రోజుకి 5 కోట్లు… ఇంకెప్పుడు 1000 కోట్ల ఎనౌన్స్ మెంట్…?

దేవర జోరు బాలీవుడ్ కి అర్ధం కావట్లేదు. ఉత్తర ప్రదేశ్ కేపిటల్ సిటీ లక్నోలో ఈ సినిమా విడుదలైన ఇన్నిరోజుల్లో ఏకంగా 50 కోట్లు రాబట్టింది. ఓ నార్త్ ఇండియాన్ స్టేట్ లోని ఒక సిటీలోంచి ఓ తెలుగు మూవీ ఇంతగా కలెక్ట్ చేయటం రికార్డే... ఇప్పటి వరకు నార్త్ ఇండియాలో నుంచి 60 శాతం వసూళ్లు దేవరకి దక్కాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 24, 2024 | 03:40 PMLast Updated on: Oct 24, 2024 | 3:40 PM

5 Crores Per Day When Will The Announcement Of 1000 Crores Be Made

దేవర జోరు బాలీవుడ్ కి అర్ధం కావట్లేదు. ఉత్తర ప్రదేశ్ కేపిటల్ సిటీ లక్నోలో ఈ సినిమా విడుదలైన ఇన్నిరోజుల్లో ఏకంగా 50 కోట్లు రాబట్టింది. ఓ నార్త్ ఇండియాన్ స్టేట్ లోని ఒక సిటీలోంచి ఓ తెలుగు మూవీ ఇంతగా కలెక్ట్ చేయటం రికార్డే… ఇప్పటి వరకు నార్త్ ఇండియాలో నుంచి 60 శాతం వసూళ్లు దేవరకి దక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు, నార్త్ ఇండియా వసూళ్లే ఆల్ మోస్ట్ వెయ్యికోట్లని రీచ్ అయ్యాయని లెక్కలు, వాటి అంచనాలతో తేలింది. కాని ఇప్పటి వరకు 510 కోట్ల వసూళ్ల ఎనౌన్స్ మెంట్ తప్ప, వెయ్యికోట్ల సందడి లేదు ఎందుకు? షేర్ వసూళ్లు 510 కోట్లు, గ్రాస్ కలెక్షన్స్ 1000 కోట్లు దాటాయన్న మాట నిజం కాదా? ఈ సినిమా విడుదలై ఐదు వారాలు దాటుతోంది. అయినా రోజుకి కనీసం 5 కోట్ల చొప్పున సౌైత్ నుంచే వసూళ్లొస్తున్నాయి. ఇక నార్త్ ఇండియాలో ఈ లెక్క 15 కోట్లుంది… అంటే ఇప్పటికీ రోజుకి 20 కోట్ల వరకు పాన్ ఇండియా లెవల్లో స్టిరంగా దేవర వసూళ్లు షాక్ ఇస్తున్నాయి. ఇలా ఐదు వారాల తర్వాత కూడా స్థిరమైన వసూళ్లు రాబట్టడం కల్కీ వల్లే కాలేదు… కాని ఓవరాల్ కలెక్షన్స్ రిపోర్ట్ మాత్రం ఇంకా రాలేదు.. రావట్లేదు.. ఎందుకు?

దేవర విడుదలై నెల కావొస్తోంది…అయినా ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో రోజుకి కోటి రాబడుతోంది ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో ఏరియాలో కోటి చొప్పునా రెండు కోట్లు… తమిల్,మలయాళం, కన్నడ మార్కెట్లలో మూడు కోట్లు.. మొత్తంగా 5 కోట్లు సౌత్ నుంచే డైలీ కలెక్ట్ అవుతున్నాయి. ఇక నార్త్ ఇండియాలో ఏకంగా 15 కోట్లు రాబడుతోంది.

ఒక పాన్ ఇండియా మూవీ విడుదలైన నెల దగ్గరపడుతున్నాక కూడా ఈరేంజ్ లో రోజుకి 15 కోట్లు రాబట్టడం అంటే రికార్డే… రీసెంట్ గా వచ్చిన ఆలియా మూవీ జిగ్రా కూడా హిందీ మార్కెట్ లో విడుదలైన 1`5 రోజుల వరకు కూడా 15 కోట్లు రాబట్టలేక తికమకపడింది..

సో లోకల్ హీరోలు, హీరోయిన్లే నార్త్ ఇండియాలో ఇంతగా రాబట్టలేక తికమకపడుతుంటే, ఇప్పటికీ
దేవరతో స్థిరమైన వసూల్లు రాబడుతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఇంత జరిగినా బిగినింగ్ లో వచ్చిన వసూళ్ల లెక్కలు చూసినా ఈ పాటికే దేవర వెయ్యికోట్ల క్లబ్ లో చేరాలి..

కాని సినిమా విడుదలైన 6 రోజులకి 400 కోట్లు, 10 రోజులకి 510 కోట్ల వసూళ్ల ఎనౌన్స్ మెంట్లు వచ్చాయి. ఆ తర్వాత పోటీ ఇచ్చేమూవీ రాలేదు. పోటీ అనుకున్న సూపర్ స్టార్ రజినీ మూవీ, కార్తి ప్రయోగం రెండు గాడి తప్పాయి… దేవరకి వసూళ్ళ వరదలు కంటిన్యూ అయ్యాయి. అయినా 1000 కోట్ల పోస్టర్ పడలేదు

ఐతే షేర్ వసూళ్లు 510 కోట్లు వచ్చాయి కాని, గ్రాస్ వసూళ్లు ఎప్పుడో వెయ్యికోట్లు దాటితే, ఆ లెక్కలు ఎనౌన్స్ చేయకూడదనే పద్దతిని దేవరటీ ఫాలో అయ్యిందన్నారు. కాని బేసిగ్గా షేర్ వసూళ్లే బయటికి చెప్పరు… గ్రాస్ కలెక్షన్సే ఎనౌన్స్ చేస్తారు…

కారణం ఏదైనా 1250 కోట్లు రాబట్టిన త్రిబుల్ ఆర్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెండోసారి బాక్సాఫీస్ లో థౌజెండ్ వాలా పేల్చినట్టే కనిపిస్తున్నాడు. కాని లెక్కలు చూస్తే 900 కోట్ల దరి దాపుల్లోనే ఉన్నాయనే చర్చ జరుగుతోంది. సో మరో నెలలో ఈజీగా దేవర 1000 కోట్ల క్లబ్ లోచేరొచ్చు… అప్పుడే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావొచ్చు…