విజయ్ దేవరకొండపై 450 కోట్ల గేమ్.. తేడా కొడితే ఏరుకోవడానికి ఏమీ మిగలదు..!
స్టార్ హీరోలకు మూడు నాలుగు ఫ్లాపులు వచ్చిన పెద్దగా నష్టం ఉండదు.. కానీ మీడియం రేంజ్ హీరోలకు మాత్రం వరుసగా 3 ప్లాపులు పడితే మార్కెట్ మీద పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. కానీ విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం అది జరగడం లేదు.

స్టార్ హీరోలకు మూడు నాలుగు ఫ్లాపులు వచ్చిన పెద్దగా నష్టం ఉండదు.. కానీ మీడియం రేంజ్ హీరోలకు మాత్రం వరుసగా 3 ప్లాపులు పడితే మార్కెట్ మీద పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. కానీ విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం అది జరగడం లేదు. కెరీర్ మొదట్లో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సినిమాలతో అద్భుతమైన విజయాలు అందుకొని అప్పుడే సాలిడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్. వీటితో వచ్చిన మార్కెట్ ఇప్పటికి విజయ్ దేవరకొండను కాపాడుతుంది. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లై, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలు డిజాస్టర్ అయినా కూడా విజయ్ దేవరకొండతో భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి ఇప్పటికీ నిర్మాతల సిద్ధంగానే ఉన్నారు.
ప్రస్తుతం విజయ్ చేస్తున్న మూడు సినిమాల బడ్జెట్ 100 కోట్లకు పైనే ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో వస్తున్న కింగ్ డమ్ బడ్జెట్ 125 కోట్లు. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తుంటే సినిమా ఎంత భారీగా ఉండబోతుందో అర్థం అవుతుంది. మే 30న సినిమా విడుదల కానుంది. దీని తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కించబోయే సినిమా బడ్జెట్ కూడా 120 నుంచి 150 కోట్ల మధ్యలో ఉందని తెలుస్తోంది. అలాగే రవి కిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోయే రౌడీ జనార్ధన బడ్జెట్ 100 కోట్లు.
వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ మీద ఇన్ని వందల కోట్లు పెట్టడం అంటే చిన్న విషయం కాదు చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు నిర్మాతలు. కానీ ఒకవేళ వర్కౌట్ అయితే మాత్రం వాళ్లకు వచ్చే లాభాలు కూడా అలాగే ఉంటాయి. స్టోరీ బాగుంది కదా అని హీరో మార్కెట్, ట్రాక్ రికార్డుతో పని లేకుండా వందల కోట్లు బాగానే పెడుతున్నారు. అవన్నీ వర్కవుట్ అవ్వాలని వాళ్లు కూడా కోరుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే విజయ్ దేవరకొండ మీద చాలా పెద్ద జూదం ఆడుతున్నారు నిర్మాతలు. లక్కీ నెంబర్ తగిలి సినిమాలు హిట్ అయితే ఓకే.. లేదంటే ఏరుకోవడానికి ఏమి మిగలదు అక్కడ.