ఏప్రిల్ 21న అవతార్ డైరెక్టర్ తో.. 5000 కోట్ల కాస్ట్ లీ ప్రెస్ మీట్…

సూపర్ స్టార్ మహేశ్ బాబు తో, రాజమౌళి తీస్తున్న ఎస్ ఎస్ ఎమ్ బీ 29 మూవీ ప్రెస్ మీట్ కి రంగం సిద్దమైంది. వచ్చేనెల 20కి అనుకున్న ప్రెస్ మీట్ ని ఒకరోజు లేటుగా, అంటే ఏప్రిల్ 21న ప్లాన్ చేస్తున్నారట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 27, 2025 | 03:56 PMLast Updated on: Mar 27, 2025 | 3:56 PM

5000 Crore Cost Press Meet With Avatar Director On April 21st

సూపర్ స్టార్ మహేశ్ బాబు తో, రాజమౌళి తీస్తున్న ఎస్ ఎస్ ఎమ్ బీ 29 మూవీ ప్రెస్ మీట్ కి రంగం సిద్దమైంది. వచ్చేనెల 20కి అనుకున్న ప్రెస్ మీట్ ని ఒకరోజు లేటుగా, అంటే ఏప్రిల్ 21న ప్లాన్ చేస్తున్నారట. ఇలా డేట్ మార్చటానికి రీజన్ హాలీవుడ్ దర్శకులైన జేమ్స్ కామెరున్, స్టీవెన్ స్పిల్ బర్గ్ ఇద్దరికే ఒకే డేట్ సెట్ కావట్లేదని తెలుస్తోంది. అసలే హాలీవుడ్ దిగ్గజాలైన డిస్నీప్, డ్రీమ్ వర్క్స్ బ్యానర్లు సీన్ లోకొచ్చాయి. 55 వేల థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేసేలా డీల్ ఫైనల్ చేసుకున్నాయన్న వార్తలొస్తున్నాయి. 5 వేల ప్రీరిలీజ్ బిజినెస్ ని ఎప్పుడో క్లోజ్ చేశారన్నారు. ఇవన్నీ ఏప్రిల్ 21న జరిగే భారీ ప్రెస్ మీట్ లో ఎనౌన్స్ చేయబోతున్నారు. అసలు టాలీవుడ్ బ్యాచ్ తీసే పాన్ వరల్డ్ మూవీ ప్రెస్ మీట్ కి అవతార్, జురాసిక్ పార్క్ లాంటి సినిమాలు తీసిన హాలీవుడ్ లెజెండ్స్ రాబోతుండటమే సెన్సేషన్… అలాంటి ప్రెస్ మీట్ లో 5 వేల కోట్ల డీల్ ని ఎనౌన్స్ చేస్తే, అది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హిస్టారికల్ రికార్డవుతుంది. ఇంతకి వచ్చేనెల 21న ఇంకేం జరగబోతోంది? హావేలుక్

మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న ఎస్ ఎస్ ఎంబీ మూవీ నిండి విషేషాలు ఎన్ని ఉన్నాడో, మేకింగ్ లో వింతలు అన్నీ ఉండబోతున్నాయి.. అవి చాలదన్నట్టు అసలు ఈ మూవీ ప్రెస్ మీట్ తో నే వరల్డ్ వైడ్ గా ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు రాజమౌలి. కేవలం హాలీవుడ్ డైరెక్టర్ స్టివెన్ స్పిల్ బర్గ్ కి కుదరట్లేదనే ఒక్క కారణంతో, ఏప్రిల్ 20 కి అనుకున్న ప్రెస్ మీట్ ని 21 కి అంటే ఒక రోజు వాయిదా వేశాడట.ఈవిషయంలో జేమ్స్ కామెరున్ ని కూడా కన్విన్స్ చేశాడని తెలుస్తోంది. అసలే హాలీవుడ్ లో అవతార్, టర్మినేటర్, టైటానిక్ లాంటి మూవీలు తీసిన లివింగ్ లెజెండ్ జేమ్స్ కామెరున్. ఇక జురాసిక్ పార్క్, ఇండియానా జోన్స్ తీసిన దర్శకుడు స్టీవెన్ స్పిల్ బర్గ్.. అంతేకాకుండా ఈ ఇద్దరు లెజెండ్స్ నిర్మాతలు, అలానే సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా చేసే సంస్థలు రన్ చేస్తారు.

హాలీవుడ్ కుబేరుల్లో ఈ ఇద్దరిదీ టాప్ ప్లేసే. అయితే ఇండియానా జోన్స్ తీసిన దర్శకుడు అవటంతో పాటు, డ్రీమ్ వర్క్స్ బ్యానర్ ఓనర్ అవటం వల్ల కూడా, స్టీవెన్ స్పిల్ బర్గ్ రాక ఈ ప్రెస్ మీట్ లో చాలా చాలా అవసరంగా మారింది. ఎందుకంటే రాజమౌలి సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 55 వేల థియేటర్స్ లో డిస్నీప్ తోపాటు డ్రీమ్ వర్క్స్ బ్యానర్ కూడా రిలీజ్ చేయబోతోంది.ఆల్రెడీ రెండు బ్యానర్స్ తో జరిగిన డీల్ వ్యాల్యూ 5 వేల కోట్లని తెలుస్తోంది. ఇవన్నీ ప్రెస్ మీట్లో భారీ ఎత్తున ఎనౌన్స్ చేసే ఛాన్స్ఉంది. ఈ దెబ్బతో ఇక ఇందులో స్టార్ కాస్ట్ ఎవరు, ఎప్పుడు రిలీజ్ లాంటి విషయాలన్నీ చాలా చిన్న విషయాలుగా మారిపోతున్నాయి. అసలు సినిమానే సైలెంట్ గా స్టార్ చేసిన రాజమౌళి, కేవలం ఈ ప్రెస్ మీట్ కోసమే, ఇంతకాలం సైలెంట్ గా ఉన్నాడని తెలుస్తోంది. వన్స్ ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ జరిగితే, బేసిక్ ప్లాట్ తో పాటు మిగతా వివరాలు బయటికొస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కి ఏడాది ముందునుంచే ఈ మూవీ సెన్సేషన్ అయ్యే ఛాన్స్ ఉంది..

ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే స్టీవెన్ స్పిల్ బర్గ్ రాక కాస్త డిలే అయ్యేలా ఉందని తెలిసి, ఏప్రిల్ 20న అనుకున్న ప్రెస్ మీట్ ని 21 కి షిఫ్ట్ చేశాడట రాజమౌలి. దీనికి అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరున్ ను కూడా కన్విన్స్ చేశారట. సో ఏడు ఖండాల్లో, ఏడు వింతలున్న ప్రదేశాల్లో షూటింగ్ జరగబోతున్న ఈమూవీ ఇండియానా జోన్స్ నే మించేలా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు రాజమౌలి. అంత ఖచ్చితంగా హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ నే మించే సినిమా అనటానికి రీజన్.

ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియానా జోన్స్ ఐదు భాగాల్లో.. మొదటి భాగం 3 వేల కోట్లు రాబడితే, రెండో భాగం 2,600 కోట్లు, మూడో భాగం 3,700 కోట్లు రాబట్టింది. ఇక నాలుగో భాగం 6,100 కోట్లు రాబడితే, రీసెంట్ సీక్వెల్ 8 వేల కోట్లు రాబట్టింది. వీటితో పోలిస్తే, రిలీజ్ కిముందయ్యే బిజినెస్ తోనే 5 వేల కోట్లు మహేశ్ బాబు సినిమా రాబడితే, రిలీజ్ అయ్యాక ఆరు వేల నుంచి పది వేల కోట్ల వరకు ఈ నెంబర్ పెరిగే ఛాన్స్ఉంది. అదే జరిగితే ఇది హాలీవుడ్ టాప్ మూవీస్ లిస్ట్ లో చేరే ఛాన్స్ఉంది.