5000 కోట్ల ప్రభాస్… 2000 కోట్ల తారక్ ని… టచ్ చేయటమే కష్టమే..?

పాన్ ఇండియా జర్నీకి ఏ స్టార్ సిద్ధమైనా, రెండు మూడు శిఖరాలను దాటిలి... అలాంటి శిఖరమే రెబల్ స్టార్ ప్రభాస్.. ఒకటి కాదు రెండు కాదు 5 పాన్ ఇండియా హిట్లను తన ఎకౌంట్ లో వేసుకున్న పాన్ ఇండియా కింగ్ ఈ కటౌట్...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 23, 2024 | 03:59 PMLast Updated on: Oct 23, 2024 | 3:59 PM

5000 Crore Prabhas 2000 Crore Tarak Is It Difficult To Touch

పాన్ ఇండియా జర్నీకి ఏ స్టార్ సిద్ధమైనా, రెండు మూడు శిఖరాలను దాటిలి… అలాంటి శిఖరమే రెబల్ స్టార్ ప్రభాస్.. ఒకటి కాదు రెండు కాదు 5 పాన్ ఇండియా హిట్లను తన ఎకౌంట్ లో వేసుకున్న పాన్ ఇండియా కింగ్ ఈ కటౌట్… ఇక రెండు పాన్ ఇండియా హిట్లతో హ్యాట్రిక్ కి సిద్దమైన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా డజన్ల కొద్ది రికార్డులు క్రియేట్ చేశాడు. పుష్ప తో పాటు మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి కూడా పాన్ ఇండియా రికార్డులున్నాయి. సో వీల్లంతా క్రియేట్ చేసిన రికార్డులు, సొంతం చేసుకున్న సక్సెస్ ని టచ్ చేయాలంటే, అంత ఈజీ కాదు. కాని పాన్ ఇండియా మార్కెట్ ని కొత్తగా టచ్ చేయాలనుకుంటున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు ముందు చాలా ఛాలెంజ్ లు రెడీ గా ఉన్నాయి. ఎంత రాజమౌలి సాయం చేసినా, తన మేకింగ్ వల్ల మార్కెట్ లో కాలం కలిసొచ్చినా, ప్రభాస్ ఐదు సినిమాలు, చరణ్, ఎన్టీఆర్ మూడు సినిమాలు, బన్నీ మరో మూవీ.. ఇలా ఇవన్నీ క్రియేట్ చేసిన రికార్డులని దాటటం ఈజీ టాస్క్ కాదు… కాని దాటాలి… లేదంటే పాన్ ఇండియా మార్కెట్ లో కొత్తగా చేయటానికి ఏముండదు.. పాన్ వరల్డ్ మార్కెట్ లోకి వెలితే తప్ప అది సాధ్యం కాదు…

రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ నలుగురే కాదు ఆఖిరికి యంగ్ హీరో తేజ సజ్జ కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబుకి హెడ్డేక్ గా మారాడు.. అంటే వీళ్లంతా మహేశ్ బాబుకి పోటీ అని కాదు, వాళ్లని సూపర్ స్టార్ పోటీ అని కాదు.. ఎవరి రేంజ్ వాళ్లదే.. మార్కెట్ లో ఎవరి క్రేజ్ వాళ్లదే.. ఇక్కడసలు పోలికేలేదు…

కాకపోతే పాన్ ఇండియా మార్కెట్ లోకి సూపర్ స్టార్ మహేశ్ బాబు తొలిసారి అడుగుపెడుతున్నాడు. ఎప్పుడు రాజమౌళి సినిమా మొదలౌతుందో కాని, అది షురూ కాకముందే డజన్ కి పైనే ఛాలెంజ్ లు మహేశ్ బాబు కోసం వేయిటింగ్

అందులో ఐదు ఛాలెంజెస్ రెబల్ స్టార్ ప్రభాస్ రెడీ చేస్తే, ఆరోది ఎన్టీఆర్, చరణ్ క్రియేట్ చేశారు. ఏడు, ఎనిమిది కూడా ఎన్టీఆర్, బన్నీ ఎకౌంట్ లోనే ఉన్నాయి… ఒకటి కాదు , రెండు కాదు ఏకంగా ఎనిమిది పాన్ ఇండియా హిట్లని, కనీసం రెండు డజన్ల రికార్డులని మహశ్ బాబు బ్రేక్ చేయాలి. లేదంటే కనీసం వాటిని రీచ్ అవ్వాలి…

రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి వెళుతున్నాడంటే, ఆల్రెడీ ఈలోపు క్రియేట్ అయిన రికార్డులన్నీ తనకి అడ్డుగోడలా మారక తప్పదు. మహేశ్ బాబుకి పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేం కాదు. తను ఇంతవరకు పాన్ ఇండియా మూవీ చేయకున్నా దేశవ్యాప్తంగా తనకున్న గుర్తింపుకి ఏ డోకా లేదు.

కాకపోతే రాజమౌళి డైరెక్షన్ లో తన సినిమా అంటే పాన్ ఇండియా షేక్ అవ్వాల్సిందే… ఐతే ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా ఎనిమిది సార్లు ఎనిమిది పాన్ ఇండియా మూవీలు మార్కెట్ ని షేక్ చేసిన రికార్డులు క్రియేట్ చేశాయి. అవే ఇప్పుడు బ్రేక్ అవ్వటం అంటే మిరాకిల్ జరిగితే తప్ప చెప్పలేం

బాహుబలి1, బాహుబలి 2, సాహో, సలార్, కల్కీ తో ప్రభాస్, త్రిబుల్ ఆర్, దేవరతో ఎన్టీఆర్, పుష్పగా బన్నీ, త్రిబుల్ ఆర్ తో చరణ్ ఇలా ఈనలుగురి హీరోల ఎనిమిది సినిమాలు, పాన్ ఇండియా వసూల్లతో చరిత్ర స్రుస్టించాయి.. భారీ ఓపెనింగ్స్, టోటల్ కలెక్షన్స్ లో టాప్ 10మూవీల్లో ఈ టాప్ ఎనిమిది సినిమాలు ఇవే ఉండటం, ఓవర్ సీస్ కలెక్షన్స్ లో రికార్డులు. ఇలా ఎన్నో రికార్డులు గుట్టల్లా పేరుకుపోయాయి. వాటన్నీంటికి మహేశ్ బాబు మూవీ బ్రేక్ చేస్తుందా? కనీసం రీచ్ అవుతుందా అంటే ఆరేంజ్ స్టామినా, క్రేజ్ ఈ హీరోకుంది. ట్రెండ్ సెట్ చేసే సత్తా రాజమౌలికి ఉంది…

కాకపోతే బాహుబలి 2 కి 1850 కోట్లు వస్తే, త్రిబుల్ ఆర్ కి 1250 కోట్లే వచ్చాయి. అంటే ఒక్క ప్రభాస్ ఉన్న బాహుబలి 2 వసూళ్లనే, ఇద్దరు హీరోలతో త్రిబుల్ ఆర్ తీసి రీచ్ కాలేకపోయాడు రాజమౌలి. అంటే తన సినిమా రికార్డులని తానే బ్రేక్ చేయలేకపోయాడు. మరి మహేశ్ బాబు సినిమాతో ఇన్ని రికార్డులని తట్టుకుంటాడా అంటే, ఇదే మూవీ పాన్ ఇండియా కాకుండా, పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేసుకుంటే సాధ్యం…అందుకే ఆలస్యమైనా అద్బుతాలు స్రుష్టించేందుకు సైలెంట్ గా పని కానిచ్చేస్తోంది జక్కన్న టీం. డిసెంబర్ సెకండ్ వీక్ భారీ ఎనౌన్స్ మెంట్ కి రెడి అయ్యిందికూడా.