డిజాస్టర్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ చేతిలో 5 ప్యాన్ ఇండియన్ సినిమాలా..?

ఇండస్ట్రీకి ఎలాంటి సినిమాతో వచ్చామని కాదు.. వచ్చిన తర్వాత ఎలాంటి మ్యాజిక్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. తాజాగా భాగ్యశ్రీ బోర్సే విషయంలో ఇదే జరుగుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2025 | 11:55 AMLast Updated on: Mar 06, 2025 | 11:55 AM

5 Pan Indian Movies In The Hands Of The Heroine Who Gave A Disaster Entry

ఇండస్ట్రీకి ఎలాంటి సినిమాతో వచ్చామని కాదు.. వచ్చిన తర్వాత ఎలాంటి మ్యాజిక్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. తాజాగా భాగ్యశ్రీ బోర్సే విషయంలో ఇదే జరుగుతుంది. గతేడాది రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది భాగ్యశ్రీ. ఈ సినిమా డిజాస్టర్.. కనీసం మూడు రోజులు కూడా ఆడలేదు. కానీ మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్ భాగ్యశ్రీ కెరీర్ మీద ఇంత కూడా పడలేదు. ప్రస్తుతం ఈమె మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియన్ హీరోయిన్. దీనికోసం స్టార్ హీరోలు కూడా పోటీ పడుతున్నారు. ఫ్లాప్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కూడా తమ సినిమాలకు రెడ్ కార్పెట్ వేసి మరీ భాగ్యశ్రీని ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం ఈమె చేతిలో ఐదు సినిమాలున్నాయి. పైగా అవేమీ చిన్న సినిమాలు కాదు.. అన్ని ప్యాన్ ఇండియా సినిమాలే.

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి జరిపిస్తున్న కింగ్డమ్ సినిమాలో ముందు శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైంది. అయితే డేట్స్ విషయంలో సమస్య రావడంతో ఈమె తప్పుకొని భాగ్యశ్రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక రామ్ పోతినేని, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి దర్శకుడు మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న క్లాస్ లవ్ స్టోరీ లో కూడా భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. దుల్కర్ సల్మాన్ ప్యాన్ ఇండియన్ సినిమా కాంతాలో కూడా ఈమెనే హీరోయిన్. వీటితో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ లో సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది. ఇందులో కూడా భాగ్యశ్రీని హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది.

ఇన్ని సినిమాలు చేతిలో ఉండగానే తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్టు భాగ్యశ్రీ ఖాతాలోకి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రభాస్ హీరోగా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది. బ్రహ్మ రాక్షస్ అనే టైటిల్ దీనికోసం పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించబోతుందని తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు గానీ నిజంగానే వర్కౌట్ అయింది అంటే భాగ్యశ్రీ కెరీర్ మరొక స్థాయికి వెళ్ళినట్టే. చేతిలో ఐదు భారీ సినిమాలతో టాలీవుడ్లో నెక్స్ట్ నెంబర్ వన్ నేనే అని చెప్పకనే చెప్తుంది ఈ ముద్దుగుమ్మ. డిజాస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కూడా.. ఆ తర్వాత మాత్రం నెక్స్ట్ లెవెల్ జోరు చూపిస్తుంది ఈ ముంబై బ్యూటీ. ఎంతైనా ఇండస్ట్రీలో అదృష్టం ఉంటే సరిపోతుంది ఒక్కొక్కసారి.