4000 కోట్ల బ్యూటీ.. రౌడీ కోసం డ్యూటీ…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో రష్మిక ఇంతవరకు జోడీ కట్టలేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన కూడా మెరవలేదు. ప్రభాస్ పక్కన కూడా తను ఎన్నడూ వెలిగిందిలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 19, 2025 | 09:00 PMLast Updated on: Feb 19, 2025 | 9:00 PM

4000 Crore Beauty Duty For Rowdy

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో రష్మిక ఇంతవరకు జోడీ కట్టలేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన కూడా మెరవలేదు. ప్రభాస్ పక్కన కూడా తను ఎన్నడూ వెలిగిందిలేదు. అయినా తను మూడు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్న శ్రీవల్లి… పుష్ప తర్వాత యానిమల్ తో పాన్ ఇండియా హిట్ పడింది. పుష్ప2 తర్వాత చావాతో మరో వెయ్యికోట్ల ప్రాజెక్ట్ తన ఎకౌంట్ లో పడినట్టే ఉంది. హిట్ టాక్ కిక్ ఇస్తోంది. ఎంత విచిత్రం అంటే, అసలు రష్మిక ఎవరో తెలియని స్టేజ్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పాన్ ఇండియా లెవల్లో ఫోకస్ అయ్యాడు. పాన్ ఇండియా హిట్ రాలేదు కాని, ఆరేంజ్ లోతనెవరో సౌత్, నార్త్ అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అలాంటి తనని హిందీలో ఫేట్ మార్చేందుకు తెగ కష్టపడుతోంది నేషనల్ క్రష్ రష్మిక.. ఎంతైనా తన మనసుకి దగ్గరైన హీరో కాబట్టి, తనని బాలీవుడ్ మార్కెట్ కి దగ్గరయ్యేలా చేస్తోంది… అదెలా? హావేలుక్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఎవరిపేరైనా వినిపిస్తోందంటేఅది తనే… ప్రజెంట్ హిందీ మూవీ చావా బ్లాక్ బస్టర్ అవ్టంతో, మరోసారి తను నేషనల్ క్రష్ గా మారింది. ముందు పుష్ప తో శ్రీవల్లిగా పాన్ ఇండియా లెవల్లో వెలిగింది. తర్వాత యానిమల్ బ్లాక్ బస్టర్ తో బాలీవుడ్ ని ఏలింది.కట్ చేస్తే పుష్ప2 వచ్చి మరోసారి శ్రీవల్లి సౌండ్ ని పాన్ ఇండియా లెవల్లో రీసౌండ్ గా మార్చింది. ఇప్పుడు హిందీ మూవీ చావా వంతొచ్చింది. ఇక్కడ ఒక తెలుగు పాన్ ఇండియా హిట్ తర్వాత ఒక హిందీ బ్లాక్ బస్టర్… ఇలా రెండు సార్లు బాక్సాఫీస్ ని షేక్ చేసిన రష్మిక, రౌడీ ఫేట్ మార్చేపనిలో పడింది. తన ప్రియ నేస్తానికి కష్టకాలంలో, బాలీవుడ్ లో దారి చూపిస్తోంది..

ఔను డియర్ కామ్రెడ్, గీత గోవిందం తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కాలేదు. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బ్యానర్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, హిందీ మూవీ చేయబోతున్నాడు. ఇందులో తనకి జోడీగా రష్మికనే కనిపించబోతోందట. మూడోసారి కాంబినేషన్ రిపీట్ కాబోతోందట. నిజానికి అర్జున్ రెడ్డి హిట్ తో పాన్ ఇండియా లెవల్లో విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.అర్జున్ రెడ్డి హిందీ మూవీ కాదు, పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయలేదు. అయినా తన పెర్ఫామెన్స్ కి ఫిదా అవటంతో, పాన్ ఇండియా లెవల్లో తనకి గుర్తింపు దక్కింది. ఒక్క పాన్ ఇండియా హిట్ పడితే రౌడీ స్టార్ లెవెల్ వేరేలా ఉండేది. కాని లైగర్, ఖుషీ, ఫ్యామిలీ స్టార్ అన్నీ వరుస డిజాస్టార్లే. దీనికి తోడు నోటి దూల అని స్టాప్ పడింది. ఫలితంగా తన తలరాతే మతిపోగొట్టింది.

ఏదేమైనా కింగ్ డమ్ తో తన అద్రుష్టం పరీక్షించుకుంటున్న విజయ్, హిందీ మూవీ చేయటం కన్ఫామ్ అయ్యేలా ఉంది. 4 పాన్ ఇండియా హిట్లతో 4 వేల కోట్ల కటౌట్ గా మారిన రష్మిక, కరణ్ జోహార్ చెప్పిన కథకి రౌడీనే రెఫర్ చేసిందట. అలా కరణ్ ని కలిసిన విజయ్ హిందీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. మొత్తానికి ఈ కాంబినేషన్ లో కథ సిద్దం కాని, డైరెక్టర్ మాత్రమే క్లారిటీ రావట్లేదు. బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన కిల్ డైరెక్టర్ నగేష్ తోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.