3500 కోట్ల పంచ్.. శంకర్ లానే అయితే రోడ్డుమీదికే..!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కి మొకం వాచిపోయేలా పంచ్ పడింది. కాపీ కొడితే జనం కొడతారని తన ఫ్లాప్ మూవీస్ తో తేలింది. కాని ఈడీ కూడా దాడి చేస్తుందని ఇప్పుడు కన్ఫామ్ అయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2025 | 08:26 PMLast Updated on: Feb 22, 2025 | 8:26 PM

3500 Crore Punch Like Shankar But On The Road

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కి మొకం వాచిపోయేలా పంచ్ పడింది. కాపీ కొడితే జనం కొడతారని తన ఫ్లాప్ మూవీస్ తో తేలింది. కాని ఈడీ కూడా దాడి చేస్తుందని ఇప్పుడు కన్ఫామ్ అయ్యింది. ప్రజెంట్ ఇదే డిస్కర్షన్ సోషల్ మీడియాని కుదిపేస్తోంది. ఎప్పుడో 16 ఏళ్ల క్రితం శంకర్ చేసిన తప్పు, ఇప్పుడు కర్మగా మారి వెంటాడింది. ఎవరో కథని శంకర్ కాపీ కొట్టాడని తేలటంతో, 10 కోట్ల పైనే విలువైన తన ఆస్తులు జప్తయ్యాయి. కట్ చేస్తే ఇప్పడు ఈ మ్యాటర్ తేలగానే, త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి రాజమౌళి వరకు అంతా అలర్ట్ అయ్యారు. నిజంగానే ఎవరైన ఇంకొకరి కథ కాపీ కొడితే, వాళ్ల నుంచి కూడా ఇలానే కోట్లు రాబడితే ఏంటి పరిస్థితి..? రాజమౌళి అయితే సీన్లు కాపీ కొట్టడం ఏకంగా కళ అన్నాడు. అదే నిజమైతే తన మీద ఇలానే కాపీ కేసు పడితే, ఆస్తులమ్ముకోవాల్సిందే అనంటున్నారు… నిజంగా ఇది నిజమేనా? కాపీ రైట్స్ యాక్ట్ తో శంకర్ కే అంత పంచ్ పడితే… మరి మన కాపీ రాయుళ్ల పరిస్థితేంటి? హావేలుక్

గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా లెవల్లో బిగ్గెస్ట్ డిజాస్టర్, బిగ్గెస్ట్ ఫ్లాప్… ఇలాంటి ఓ ఫెల్యూర్ ఫేస్ చేశాక డైరెక్టర్ శంకర్ తో ఎవరైనా సినిమా తీస్తారా..? ఖచ్చితంగా డౌటే… ఆల్రెడీ భారతీయుడు 2 తో శంకర్ పనైపోయిందన్నారు. గేమ్ ఛేంజర్ తో మరోసారి కన్ఫామ్ చేసుకున్నారు. అయినా ఎక్కడో కొంత డౌట్ కనిపిస్తోంది. ఈ దర్శకుడితో ఎవరో ఒకరు సినిమా తీస్తారని…. కాని ఇప్పుడా ఆశని ఆవిరి చేస్తోంది ఈడీ కేసు… 2010 లో విడుదలైన రోబో మూవీ కథ కాపీ అంటూ 2011 లో వేసిన కేసు తన మెడకి చుట్టుకుందట. ఇప్పుడు ఎండోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ ఏకంగా డైరెక్టర్ శంకర్ ఆస్తుల్లో 11 కోట్ల విలువ చేసే ఆస్తుల్ని జప్తుచేసే పనిలో ఉంది. ఆల్రెడీ పదకోట్ల ఐదు లక్షల విలువైన ఆస్తుల్ని జప్తు చేసింది కూడా.

రజినీ, ఐశ్వర్యా రాయ్ తో శంకర్ తీసిన రోబో అప్పట్లో 290 కోట్ల పైనే వసూళ్లు రాబట్టింది. అంత పెద్ద హిట్ మూవీ కాపీ అంటే నమ్ముతారా… ఇది నిజం… కోర్టులో వేసి కేసు ప్రకారం జిగుబా ను కాపీ కొట్టి శంకర్ రోబో తీశాడని తేలింది. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా శంకర్ కి ఎగైనెస్ట్ గానే ఉండటంతో, కాపీ రైట్ యాక్ట్ వల్ల శంకర్ కి సీన్ రివర్స్ అయ్యింది.ఇదంతా ఓకే ఏదో కథ వినో,చూసో కథని కాపీ కొట్టినంత మాత్రాన ఇలా ఆస్తులు జప్తు చేస్తారా…? అలా అనుకుంటే మన దగ్గర ఎంతమంది దర్శకులు, సీన్లు, నవలలు, సినిమాలే లేపేశారు..? కొందరైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంగ్లీష్ మూవీ సీడీతో రూమ్ లోకి వెళ్లి, తెలుగు సినిమా స్క్రిప్ట్ తో బయటికొస్తాడనంటారు. సో ఇక్కడ పొరుగు సినిమాలు, లేదంటే నవలతు, కథలు కాపీ కొట్టడం అంత కామన్..

రాజమౌళి లాంటి డైరెక్టర్ హాలీవుడ్ లో నచ్చిన సీన్లు, అంతకంటే గొప్పగా తీస్తా అన్నాడు. అసలది కాపీ కాదు, కాపీ అంటేనే ఆర్టనేశాడు… ఆలెక్కన తన సినిమాల్లో కాపీ సీన్ల మీద కూడా ఎవరైనా ఇలానే కేసు వేస్తే ఏంటి పరిస్థితి… ఇలాంటి డిస్కర్షన్ కూడా మొదలైంది. ఆమధ్య ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ కథ కాపీ కొడితే, డైరెక్టర్ రంగంలోకి దిగి, త్రివిక్రమ్ పరువంతా తీశాడు. అప్పటి వరకు మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ కి ఉన్న పేరంతా కొట్టుకుపోయింది. అదే ఓరకంగా పొరుగింటి కథల్ని కాపీ కొట్టొద్దనే వేకప్ కాల్ లా మారింది. అయినా చాలా మంది మారట్లేదు. అసలే ఇది యూ ట్యూబ్, ఓటీటీ యుగం, ఎవరే ఇంగ్లీస్ సినిమాను కాదు, కనీసం సీన్ ని కాపీ కొట్టనా జనం గుర్తుపట్టేస్తారు… కాబట్టే రాజమౌలి లాంటి డైరెక్టర్ మహేశ్ బాబు తో తీసే సినిమా కోసం రెండు నవలల రైట్సే కాదు, ఇండియానా జోన్స్ మూవీ రౌైట్స్ ని కూడా కొన్నడనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి శంకర్ కి 10 కోట్ల బొక్క పడిందని తెలుస్తోంది.