1000 కోట్లలో అప్పుడే 50 కోట్లు… ఆమె వచ్చింది.. మరి దేనికెంత..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు తో ప్రియాంక చోప్రా చేస్తున్న సినిమా, కొత్త షెడ్యూల్ షురూ అయ్యింది. ఫస్ట్ షెడ్యూల్ ని 40 కోట్ల సెట్లో 10 కోట్ల ఖర్చు తో తీస్తే, ఇక సెకండ్ షెడ్యూల్ ని అదే సెట్లో పూర్తి చేయబోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 18, 2025 | 08:05 PMLast Updated on: Feb 18, 2025 | 8:05 PM

50 Crores Out Of 1000 Crores She Came And Why

సూపర్ స్టార్ మహేశ్ బాబు తో ప్రియాంక చోప్రా చేస్తున్న సినిమా, కొత్త షెడ్యూల్ షురూ అయ్యింది. ఫస్ట్ షెడ్యూల్ ని 40 కోట్ల సెట్లో 10 కోట్ల ఖర్చు తో తీస్తే, ఇక సెకండ్ షెడ్యూల్ ని అదే సెట్లో పూర్తి చేయబోతున్నారు. మొన్నటికి మొన్న ఫస్ట్ షెడ్యూల్ తర్వాత చిన్న బ్రేక్ ఇవ్వటంతో, ఆ గ్యాప్ లో తన సోదరుడి పెళ్లికెళ్లి వచ్చింది ప్రియాంక చోప్రా.. ఇప్పుడు మళ్లీ తిరిగి సెట్లో అడుగుపెట్టింది. ఈ షెడ్యూల్ తర్వాతే కెన్యా అడవుల్లో 35 రోజుల లాంగ్ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేశాడు రాజమౌళి. మార్చ్ లో మొత్తం టీం కెన్యాలో బిజీ కాబోతోంది. అంతవరకు ఓకే కాని, కేవలం అంటే కేవలం మొదటి షెడ్యూల్ షూటింగ్ కే 50 కోట్లు ఖర్చయ్యిందంటే, సెకండ్ షెడ్యూల్ ఖర్చెంత…? టీం అంతా కెన్నాలో 35 రోజుల లాంగ్ షెడ్యూల్ తో బిజీ అయితే వచ్చే ఖర్చెంతా…? ఈ లెక్కలే షాక్ ఇచ్చేలా ఉన్నాయి. స్టార్స్ రెమ్యునరేషన్స్ అన్నీ అడ్వాన్స్ ఎమౌంట్లే… కాబట్టి అవన్నీ తీస్తే 900 కోట్ల బడ్జెట్ లో ఇంకా దేని కోసం ఎంత ఖర్చు పెట్టబోతున్నారు..? ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు..? హావేలుక్

సూపర్ స్టార్ మహేశ్ బాబు తో మొదటి షెట్యూల్ షూటింగ్ కే 50 కోట్లు ఖర్చు పెట్టిన టీం, సెకండ్ షెడ్యూల్ కి 10 కోట్లు ఖర్చుచేయబోతోందట. ఇక ఉగాది తర్వత 150 మందితో కలిసిన టీం కెన్యా అడవులకి ప్రయాణ కాబోతోంది. అక్కడే 35 రోజులు గ్రాఫిక్స్ ఎక్కువగా అవసరమైన ఛేజింగ్ సీన్లు, హంటింగ్ సీన్లుతీయబోతున్నారని తెలుస్తోంది. దానికి 75 కోట్ల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది.
ఈ మూవీలో జంతువులని రియల్ లొకేషన్స్ లో షూట్ చేసినా, యాక్షన్ సీన్స్ లో వాడేది మాత్రం గ్రాఫిక్సే అని తెలుస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ తో ఆల్రెడీ చాలా లొకేషన్లు, సీన్లు ముందే తీసింది ఫిల్మ్ టీం. కాకపోతే అవి కేవలం రెఫరెన్స్ కోసమే అని తెలుస్తోంది. అచ్చం అవతార్ మూవీ టీం ముందు కంప్యూటర్ లో ఓ ప్రత్యేక లోకాన్ని క్రియేట్ చేసి, దాన్ని కెమెరాకు అటాచ్ చేసి సినిమా తీశాక, మళ్లీ పాండారా గ్రహాన్ని గ్రాఫిక్స్ లో రీ క్రియేట్ చేశారు.

అచ్చంగా ఇక్కడ మహేశ్ బాబు సినిమా తాలూకు చాలా కీ సీన్స్ ని ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ సాయం తో తీసి, దాన్ని రియాల్ షూట్ కి అటాచ్ చేయబోతున్నారు. సో ఈ ప్రాసెస్ కి 100 కోట్లు , కెన్యా షూటింగ్ కి 75 కోట్లు… ఆతర్వాత పోస్ట్ ప్రొడక్షన్ లో సినిమా మొత్తం ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ తో రీక్రియేట్ చేసేందుకు 350 కోట్లు ఖర్చు చేయబోతున్నారట.అంటే త్రిబుల్ ఆర్ మూవీ తీసేందుకు అయిన బడ్జెట్ కి , మహేశ్ బాబు మూవీ లో ఆర్టీఫీషియల్ ఇంటెలీజెన్స్ కే ఖర్చు చేయబోతున్నారని తేలింది. అలా చూస్తే 585 కోట్లు ఏప్రిల్ లోగా ఖర్చైపోతాయని తెలుస్తోంది. మిగతా 415 కోట్లలో వందకోట్లు ప్రమోషన్ కే కేటాయించారు. 100 కోట్ల స్టార్స్ అండ్ క్రూ బేసిక్ అడ్వాన్స్ లకే సరిపోతుంది. సో ఇక 215 కోట్లతో 80శాతం మూవీ మేకింగ్ అంతా తీయాల్సి ఉంటుంది.

మొత్తంగా చూసినా మహేశ్ బాబు మూవీకి 1000 కోట్ల భారీ ఖర్చంటే, ఆ నెంబర్ అందర్ని ఆశ్చర్య పరిచింది. కాని ఇందులో వాడే టెక్నాలజీ, మేకింగ్, అన్నీ కలిపితే వెయ్యికోట్లు చాలా చిన్న నెంబర్ అనే భావన కలుగుతోంది. అది కూడా మహేశ్ బాబు, రాజమౌళి, అడ్వాన్స్ తప్ప రెమ్యునరేషన్ తీసుకోకుండానే లెక్క 1000 కోట్లకు చేరుతోంది. రిలీజయ్యాక ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటారు కాబట్టి, అలా లెక్క 1000 కోట్ల దగ్గరే ఆగుతోంది. లేదంటే 1500 కోట్ల హెవీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీ ఇదే అయ్యేది.