ఆల్రెడి ఐదు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు, రెండు సార్లు వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టిన రికార్డులు ఉన్నా, అంతకుమించే సునామీకి రెడీ అయ్యాడు ప్రభాస్. బేసిగ్గా తను మహమాటస్తుడే.. కాని తన మూవీలకు అలాంటి మొహమాటాల్లేవు… బాక్సాఫీస్ లో వసూల్లు తప్ప మాట్లాడుకోవడాల్లేవు..

ఇప్పుడు అదే జరగబోతోంది. కల్కీ తో 1200 కోట్ల వసూళ్లు రాబట్టిన రెబల్ స్టార్, ది రాజా సాబ్ తో రిలీజ్ కిముందే 1200 కోట్ల పైనే బిజినెస్ చేసేలా ఉన్నాడు. ఓటీటీ రైట్స్, ఓవర్ సీస్ రైట్స్, థియేట్రికల్రైట్స్, ఇవన్నీ కలుపుకుంటూ 1350 కోట్ల వరకు లెక్కతేలుతోందిమొన్నటి వరకు ఫుష్ప 2 రిలీజ్ కి ముందే 999 కోట్ల ప్రీరీలీజ్ బిజినెస్ చేసిందంటే అంతా ఆశ్చర్య పోయారు. కాని రెబల్ స్టార్ మూవీ ది రాజా సాబ్ ప్రీరిలీజ్ బిజినెస్ 1350 నుంచి 1500 కోట్లు రీచ్ అయ్యేలా ఉందంటే బాలీవుడ్ జనాలు మాత్రం ఉలిక్కి పడుతున్నారు.

కల్కీ 1200 కోట్లు, ది రాజా సాబ్ 1500 కోట్లు అనుకుందాం… అదే జరిగితే ఫౌజీ ఈజీగా వెయ్యికోట్ల వసూల్లని రాబట్టే స్టామినా సొంతం చేసుకుంటుంది. కారనం హను రాఘవపూడీ కంటెంట్ డ్రివెన్ స్టోరీలే చేస్తాడు.. ఆ కంటెంట్ కి రెబల్ స్టార్ లాంటి కటౌట్ సైనికుడి రేంజ్ లో యాడ్ అయితే తిరుగుండదు.. అదే జరుగుతోంది. కాబట్టే ఫౌజీ మూవీ కూడా పాన్ ఇండియా లెవల్లో, మరీ ముఖ్యంగా నార్త్ ఇండియాని షేక్ చేసే ఛాన్స్ ఉంది

కాబట్టి ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా మూడు పాన్ ఇండియా హిట్లు, వరుసగా మూడు సార్లు 1000 కోట్ల వసూళ్లని కనుక రెబల్ స్టార్ రాబడితే….అదో అద్బుతం… బాహుబలి దిబిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్, సాహో, సలార్, కల్కీ మూవీలకు ది రాజా సాబ్, ఫౌజీ కూడా హిట్టై తోడైతే, పాన్ ఇండియా లెవల్లో హ్యాట్రిక్ కొట్టిన హీరోగా చరిత్ర స్రుస్టిస్తాడు.. అదికూడా ఏడు పాన్ ఇండియా హిట్లున్న హీరోగా హిస్టరీలోనిలిచిపోతాడు..ఇవన్నీ ఊహలే కావొచ్చు కాని, మార్కెట్ లో రెబల్ స్టార్ కి ఉన్న ఇమేజ్, తన కొత్త సినిమాల ప్రీరిలీజ్ బిజినెస్ జరుగుతున్న విధానం చూస్తే ప్రభాస్ కి 1000 కోట్లు కూడా రెండు మూడొందల కోట్లస్తాయి మ్యాటర్ గా మారిపోయింది.

కాబట్టి, ఖాన్లూ, కపూర్లు, కోలీవుడ్ స్టార్లు ఇలా ఎవరూ టచ్ చేయని స్థాయికి రెబల్ స్టార్ ని రాబోయే రెండు సినిమాలు తీసుకెళుతున్నాయి. ఆ తర్వాత డబుల్ హ్యాట్రిక్ షాక్ కూడా రెడీ అవుతోంది. సలార్ సీక్వెల్ సలార్ 2, కల్కీ సీక్వెల్ కల్కీ 2 ,దీనికి తోడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్.. ఇవింకా సెట్స్ పైకెళ్లలేదు. ఇప్పుడే సెట్స్ పైకెళ్లవు కూడా.. కాని ఈ మూడు ఆల్రెడీ బ్లాక్ బస్టర్స్ గా కన్సిడర్ చేయాల్సిన ప్రాజెక్టులు. అంటే, కల్కీ, ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కీ2 తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో సాధ్యం కాని పాన్ ఇండియా త్రిబుల్ హ్యాట్రిక్ మూవీలు ప్రభాస్ కి సొంతం కాబోతున్నాయా? అసలా డౌటే అక్కర్లేదు.. తను పైప్ లైన్ లోఉన్న సినిమాలను చూస్తే ఎవరికైనా ఇది అర్ధమైపోతుంది.