5000 కోట్లు చాలు… 2 నిమిషాల వీడియోలో రాజమౌళి బాంబ్..
సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ సినిమా ప్రెస్ మీట్ 21న జరిగే వరకు, రోజుకో న్యూస్ షాక్ ఇస్తోంది. అసలే 55 వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోయే ఫస్ట్ ఇండియా మూవీ, ఐమ్యాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న మొదటి భారతీయ సినిమా

సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ సినిమా ప్రెస్ మీట్ 21న జరిగే వరకు, రోజుకో న్యూస్ షాక్ ఇస్తోంది. అసలే 55 వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోయే ఫస్ట్ ఇండియా మూవీ, ఐమ్యాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న మొదటి భారతీయ సినిమా… ఏడు ఖండాలు, ఏడు వింతలున్న ప్రదేశాల్లో తెరకెక్కే ఫస్ట్ వరల్డ్ మూవీ.. ఇలా అన్నిరకాలుగా ఈ సినిమాలో ఎన్నో వింతలున్నాయి. వీటికితోడు హనుమాన్, బార్బారికుడి లక్షణాలను కలిపి హీరో పాత్ర డిజైన్ చేయటం, మైథాలజీ, ఫిక్షన్ కి, సాహసాలు యాడ్ చేయటం.. ఇలా ఇంకెన్నో వింతలున్నాయి. అలాంటి మూవీని రెండు భాగాలుగా 2026, 2028 లో రిలీజ్ చేస్తారన్నారు. బాహుబలి రెండు భాగాలతో ఈ ట్రెండ్ సెట్ చేసిన రాజమౌళి, మళ్లీ అదే ఫార్ములా వాడబోతున్నాడన్నారు. కాని సడన్ గా లెక్కలు మారాయా? ఆల్రెడీ 5 వేల కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరుగుతుంటే, రాజమౌళి మరో 5 వేల కోట్లు అవసరం లేదంటున్నాడా? టేకేలుక్
సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీని రాజమౌళి, 7 ఖండాల్లో ఏడు వింతలున్న ప్రాంతాల్లో తీయబోతున్నాడు. ఆల్రెడీ 3 షెడ్యూల్ళ షూటింగ్ జరిగింది. కెన్యాలో నాలుగో షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేశారు. ఈనెల 21న జరిగే ప్రెస్ మీట్ తర్వాత ఫిల్మ్ టీం మొత్తం కెన్యా వెళ్ల బోతోంది. అక్కడే ఐమ్యాక్స్ కెమెరాతో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తీయబోతున్నారట..అంతా బానే ఉంది కాని, రెండు బాగాలుగా ప్లాన్ చేసిన ఎస్ ఎస్ ఎమ్ బీ ని కేవలం ఒక పార్ట్ గానే తీయాలని రాజమౌళి మనసు మార్చుకున్నాడా? మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల డ్యూరేషన్ తో ఒకే భాగంగా మహేశ్ బాబు సినిమా రాబోతోందా? ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా సాలిడ్ గా వినిపిస్తున్న టాక్.
ఇప్పటి వరకు రాజమౌళి సినిమా తాలూకు ఏ గాసిప్ వచ్చినా నిజమౌతూ వచ్చింది. ప్రియాంక చోప్రా నెగెటీవ్ రోల్ అన్నారు. తను ఇందులో జాయిన్ కాగానే, రూమర్సే నిజమయ్యాయన్నారు. ఫ్రుథ్విరాజ్ ఇందులో విలన్ అన్నారు… కట్ చేస్తే తను ఒరిస్సా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. అందుకే, ఇప్పుడు రెండు భాగాలుగా రావాల్సిన సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీ ఒకే భాగంగా మారబోతోందంటున్నారు.సో అది నిజమైతే ఏంటి పరిస్థితి..? బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్ అంటూ ఇలాంటి ఓ ట్రెండ్ ని తానే క్రియేట్ చేశాడు. అలానే పాన్ ఇండియాని షేక్ చేశాడు. కట్ చేస్తే మళ్లీ సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీకి అదే ఫార్ములా అన్నారు. 2026 దసరాకు మొదటి భాగం, 2028 దసరాకు రెండో భాగం రిలీజ్ అవుతున్నారు..
కాని పుష్ఫ 1, పుష్ప2, కేజీయఫ్ 1, కేజియఫ్ 2, పొన్నియన్ సెల్వన్ 1, పొన్నియన్ సెల్వన్ 2, తోపాటు సలార్ 1 తర్వాత సలార్ 2 రాబోతోంది. దేవర తర్వాత దేవర 2 ప్లాన్ చేశారు. కల్కీ 2 కూడా ఆన్ ది వే… సో ఈ ఫార్ములాని అంతా వాడి వాడి ఉన్నారు.. కాబట్టి ఒక భాగం తీసి అది హిట్ అయ్యాక, ఆ వేడి తగ్గక ముందే మరో భాగం వేగంగా అందించటం కష్టాసాధ్యమే కాదు, అనవసరపు రిస్క్ అనుకుంటున్నాడట రాజమౌళి. బాహుబలి టైంలో అది కొత్తగా అందరిని ఎగ్జైట్ చేసింది. ఇప్పుడా ఎగ్జౌట్ మెంట్ తగ్గుతోంది.. కాబట్టే
2026, 2028 లో ఒక్కో భాగం రిలీజ్ చేసేకంటే, రెండూ కలిపి 2027 దసరాకు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ రెండీంట్లో ఏది నిజమనేది ఈనెల 21న జరిగే ప్రెస్ మీట్ తో తేలే ఛాన్స్ ఉంది.