350 కోట్ల డమ్మీ లెక్కలు… ఐనా తారక్, ప్రభాస్ వెనకే షారుఖ్..?

1000 కోట్ల వసూళ్లు, వందలకోట్ల రెమ్యునరేషన్లు.. ఇది రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అండ్ కో వల్ల మారిన ఇండియన్ స్టార్ రేంజ్ ... అసలు 150 కోట్ల పైనే రెమ్యునరేషన్ తీసుకునే హీరోల జాబితాలోనే బాలీవుడ్ స్టార్స్ లేరు.. అలాంటిది సడన్ గా షారుఖ్ ఖాన్ 350 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 14, 2024 | 04:29 PMLast Updated on: Dec 14, 2024 | 4:29 PM

350 Crore Dummy Calculations Is Shah Rukh Behind Tarak And Prabhas

1000 కోట్ల వసూళ్లు, వందలకోట్ల రెమ్యునరేషన్లు.. ఇది రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అండ్ కో వల్ల మారిన ఇండియన్ స్టార్ రేంజ్ … అసలు 150 కోట్ల పైనే రెమ్యునరేషన్ తీసుకునే హీరోల జాబితాలోనే బాలీవుడ్ స్టార్స్ లేరు.. అలాంటిది సడన్ గా షారుఖ్ ఖాన్ 350 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడన్నారు. సల్మాన్ అండ్ కో కి 200 కోట్లు దక్కాయంటున్నారు. నిజానికి 550 కోట్ల పారితోషికంతో రెబల్ స్టార్ ప్రభాసే ఎప్పుడో హాలీవుడ్ స్టార్స్ లిస్ట్ లోకి చేరాడు. వరల్డ్ వైడ్ గా భారీ పారితోషికం తీసుకుంటున్న స్టార్స్ లిస్ట్ లో షాక్ ఇస్తున్నాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి కూడా ఇంచుమించు ఇలాంటి క్రెడిటే దక్కింది. పుష్ప 2 వసూళ్ల లో రియాలిటీ మీద ఎన్ని డౌట్లున్నా ఈ హీరోకి 245 కోట్ల నుంచి 280 కోట్ల వరకు పారితోషికం అందిందంటే అదో రికార్డే… అంత సీన్ కూడా లేని ఖాన్లు, కపూర్లు డమ్మి రెమ్యునరేషన్లు చెప్పినా? అతికినట్టు లేదా? వాటిమీద కూడా సెటైర్లు పేలుతున్నాయా?

రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ల హిందీ హీరోలని పరేషాన్ చేస్తున్నాయా… ఈ ఏడాదిలోనే రెండు సార్లు పాన్ఇండియా హీరోల పారితోషకాలు హాట్ టాపిక్ అయ్యాయి. అలాంటి టైంలో ఇప్పుడు మూడో లిస్ట్ వచ్చింది… కారణం షారుఖ్ ఖాన్ 350 కోట్ల రెమ్యునరేషన్ తో ఇండియాలోనే నెంబర్ వన్ అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూయటం…

నిజంగా కోడి కూసినంత తేలికా కాదు డైనోసార్ లా మారి బాక్సాఫీస్ ని షేక్ చేయటం. బాలీవుడ్ లో వెయ్యికోట్లని రెండు సార్లు రాబట్టిన హీరో షారుఖ్. అందులో ఎలాంటి డౌట్ లేదు.. అందులోంచే తన వాట షేర్, రెమ్యునరేషన్ కలిపితే 350 కోట్లు 350 కోట్లు చొప్పున రెండు సినిమాలకు 700 కోట్లొచ్చాయంటున్నారు

అసలు జవాన్, పటాన్ వసూల్లే నిజమా కాదా అన్న డౌట్లు పెరిగాయి. బాలీవుడ్ లో కార్పోరేట్ బుక్కింగ్స్ ఎక్కువ కాబట్టి, పటాన్ 500 కోట్లు రాబట్టుడే ఎక్కువ, జవాన్ 6నుంచి 7 వందలకోట్లు రాబట్టి ఉండొచ్చనంటున్నారు. కాసేపు ఆ మొత్తం వసూల్లు అంతొచ్చాయనుకుందాం. అయినా వాటి వల్ల షారుఖ్ కి వచ్చిన ఎమౌంట్, తన రెగ్యులర్ పారితోషికం కలిపితే 350కోట్లే దాటాయి..

అలాంటప్పుడు కింగ్ ఖాన్ షారుఖ్ పాన్ ఇండియా నెంబర్ వన్ హీరో ఎలా అవుతాడు? ఎందుకంటే 350 కోట్లని వార్ 2 కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తీసుకుంటున్నాడు. ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ కి అయితే 370 కోట్ల వరకు పారితోషికంగా తారక్ కి సొంతమౌతోంది. అలా చూసినా షారుఖ్ పాన్ ఇండియా నెంబర్ వన్ అనే పరిస్థితి లేదు

ఇంకా విచిత్రం ఏంటంటే రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడో సలార్ కి తీసుకున్నాడు 350కోట్ల పారితోషికం. కల్కీకి అయితే 390 కోట్ల వరకు తన వాటాగా సొంతమయ్యాయన్నారు. ఫౌజీ, స్పిరిట్ మూవీలకు 500 కోట్ల నుంచి 550 కోట్ల వరకు పారితోషికంగా ప్రభాస్ తీసుకుంటున్నాడు కాబట్టే, వరల్డ్ టాప్ టెన్ స్టార్స్ లో తను 8 వస్థానంలో ఉన్నాడన్నారు. హాలీవుడ్ స్టార్స్ లిస్ట్ లో చేరాడన్నారు. అలాచూసినా తన దరిదాపుల్లో షారుఖ్ ఖాన్ లేడు.. కాబట్టి షారుఖ్ పాన్ ఇండియా నెంబర్ వనే కాదు, పారితోషికంలో కూడా నెంబర్ వన్ కింగ్ అనటమే కాస్త కామెడీగా ఉందనే కామెంట్లు పెరిగాయి. బాలీవుడ్ మీడియా తెలుగు వెలుగులు భరించలేక ఇలా సీన్ లోకి షారుఖ్ ని తీసుకొస్తోందన్న సెటైర్లు పేలుతున్నాయి.