పాటలకే 40 కోట్లు.. ఊర మాస్ డాన్సులు.. నెలకో తూటా…!

రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ లో 5 పాటలకు 40 కోట్లు.... ఇవి ఖర్చయ్యేలెక్క కాదు... వస్తున్న లెక్కలు... పాటకి కనీసం 8 కోట్లు సొంతమవుతున్నాయి. అంతేకాదు ఇంతవరకు ఎన్నడూ చూడని ప్రభాస్ ని, ఇక మీదట చూడబోతున్నారట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 19, 2025 | 06:28 PMLast Updated on: Mar 19, 2025 | 6:28 PM

40 Crores For Songs Alone Village Mass Dances A Bullet Every Month

రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ లో 5 పాటలకు 40 కోట్లు…. ఇవి ఖర్చయ్యేలెక్క కాదు… వస్తున్న లెక్కలు… పాటకి కనీసం 8 కోట్లు సొంతమవుతున్నాయి. అంతేకాదు ఇంతవరకు ఎన్నడూ చూడని ప్రభాస్ ని, ఇక మీదట చూడబోతున్నారట. ఆరేంజ్ లో తన సినిమా పాటల్లో తీన్మార్ వేయబోతున్నాడు ప్రభాస్… ఎప్పుడో బిల్లా, మిర్చీలో డాన్స్ ఇరగదీసిన రెబల్ స్టార్, బాహుబలి నుంచి మొన్నటి కల్కీ వరకు మళ్లీ సాంగ్స్ లో దుమ్ముదులిపింది లేదు. అన్నీ భారమైన పాత్రలు, సాలిడ్ ఎమోషన్స్… వాటి వల్ల ఒకప్పటి సాంగ్స్ లా ప్రభాస్ పాటలు ఉండే పరిస్థితి లేదు. కాని రాజా సాబ్ లో ప్రభాస్ కిరాక్ డాన్స్ లు వేయబోతున్నాడు. కిరాక్ స్టెప్స్ తో షాక్ ఇవ్వబోతున్నాడు. ఇది తమన్ నుంచి వచ్చిన అప్ డేట్… ఇది ఇలా వచ్చిందో లేదో, ఇంతలోనే సలార్ సునామీ మొదలైంది. ఈ సినిమా రీరిలీజ్ కి ప్లాన్ చేసిన వెంటనే సింగిల్ డేలో కోటి వరకు అడ్వాన్స్ బుక్కింగ్స్ జరిగాయి. లాస్ట్ ఇయరే వచ్చిన మూవీని రీ రిలీజ్ చేస్తే మళ్లీ ఇంత ఎమోంట్ అడ్వాన్స్ బుక్కింగ్స్ తోనేనా… ఇది నిజంగా షాకింగ్ న్యూసే… ఇలా ఈ వారం ఏకండా మూడు ఝలక్స్ ఇస్తున్నాడు ప్రభాస్.. అవేంటో చూసేయండి.

రెబల్ స్టార్ ఈ వారం సలార్, రాజా సాబ్, ఫౌజీ అప్ డేట్లతో షాక్ ఇచ్చాడు. ముందుగా సలార్ విషయానికొస్తే, ఈ సినిమా లాస్ట్ ఇయరే వచ్చింది. 2023 డిసెంబర్ లోనే వచ్చినా, సందడంతా లాస్ట్ ఇయరే కాబట్టి, ఈమూవీ వచ్చి ఏడాదే అవుతోంది… అలాంటి సినిమాని రీరిలీజ్ చేయటమే వింతనుకుంటే, కోటి వరకు అడ్వాన్స్ బుక్కింగ్స్ తోనే రావటం అంతకంటే వింత… దగ్గర్లో మంచి సినిమాలేవి లేదు.. వచ్చేలా లేవు… ఇలాంటి టైంలో సలార్ లాంటి మాస్ యాక్షన్ డ్రామా వస్తే రెస్పాన్స్ గట్టిగానే ఉంటుంది. కాని ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీని రీరిలీజ్ చేస్తే ఈ రేంజ్ లో మాత్రం అడ్వాన్స్ బుక్కింగ్స్ ఇలా ఉంటాయని ఎవరూ ఊహించలేదు.

ఇలా సలార్ రీరిలీజ్ తో ట్రెండ్ సెట్ చేస్తుంటే, సీన్ లోకి రాజా సాబ్ పాటల తూటాలు పేలుస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మిర్చీ , బిల్లా లాంటి సినిమాల టైంలో ఈ ఆరున్నర అడుగులు కటౌట్ ఊరమాస్డాన్స్ తో దుమ్ముదులిపాడు. మళ్లి ఇప్పుడు రాజా సాబ్ లో దుమ్ముదులపబోతున్నాడట ప్రభాస్..ఆల్రెడీ రాజా సాబ్ కోసం అరడజన్ పాటలు కంపోజ్ చేసిన తమన్, అవి ఔట్ డేట్ అయ్యాయి, అని మళ్లీ కొత్త పాటలు కంపోజ్ చేస్తున్నాడు. ఇక రాజా సాబ్ లో ఐటమ్ సాంగ్ తో ప్రభాస్ డాన్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడట మారుతి. రొమాంటిక్ సాంగ్, ఎంట్రీ సాంగ్ ఇలా ఒకప్పటి ప్రభాస్ మాస్ ఫార్ములాకు అనుగునంగా రాజా సాబ్ లో ఐదు పాటలుండబోతున్నాయని తేల్చాడు..

నిజంగా మిస్టర్ పర్ఫెక్ట్ లోకూడా ప్రభాస్ డాన్స్ తో ఇరగదీశాడు. కాని ఎందుకనో బాహుబలి టైం నుంచి తన సినిమాలు బాగున్నా, పాటల్లో తను ఒకప్పటిలా డాన్స్ చేసే పరిస్థితులు లేవు. బాహుబలి, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, అన్నీంట్లో తన పాత్ర గంభీరంగా ఉండటమే పాటల్లో తను ఊర మాస్ స్టెప్స్ వేయకపోవటానికి కారణం కావొచ్చు. సలార్ లో అయితే మాంటేజ్ సాంగ్సే తప్ప ఇంకేం లేవు.. కల్కీలో ఏదో పాటలున్నాయి కాని, ప్రభాస్ డాన్స్ ఇరగదీసే ఛాన్స్ రాలేదు. నిజానికి భాగా హైటున్న వ్యక్తులు డాన్స్ చేయటం చాలా కష్టం. కాని రెబల్ స్టార్ మాత్రం డాన్స్ ఇరగదీస్తాడనేంతగా పాటల తూటాలు పేల్చాడు. సో అలాంటి ఒకప్పటి తనని రాజా సాబ్ లో చూపించే ప్రయత్నం చేస్తోంది మారుతి టీం.

ఇక ప్రజెంట్ తను చేస్తున్న ఫౌజీ లో రెండో హీరోయిన్ హాట్ టాపికైంది. ఇందులో ఇమాన్వి హీరోయిన్ అయితే, కరీనా కపూర్ స్పెషల్ రోల్ వేయటం కన్ఫామ్ అయ్యింది. మొత్తంగా ఒకే వారం మూడు షాకింగ్ న్యూస్ లతో సోసల్ మీడియాని షేక్ చేశాడు రెబల్ స్టార్.