5000 కోట్లు.. ఐ మ్యాక్స్ కెమెరా.. ఫస్ట్ ఇండియన్ మూవీ..
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్నమూవీ ఎస్ ఎస్ ఎమ్ బీ 29. అంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీ అనర్ధం.. అదే ప్రస్థుతానికి వర్కింగ్ టైటిల్. 7 ఖండాల్లో ఏడు వింతలున్న ప్రాంతాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి,

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్నమూవీ ఎస్ ఎస్ ఎమ్ బీ 29. అంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీ అనర్ధం.. అదే ప్రస్థుతానికి వర్కింగ్ టైటిల్. 7 ఖండాల్లో ఏడు వింతలున్న ప్రాంతాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను 55 వేల థియేటర్స్ లో రిలీజ్ అయ్యేలా హాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ ని రంగంలోకి దింపుతున్నాడు. ఐతే ఇది చాలదన్నట్టు ఇప్పుడు అంతకంటే ఇంట్రస్టింగ్ అప్రోచ్ తో వస్తున్నాడు. అదే ఐ మ్యాక్స్ కెమెరాతో సినిమాను షూట్ చేయటం. ఇంతవరకు ఐమ్యాక్స్ కెమెరాతో ఒక్క ఇండియన్ సినిమా కూడా తెరకెక్కించలేదు. ఫస్ట్ టైం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఐమ్యాక్స్ ని వాడబోతున్నాడు రాజమౌళి. ఈ కెమెరా వాడారంటేనే కనీసం 5 వేల నుంచి పదివేల కోట్ల వసూళ్లు రాబట్టే సినిమా వస్తున్నట్టే… రోల్స్ రాయిస్ కారు కొనాలంటే ఎలాంటి కండీషన్స్ ఉంటాయో, ఐమ్యాక్స్ కెమెరా వాడాలంటే కూడా అలాంటి కండీషన్స్ ఉంటాయి. కావాలంటే ఎవరైనా ఐమ్యాక్స్ కెమెరాని రెంట్ కు తీసుకొవచ్చు.. కాని అందరూ ఐమ్యాక్స్ మూవీ తీయలేరు.. అందుకే సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా హిస్టరీ క్రియేట్ చేసేలా ఉంది.. అదెలానో చూసేయండి.
సూపర్ స్టార్ మహేవ్ బాబుతో రాజమౌళి తీసే సినిమాకు, ఎలాంటి ప్రమోషన్ అక్కర్లేదు. ఇంకేదో అద్భుతాలు చేయాల్సిన పనిలేదు. ఆల్రెడీ ఓవర్ లోడెడ్ అద్భుతాలు అనేంతగా బయట టాక్ వెళ్లింది. అలాంటి ఈమూవీకి ఇప్పుడు హిస్టరీలో చోటు దక్కుతోంది. ఇంతవరకు ఏ ఇండియన్ సినిమాను కూడా ఐమ్యాక్స్ కెమెరాతో తెరకెక్కించలేదు. అదే సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ సినిమాకు జరగబోతోంది.ప్రపంచం లో ఏ కెమెరాతో సినిమా తీసినా సెవెంటీ ఎమ్ ఎమ్ స్క్రీన్ కోసమే… అదే ఐమ్యాక్స్ కెమెరాతో సినిమాతీస్తే, అది ప్రత్యేకంగా ఐమ్యాక్స్ థియేటర్స్ కోసమే… మామూలు స్క్రీన్ తో పోలిస్తే,ఐ మ్యాక్స్ లో వెండితెర 30 మీటర్ల ఎత్తు 22 మీటర్లకు పైనే వెడల్పు ఉంటాయి. ఓరకాంగా చెప్పాలంటే ఆడియన్స్ ముందు ఓ మూడు నాలుగు అంతస్తులంతా పెద్ద స్క్రీన్ ఉంటుంది.
అలాంటి స్క్రీన్ మీద త్రీడీలో ఓ మూవీ వేస్తే కళ్లముందుకే విజువల్స్ వచ్చేస్తాయి.. అలాంటి అతి కొద్ది ఐమ్యాక్స్ స్క్రీన్లు ప్రపంచ వ్యాప్తంగా 1772 ఉన్నాయి.. అంటే వీటన్నీంట్లో మహేశ్ మూవీ వస్తుందా అంటే, ఖచ్చితంగా.. అసలే 55వేల థియేటర్స్ లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు, హాలీవుడ్ దిగ్గజ సంస్థలు వాల్ట్ డిస్నీప్, డ్రీమ్ వర్క్స్ లాంటి బ్యానర్లు రంగంలోకి దిగాయి. ఈమూవీని వరల్డ్ వైడ్ గా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాయి.ఇక రిలీజ్ కి ముందే ఓటీటీ, శాటిలైట్, ఓవర్ సీస్, థియేట్రికల్, ఆడియో ఇలా ఈమూవీ 5 వేల కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఇలాంటి మూవీకి ఇప్పుడు ఐ మ్యాక్స్ కెమెరా తోడు కాబోతోంది. హాలీవుడ్ ని షేక్ చేసి, ఇండియాలో రెండు సార్లు రీ రిలీజ్ అయిన ఓపెన్ హైమర్ లో సగం వరకు ఐమ్యాక్స్ కెమెరాతోనే తీశారు. ఇంటర్ స్టెల్లార్ మూవీ 2 గంటలుంటే, దాంట్లో వన్ అవర్ మూవీ అంతా ఐమ్యాక్స్ కెమెరాతోనే తీశారు. ఇలా చూస్తే ఇన్ సెప్షన్ , జేమ్స్ బాండ్ మూవీ స్కైఫాల్ ఇవన్నీ ఈ కెమెరాతోనే తీశారు. కాకపోతే ఈ కెమెరాతో సినిమా తీయటం అంటే , సాధారణ కెమెరాతో పోలిస్తే ఒకటికి పది రెట్లు అదనంగా ఖర్చవుతుంది. అంతేకాకుండా ఐమ్యాక్స్ లో సినిమా తీయటం తేలిక కాదు…
టన్నుల కొద్ద బరువుండే ఈ కెమెరాతో ఓ సినిమా మొత్తం తీయటం అంటే, రోడ్డు రోలర్ తో ఆకాశంలో ఎగరాలనుకోవటమే..అయినా ఐ మ్యాక్స్ బిగ్ స్క్రీన్ లో ఓరేంజ్ క్వాలిటీ రావాలంటే తప్పదని, రెండున్నర గంటల సినిమాలో గంట నిడివి, అంటే ఇంపార్టెంట్ ఫైట్ సీన్లు, ఎక్స్ ట్రార్డినరీ గ్రాఫిక్స్ అవసరమయ్యే సీన్లు ఈ కెమెరాతో తీస్తారు. అదే పని ఇప్పుు రాజమౌళి చేస్తున్నాడు.అసలే 7 ఖండాల్లో 7 వింతలున్న ప్రదేశాల్లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. దీనికి తోడు అవతార్, టైటానిక్ ఫేం జేమ్స్ కామెరున్, ఇండియానా జోన్స్, జురాసిక్ పార్క్ ఫేం స్టీవెన్ స్పిల్ బర్గ్ లాంటి హాలీవుడ్ దిగ్గజాలు రాజమౌళి సినిమా కోసం రంగంలోకి దిగారు. ఏప్రిల్ 1న జరిగే ప్రెస్ మీట్ కి వస్తున్నారు. ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ లో వాళ్లు జాయిన్ అవుతున్నారు కాబట్టే, ఇలా వాళ్ళు సీన్ లోకొస్తున్నారు. ఇలా ఏది చూసినా ఈమూవీ లో ఓవర్ లోడెడ్ వింతలు…అలాంటి మూవీ కి ఇప్పుడు ఐమ్యాక్స్ కెమెరా తోడైంది..