365 రోజులు… 500 కోట్లు… ఇట్స్ రేర్ రికార్డ్…
రెబల్ స్టార్ ప్రభాస్ కి కెరీర్ లో ఊహించని ఓ రికార్డు సొంతమైంది. అది కూడా థియేటర్స్ లోకాదు ఓటీటీలో... 365 రోజుల్లో ఈ సినిమాకి ఓటీటీలో వచ్చిన వ్యూవర్ షిప్ డిజిటల్ ప్లాట్ ఫాం ని షేక్ చేస్తోంది.

రెబల్ స్టార్ ప్రభాస్ కి కెరీర్ లో ఊహించని ఓ రికార్డు సొంతమైంది. అది కూడా థియేటర్స్ లోకాదు ఓటీటీలో… 365 రోజుల్లో ఈ సినిమాకి ఓటీటీలో వచ్చిన వ్యూవర్ షిప్ డిజిటల్ ప్లాట్ ఫాం ని షేక్ చేస్తోంది. మ్యాటర్ అదే అయితే, అంతగా షాక్ అవ్వాల్సిన పనిలేదు. కాని అంతకుమించిన రికార్డు, రివార్డు సలార్ టీంకి దక్కినట్టే కనిపిస్తోంది. ఇక మీదట ఇది మిగతా మూవీలకు ట్రెండ్ గా, సరికొత్త దారిగా మారే ఛాన్స్ఉంది. సలార్ మూవీ థియేటర్స్ లో 850 కోట్ల వరకు రాబట్టింది. కాని ఓటీటీలో 500 కోట్లు వెనకేసింది.. ఇదే ఇక్కడ మైండ్ బ్లాంక్ చేసే రికార్డు… ఓటీటీలో వ్యూవ్స్ వస్తాయి… వాటితో రికార్డులు రీసౌండ్ చేస్తాయి. కాని ఫస్ట్ టైం ఓటీటీలో కూడా ఈ మూవీ 500 కోట్లు రాబట్టింది. అలా ఓటీటీలో కూడా వందకోట్లు వెనకేసుకోవచ్చని ప్రూవ్ చేసింది సలార్ మూవీ. అదెలా? అయినా థియేటర్స్ లో వచ్చిన వసూళ్లని ఓటీటీ మించేస్తుందా? ఓటీటీ రైట్స్ కాకుండా మరోలా కూడా వసూళ్లు రాబట్టొచ్చా? అదెలా సాధ్యం? హావేలుక్
సలార్ మూవీ ఓటీటీలో 365 రోజుల్లో 30 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇది రికార్డే ఖచ్చితంగా ఏడాది మొత్తం ఇలా టాప్ ప్లేస్ లో ఓ మాస్ మూవీ ఉండటం గొప్ప విషయమే.. కాని అంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఓటీటీలో కూడా 450 నుంచి 500 కోట్లు ఈ సినిమా రాబట్టడం. బేసిగ్గా పెద్ద హీరోల మూవీలంటే ఓటీటీ రైట్స్ ముందే అమ్మేస్తారు..అలా 450 నుంచి 500 కోట్లొచ్చాయా అంటే కానే కాదు. సలార్ 50 రోజుల థియేట్రికల్ బిజినెస్ 850 కోట్ల వరకు రీచ్ అయ్యింది. ఓటీటీ రైట్స్ 220 కోట్లకు సేల్ అయ్యిందని ప్రచారం జరిగింది. ఐతే నిజానికి ఫిల్మ్ టీం ఈ సినిమాను 40 పర్సెంట్ పే పవర్ వ్యూ కి సేల్ చేసిందని తెలుస్తోంది.
అంటే ఓ సినిమా ఓటీటీలో రిలీజ్ అయితే, ఎన్న వ్యూస్ వస్తే అన్ని వ్యూస్ కి కొంత ఎమౌట్ ఓటీటీ సంస్థ ఇస్తుంది. ఒక్క వ్యూ కి 4 నుంచి 10 రూపాయలనుకుంటే, పది మంది చూస్తే 100 రూపాయలు.. ఇలాంటి విచిత్రమే ఇక్కడ జరిగింది. నిజానికి సలార్ మూవీ ఓటీటీ రైట్స్ ని 120 కోట్లకే సేల్ చేశారట. మిగతా 100 కోట్ల ఎమౌండ్ బదులు, పే పవర్ వ్యూ పరంగా, ఇటు ఓటీటీ సంస్థ, అటు చిత్ర నిర్మాతలు షేర్ చేసుకోవాలని డీల్ చేసుకున్నారట.ఆ డీల్ వల్లే ఏడాదిగా ఈ సినిమా మిలియన్ల కొద్ది వ్యూస్ వల్ల, ప్రతి నెల 45 కోట్ల వరకు ఫిల్మ్ టీం కి తెచ్చిపెట్టింది. అలా 365 రోజుల్లో 450 కోట్ల నుంచి 500 కోట్ల వరకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇది ఇలానే కొనసాగితే, థియేటర్స్ లో సలార్ రాబట్టిన 850 కోట్ల వసూళ్లని, ఓటీటీ మించే ఛాన్స్ ఉంది. మరో 4 నెలలు ఇలానే ఓటీటీలో సలార్ కి ఇలానే వ్యూస్ వస్తే అదే జరుగుతుంది.
ఇక ఓటీటీలో 30 మిలియన్ల వ్యూస్ సలార్ కి వచ్చాయంటే, 3 కోట్ల మంది ఈ సినిమాను ఓటీటీలో చూసినట్టు… 3 గంటల సినిమాను 3 కోట్లమంది చూశారంటే, 90 కోట్ల గంటల వ్యూవ్స్ అవర్స్ అని తెలుస్తోంది. సో గంటకి 5 రూపాయలనుకున్నా, 450 కోట్లు, లేదు 10 రూపాయలు పే పర వ్యూ అనుకున్న 900 కోట్లు… సో ప్రభాస్ దెబ్బకి ఓటీటీలో కూడా పే పవర్ వ్యూస్ తో 1000 కోట్ల సందడి వచ్చేలా ఉంది. అలాంటి రికార్డు త్వరలోనే తన ఎకౌంట్ లోపడితే కనగా, ఇదో ట్రెండ్ సెట్టింగ్ మైల్ స్టోన్ గా మారుతుంది.