కల్కీ రెండో పార్ట్ లో మూడో ప్రపంచ యుద్దమేనా…?
ఇండియన్ సినిమాలో ఒక సంచలనంగా నిలిచిన కల్కి సినిమా రెండో పార్ట్ గురించి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రెండో పార్ట్ లో ఇప్పటికే కొన్ని సన్నివేశాలను షూట్ చేసినా మిగిలిన షూట్ మాత్రం ఆలస్యం అయ్యేలా కనపడుతోంది.
ఇండియన్ సినిమాలో ఒక సంచలనంగా నిలిచిన కల్కి సినిమా రెండో పార్ట్ గురించి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రెండో పార్ట్ లో ఇప్పటికే కొన్ని సన్నివేశాలను షూట్ చేసినా మిగిలిన షూట్ మాత్రం ఆలస్యం అయ్యేలా కనపడుతోంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ సినిమా షూట్ మొదలవుతుందని నిర్మాత స్వప్నా దత్ పేర్కొన్నారు. ఇక ఈ సినిమాపై ఫ్యాన్స్ లో కొన్ని సందేహాలు ఉన్నాయి. భైరవుడు కర్ణుడుగా ఎప్పుడు మారతాడు అనేది రెండో పార్ట్ లో చూపించే అవకాశం ఉంది.
తాజాగా ఈ సినిమాపై రచయిత పరుచూరి గోపాల కృష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సినిమాలో మహా భారతంలోని ముఖ్య పాత్రలు అయిన అర్జునుడు, కర్ణుడు, శ్రీ కృష్ణుడు, అశ్వత్దామ పాత్రలను తీసుకుని చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు అని కొనియాడారు. ఇంతటి కథా కథన చాతుర్యాన్ని చూపించినందుకు నాగ అశ్విన్ ను మెచ్చుకుని తీరాల్సిందే అన్నారు గోపాల కృష్ణ. ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం అని… ఈ సినిమా టైటిల్ వింటేనే అర్ధమైపోతుందని, సినిమా చూసే వాళ్లకు ఏ సందేహాలు రాకుండా టైటిల్ లోనే జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు.
అందుకే ఈ సినిమాలో సన్నివేశాలు నిజంగా జరిగాయా లేదా అనే సందేహంతో రాకుండా కల్కీ పుడితే ఎలా ఉంటుంది అనేది చెప్పాలనుకున్నారని… ఆ విషయాన్ని బహుశా రెండో పార్ట్ లో చూపిస్తారేమో అని, అందుకే సినిమా ప్రశ్నార్ధకంగా ముగించి ఉండవచ్చు అన్నారు పరుచూరి గోపాల కృష్ణ. ఇక కాశీని ఆక్రమించుకునే సీన్స్ చూస్తే మనకి చైనాకు మధ్య జరుగుతున్న భూ ఆక్రమణ ఘటనలు గుర్తుకు వచ్చాయని ఒకవేళ రెండో భాగంలో మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎలా ఉంటుందో చూపిస్తారని అనుకుంటున్నట్టు పరుచూరి వెల్లడించారు. అయితే ఇప్పటి వాళ్లకు ఈ సినిమా అర్ధం కావడం కష్టమే అన్నారు పరుచూరి. డైలాగ్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయని, ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చే సీన్స్ చాలా నచ్చాయని కొనియాడారు.