బాలీవుడ్ పరువు కాపాడిన ‘ఛావా’ 500 కోట్లు ఫిక్స్…?

విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ లో వచ్చిన ఛావా సినిమా బాలీవుడ్ కు ప్రాణం పోసింది. ఈ సినిమాను తక్కువ అంచనా వేసిన వాళ్ళందరూ ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 18, 2025 | 12:45 PMLast Updated on: Feb 18, 2025 | 12:45 PM

500 Crore Fix For Chava Which Saved Bollywoods Reputation

విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ లో వచ్చిన ఛావా సినిమా బాలీవుడ్ కు ప్రాణం పోసింది. ఈ సినిమాను తక్కువ అంచనా వేసిన వాళ్ళందరూ ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. మొదటి రోజు సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చినా… ఆ తర్వాత మాత్రం జనాలకు సినిమా పిచ్చపిచ్చగా ఎక్కేసింది. ముఖ్యంగా హీరో విక్కీ కౌశల్ చివరి 40 నిమిషాలు చేసిన నటనకు విమర్శకులు సైతం సోషల్ మీడియాలో పాదాభివందనం చేస్తున్నారు. సినిమాలో నటించిన రష్మిక మందన కూడా తన రేంజ్ యాక్టింగ్ చూపించింది.

ఇక సినిమాకు వసూళ్లు మొదటి మూడు రోజులు 120 కోట్లకు పైగానే వచ్చాయి. ఇక బుధవారం నుంచి సినిమాకు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ అనలిస్టులు. బుధవారం చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉంది. మహారాష్ట్రలో దీన్ని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు పబ్లిక్ హాలిడే కూడా ఉంది. శివాజీ తనయుడు శంభాజీ సినిమా చావా కచ్చితంగా ఆ రోజు భారీగా చూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ ఒక్క రోజునే 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు అయ్యే ఛాన్స్ ఉందని… బుధా గురువారాల్లో సినిమా ఖచ్చితంగా 200 కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

ఇక ఈ సినిమా 2025లో బాలీవుడ్ కు ఒకరకంగా ఊపిరి పోసిందని చెప్పాలి. సోనుసూద్ హీరోగా వచ్చిన ఫతే సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. కంగనా రనౌత్ చేసిన ఎమర్జెన్సీ సినిమా కూడా ఆకట్టుకోలేదు. ఇక షాహిద్ కపూర్ చేసిన దేవా సినిమా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయింది. ఇలా జనవరి, ఫిబ్రవరిలో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇలాంటి టైంలో ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన చావా సినిమాపై జనాలు భారీ ఆశలు పెట్టుకున్నారు.

అంచనాలను మించి సినిమా ఉండటం, వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉండటంతో బాలీవుడ్ జనాలు ఊపిరి పీల్చుకున్నారు. విక్కీ కౌశల్ నటనపై నమ్మకం ఉన్న వాళ్ళు సినిమాకు వెళ్ళగా… వాళ్లకు తాను ఏం చేయగలనో చేసి చూపించాడు. ఇక సినిమాకు సౌత్ ఇండియాలో కూడా మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్ లు భారీగా పెరుగుతున్నాయి. అటు ఉత్తరాదిలో సినిమా జనాలకు స్లోగా ఎక్కుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో సినిమాకు కలెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి. కర్ణాటకలో కూడా సినిమాకు రెస్పాన్స్ భారీగా వచ్చింది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో వచ్చిన సినిమాల్లో ఛావా సినిమానే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచే ఛాన్స్ ఉంది.